MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Ayush Mhatre : సీఎస్కే అభిమానులకు బ్యాడ్ న్యూస్.. సీజన్ మొత్తానికి స్టార్ ఓపెనర్ దూరం

Ayush Mhatre : సీఎస్కే అభిమానులకు బ్యాడ్ న్యూస్.. సీజన్ మొత్తానికి స్టార్ ఓపెనర్ దూరం

Ayush Mhatre : సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన చెన్నై సూపర్ కింగ్స్ యువ సెన్సేషన్ ఆయుష్ మాత్రే, ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న జట్టుకు ఇది బిగ్ షాక్ అని చెప్పాలి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 21 2026, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపీఎల్ 2026 నుంచి స్టార్ బ్యాటర్ ఆయుష్ మాత్రే అవుట్
Image Credit : ANI

ఐపీఎల్ 2026 నుంచి స్టార్ బ్యాటర్ ఆయుష్ మాత్రే అవుట్

ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, 18 ఏళ్ల యువ సంచలనం ఆయుష్ మాత్రే గాయం కారణంగా ఈ టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ దూరమయ్యాడు. ఈ విషయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు మాత్రే దూరం కావడం అభిమానులను కలవరపెడుతోంది.

25
హైదరాబాద్ మ్యాచ్‌లో అసలేం జరిగింది?
Image Credit : Getty

హైదరాబాద్ మ్యాచ్‌లో అసలేం జరిగింది?

ఏప్రిల్ 18న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే గాయపడ్డాడు. ఛేజింగ్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మాత్రే, కేవలం 13 బంతుల్లోనే 30 పరుగులు చేసి జోరుమీద కనిపించాడు. అయితే, ఒక డబుల్ రన్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అతని ఎడమ కాలి హ్యామ్‌స్ట్రింగ్ కండరం పట్టేసింది. విపరీతమైన నొప్పితో ఇబ్బంది పడుతున్నా, అతను అలాగే బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ, ఆ తర్వాత రెండు బంతులకే భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఈ గాయం కారణంగా అతను 6 నుండి 12 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Related Articles

Related image1
Tilak Varma : తిలక్ వర్మ ఊచకోత.. గుజరాత్‌పై మెరుపు సెంచరీతో చరిత్ర సృష్టించిన తెలుగోడు !
Related image2
Tilak Varma : తిలక్ వర్మ సెంచరీ విధ్వంసంతో నమోదైన 5 అద్భుత రికార్డులు ఇవే !
35
సీఎస్కే అధికారిక ప్రకటన.. రికవరీకి టైమ్ పడుతుంది
Image Credit : ANI

సీఎస్కే అధికారిక ప్రకటన.. రికవరీకి టైమ్ పడుతుంది

ఆయుష్ మాత్రే గాయంపై సీఎస్కే యాజమాన్యం సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. "సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఆయుష్ ఎడమ కాలి హ్యామ్‌స్ట్రింగ్‌కు తీవ్రమైన గాయమైంది. అతను కోలుకోవడానికి కనీసం 6 నుండి 12 వారాల సమయం పడుతుంది. అందుకే అతను ఐపీఎల్ 2026 సీజన్ నుండి తప్పుకుంటున్నాడు. ఆయుష్ త్వరగా కోలుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము" అని పేర్కొంది. మొదట ఇది చిన్న గాయమే అని భావించినా, స్కాన్ రిపోర్ట్స్‌లో కండరం తీవ్రంగా చిరిగినట్లు తేలింది. దీనివల్ల అతను దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరం కావాల్సిందే.

45
ఫామ్‌లో ఉన్న ప్లేయర్ దూరం కావడం తీరని లోటు
Image Credit : X/రాధిక

ఫామ్‌లో ఉన్న ప్లేయర్ దూరం కావడం తీరని లోటు

ఈ సీజన్‌లో సీఎస్కే తరపున ఆయుష్ మాత్రే అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆడిన 6 మ్యాచ్‌ల్లో 177.88 స్ట్రైక్ రేట్‌తో 201 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. పవర్‌ప్లేలో బౌలర్లపై విరుచుకుపడుతూ జట్టుకు మంచి ఆరంభాలను ఇస్తున్న మాత్రే లేకపోవడం సీఎస్కే బ్యాటింగ్ లైనప్‌ను బలహీనపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంఎస్ ధోనీ, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ వంటి కీలక ఆటగాళ్ల గాయాలతో ఇబ్బంది పడుతున్న చెన్నైకి, ఇప్పుడు మాత్రే దూరం కావడం గడ్డు కాలమనే చెప్పాలి.

55
మాత్రే ప్లేస్‌లో వచ్చేది ఎవరు?
Image Credit : ANI

మాత్రే ప్లేస్‌లో వచ్చేది ఎవరు?

ఆయుష్ మాత్రే స్థానాన్ని భర్తీ చేయడం సీఎస్కే మేనేజ్‌మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ప్రస్తుతం జట్టులో ఉన్న ఉర్విల్ పటేల్ ఒక ఆప్షన్ కావచ్చు. ఉర్విల్ టీ20ల్లో వేగంగా సెంచరీ చేసిన రికార్డు కలిగి ఉన్నాడు. అలాగే కార్తీక్ శర్మ పేరును కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ బయటి నుండి రీప్లేస్‌మెంట్ తీసుకోవాలనుకుంటే అన్మోల్‌ప్రీత్ సింగ్, యష్ ధుల్ లేదా యువ ఆటగాడు స్వస్తిక్ చికారా వంటి వారిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న చెన్నై, ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ లో విజయం తప్పనిసరి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL Tickets : సన్ రైజర్స్ మ్యాచ్ టికెట్లపై సూపర్ డిస్కౌంట్.. రూ.1800 టికెట్ రూ.500కే..! ఎలా పొందాలో తెలుసా..?
Recommended image2
IPL 2026: ఉప్పల్‌లో సమఉజ్జీల మధ్య పోరు.. కానీ.! SRHకి అదొక్కటే సమస్య..
Recommended image3
Tilak Varma : తిలక్ వర్మ సెంచరీ విధ్వంసంతో నమోదైన 5 అద్భుత రికార్డులు ఇవే !
Related Stories
Recommended image1
Tilak Varma : తిలక్ వర్మ ఊచకోత.. గుజరాత్‌పై మెరుపు సెంచరీతో చరిత్ర సృష్టించిన తెలుగోడు !
Recommended image2
Tilak Varma : తిలక్ వర్మ సెంచరీ విధ్వంసంతో నమోదైన 5 అద్భుత రికార్డులు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved