MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IND vs SA రెండో వన్డే నుంచి CSK కెప్టెన్‌ ఔట్.. విధ్వంసక వీరుడి రీఎంట్రీ !

IND vs SA రెండో వన్డే నుంచి CSK కెప్టెన్‌ ఔట్.. విధ్వంసక వీరుడి రీఎంట్రీ !

IND vs SA 2nd ODI: భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే (ODI) మ్యాచ్ డిసెంబర్ 3వ తేదీన (బుధవారం) రాయ్‌పూర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో ఏయే మార్పులు ఉండవచ్చు, ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుంది అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Dec 01 2025, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారత్ పోరాడి గెలిచింది
Image Credit : BCCI

భారత్ పోరాడి గెలిచింది

దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ విధ్వంసకర సెంచరీ బాదాడు. 120 బంతుల్లో 11 బౌండరీలు, 7 సిక్సర్లతో 135 పరుగులు సాధించాడు. అలాగే, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (57), కెప్టెన్ కేఎల్ రాహుల్ (60) కూడా హాఫ్ సెంచరీలు చేశారు.

అనంతరం బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 332 పరుగులకే ఆలౌట్ అయింది. మాథ్యూ బ్రీట్జ్కే (72), మార్కో జాన్సెన్ (70), కార్బిన్ బాష్ (67) అర్ధ శతకాలతో పోరాడినా ఫలితం దక్కలేదు.

24
2వ వన్డేలో ఒకే ఒక మార్పుతో భారత జట్టు
Image Credit : X/BCCI

2వ వన్డేలో ఒకే ఒక మార్పుతో భారత జట్టు

డిసెంబర్ 3న జరగనున్న 2వ వన్డే మ్యాచ్‌లో భారత జట్టులో ఒకే ఒక మార్పు ఉండే అవకాశం ఉందని సమాచారం. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో రిషబ్ పంత్ ఎంట్రీ ఉంటుందని సమాచారం.

మొదటి వన్డేలో తనకు లభించిన ఏకైక అవకాశాన్ని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో 2వ వన్డేలో అతని స్థానంలో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ను ఆడించే అవకాశం ఉంది.

మిగతా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్‌లో, విరాట్ కోహ్లీ వన్-డౌన్‌లో, ఆ తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఉంటారు.

Related Articles

Related image1
రో కో దెబ్బ అట్లుంటది మరి.. గంభీర్-అగార్కర్‌తో బీసీసీఐ అత్యవసర భేటీ !
Related image2
భారత్ ను భయపెట్టేశారు భయ్యా.. సౌతాఫ్రికా సూపర్ ఫైట్ !
34
మిడిల్ ఆర్డర్‌లో పంత్, జడేజా
Image Credit : X/BCCI

మిడిల్ ఆర్డర్‌లో పంత్, జడేజా

మిడిల్ ఆర్డర్‌లో వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, చివర్లో రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తారు. స్పిన్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉంటారు. ఫాస్ట్ బౌలింగ్‌లో మొదటి వన్డేలో అద్భుతంగా రాణించిన హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలు ఉంటారు.

44
భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)
Image Credit : Getty

భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

దక్షిణాఫ్రికాతో జరిగే 2వ వన్డే కోసం భారత జట్టు బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా):

1. కేఎల్ రాహుల్ (కెప్టెన్)

2. రోహిత్ శర్మ

3. యశస్వి జైస్వాల్

4. విరాట్ కోహ్లీ

5. రిషబ్ పంత్

6. వాషింగ్టన్ సుందర్

7. రవీంద్ర జడేజా

8. హర్షిత్ రాణా

9. కుల్దీప్ యాదవ్

10. అర్ష్‌దీప్ సింగ్

11. ప్రసిద్ధ్ కృష్ణ

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 నుంచి స్టార్ ఆల్‌రౌండర్లు ఔట్.. బ్రేస్‌వెల్, హసరంగకు ఏమైంది?
Recommended image2
T20 World Cup 2026 : సంజూ కు ఛాన్స్.. బుమ్రా ఈజ్ బ్యాక్.. కానీ గంభీర్ టెన్షన్ తగ్గట్లేదు
Recommended image3
Abhishek Sharma : టీమిండియాకు బిగ్ షాక్.. నమీబియాతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ దూరం?
Related Stories
Recommended image1
రో కో దెబ్బ అట్లుంటది మరి.. గంభీర్-అగార్కర్‌తో బీసీసీఐ అత్యవసర భేటీ !
Recommended image2
భారత్ ను భయపెట్టేశారు భయ్యా.. సౌతాఫ్రికా సూపర్ ఫైట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved