MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. భార్య ప్రేమను ఎప్పుడు పరీక్షించాలో తెలుసా?

Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. భార్య ప్రేమను ఎప్పుడు పరీక్షించాలో తెలుసా?

ఆచార్య చాణక్యుడు మానవ జీవితాలకు సంబంధించి ఎన్నో విషయాలను తన నీతి సూత్రాల్లో పేర్కొన్నాడు. చాణక్య నీతి ప్రకారం.. భార్య, స్నేహితుడు, బంధువుల ప్రేమను ఎప్పుడూ, ఎలా పరీక్షించాలో ఇక్కడ తెలుసుకుందాం.  

1 Min read
Author : Kavitha G
Published : May 28 2025, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చాణక్య నీతి
Image Credit : others

చాణక్య నీతి

ఆచార్య చాణక్యుడు మానవులకు ఉపయోగపడే ఎన్నో జీవిత సత్యాలను బోధించాడు. చాణక్యుడి సలహాలను పాటిస్తే మంచి జీవితాన్ని గడపవచ్చని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. చాణక్య నీతిలో భార్యా భర్తల గురించి చాలా విషయాలను ప్రస్తావించారు. చాణక్యుడి ప్రకారం.. భార్య నిజంగా భర్తను ప్రేమిస్తోందా? లేదా అనేది ఒక సందర్భంలో తెలుసుకోవచ్చట. అది ఎప్పుడో చూద్దాం.

25
భార్య ప్రేమను ఎప్పుడు పరీక్షించాలి?
Image Credit : Getty

భార్య ప్రేమను ఎప్పుడు పరీక్షించాలి?

చాణక్యుడి ప్రకారం.. భర్తను దురదృష్టం వెంటాడినప్పుడు లేదా పదే పదే అతను జీవితంలో ఓడిపోయినప్పుడు.. భార్య ప్రేమ బయటపడుతుంది. భర్త అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనకు భార్య తోడుగా నిలబడకపోతే.. ఆమె ప్రేమ నిజమైనది కాదని చాణక్య నీతి చెబుతోంది. ఎవరైతే.. కష్ట సమయంలో కూడా భర్తకు తోడుగా, నీడగా ఉంటారో.. తానున్నాని భరోసానిస్తారో.. వారిదే నిజమైన ప్రేమ అని చాణక్యుడు తన బోధనల్లో వివరించాడు.

Related Articles

Related image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భర్త.. భార్యతో ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!
Related image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం జీవిత భాగస్వామి దగ్గర ఈ విషయాలు అస్సలు దాచకూడదు!
35
మంచి సేవకుడిని ఎలా గుర్తించాలి?
Image Credit : pinterest

మంచి సేవకుడిని ఎలా గుర్తించాలి?

చాణక్య నీతి ప్రకారం మంచి సేవకుడిని అతని పని చూసి గుర్తించాలి. పదే పదే చెప్పినా.. తప్పు చేసే సేవకుడిని వెంటనే వదిలించుకోవాలి. ఎందుకంటే అలాంటి సేవకులు యజమానికి నష్టం కలిగిస్తారు. వారి వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి వారిని దూరం పెట్టడం మంచిదని చాణక్య నీతి చెబుతోంది. 

45
బంధువులను ఎప్పుడు పరీక్షించాలి?
Image Credit : pinterest

బంధువులను ఎప్పుడు పరీక్షించాలి?

జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులను, బంధువులను పరీక్షించాలి. అలాంటి సమయంలో ఎవరు తోడుగా నిలుస్తారో వారే నిజమైన ఆప్తులు. మిగతా వారంతా అవసరం కోసం.. ప్రేమ నటించేవారేనని చాణక్యుడు తన నీతి సూత్రాల్లో పేర్కొన్నాడు. కష్టాల్లో తోడు ఉండే వారినే నమ్మాలని సూచించాడు.

55
మంచి మిత్రులను ఎలా పరీక్షించాలి?
Image Credit : pinterest

మంచి మిత్రులను ఎలా పరీక్షించాలి?

మంచి మిత్రుడు ఏ సందర్భంలోనైనా మిమ్మల్ని విడిచిపెట్టడు. సంతోషంలోనే కాదు.. కష్టంలో ఎవరు మీకు తోడుగా నిలుస్తారో వారే నిజమైన మిత్రులు. అలాంటి మిత్రులను ఎప్పుడూ దూరం చేసుకోవద్దని చాణక్య నీతి చెబుతోంది.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Fake Love Psychology: సైకాలజీ ప్రకారం మనల్ని ప్రేమించినట్లు నటించేవాళ్లు ఎలా ఉంటారో తెలుసా?
Recommended image2
True Love Psychology: సైకాలజీ ప్రకారం మనల్ని నిజంగా ప్రేమించే వాళ్లు చేసే 7 పనులు ఇవే!
Recommended image3
Relationship Psychology: అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారిలో కనిపించే 5 లక్షణాలివే! కావాలంటే చెక్ చేసుకోండి
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం భర్త.. భార్యతో ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి!
Recommended image2
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం జీవిత భాగస్వామి దగ్గర ఈ విషయాలు అస్సలు దాచకూడదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved