MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • వైఎస్ జ‌గ‌న్‌ను ఫాలో అవుతోన్న విజ‌య్‌.. ఇద్ద‌రిలో క‌నిపిస్తున్న కామ‌న్ పాయింట్ ఇదే.

వైఎస్ జ‌గ‌న్‌ను ఫాలో అవుతోన్న విజ‌య్‌.. ఇద్ద‌రిలో క‌నిపిస్తున్న కామ‌న్ పాయింట్ ఇదే.

దళపతి విజయ్ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీని స్థాపించిన విజ‌య్ గురువారం మదురైలో జరిగిన రెండో వార్షికోత్స‌వంతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 22 2025, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
500 ఎకరాల్లో భారీ సభ
Image Credit : jaganannaconnects,theactorvijayteamoff

500 ఎకరాల్లో భారీ సభ

తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రెండో వార్షికోత్స‌వ స‌భ‌ను మధురైలో అత్యంత అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. ఏకంగా 506 ఎకరాల విస్తీర్ణంలో స‌భ‌ను ఏర్పాటు చేశారు. సుమారు 1.5 లక్షల మంది కోసం సీటింగ్ ఏర్పాటు చేశారు. విజ‌య్ అభిమానులు పొట్టేత్తారు. దాదాపు 3 ల‌క్ష‌ల‌కు పైగా ప్ర‌జ‌లు ఈ స‌భ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

25
2026 ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలు
Image Credit : theactorvijayteamoff

2026 ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలు

వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో విజయ్ కీలక రాజకీయ సందేశాలు ఇచ్చారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు చారిత్రాత్మక మలుపు కానున్నాయని ఆయ‌న‌ అన్నారు. DMKని రాజకీయ ప్రత్యర్థిగా, BJPని భావజాల విరోధిగా అభివర్ణించారు. రాబోయే పోరు ప్రధానంగా TVK, DMK మధ్యనే జరుగుతుందని విజ‌య్ స్ప‌ష్టం చేశారు. DMK ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా అవినీతి, వారసత్వ రాజకీయాలకు కట్టుబడి ఉందని విజయ్ ఆరోపించారు. “పేరులో ధైర్యం ఉంటే సరిపోదు, ప్రజల కోసం ధైర్యంగా పనిచేయాలి” అంటూ సీఎం ఎం.కే. స్టాలిన్‌పై కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Related Articles

Related image1
ల‌క్ష‌ల్లో జీతం వ‌చ్చే కోర్సులు.. ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయితే చాలు. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
Related image2
భయపెడుతోన్న టమాట.. కిలో ధ‌ర ఎంతకు చేరిందో తెలుసా.?
35
ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ర్యాంప్
Image Credit : theactorvijayteamoff

ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ర్యాంప్

ఇక ఈ స‌మావేశంలో ర్యాంప్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ప్ర‌ధాన స‌భ‌కు అనుకొని సుమారు 300 మీట‌ర్ల ర్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌సంగం ప్రారంభించేందుకు ముందు విజ‌య్ ఈ ర్యాంప్ న‌డుస్తూ అభిమానుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు అభివాదం చేశారు. ఇది అభిమానుల్లో జోష్ నింపింది. విజయ్ ర్యాంప్‌పై న‌డుస్తున్నంతసేపు చ‌ప్ప‌ట్లు, అరుపుల‌తో స‌భ‌స్థ‌లం హోరెత్తింది. పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా విజయ్ ర్యాంప్‌పై న‌డుస్తూ సంద‌డి చేశారు.

45
జ‌గ‌న్‌తో పోలిక
Image Credit : YS Jagan/Twitter

జ‌గ‌న్‌తో పోలిక

అయితే ఈ ర్యాంప్ చూసిన త‌ర్వాత చాలా మంది ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పోల్చుతున్నారు. ఏపీలో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సిద్ధం పేరుతో స‌భ‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. రాష్ట్ర‌వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జ‌గ‌న్ భారీ ఎత్తున సిద్ధం స‌భ‌ల‌ను నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో కూడా ఇలాంటి ర్యాంప్‌ల‌ను ఏర్పాటు చేశారు. జ‌గ‌న్ ఈ ర్యాంప్‌పై న‌డుస్తూ త‌న‌దైన మేన‌రిజంతో మైక్ చ‌ప్పుడు చేస్తూ ప్ర‌జ‌లను ఊత్తేజ‌ప‌రిచారు. సిద్ధం స‌భ‌ల‌కు ప్ర‌జ‌లు కూడా పెద్ద ఎత్తున వ‌చ్చారు. అయితే అది ఓట్ల‌గా మాత్రం మార‌లేద‌ని ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత స్ప‌ష్ట‌మైంది.

55
ప్రశాంత్ కిషోర్ సాయం
Image Credit : theactorvijayteamoff/Instagram

ప్రశాంత్ కిషోర్ సాయం

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన మద్ధతును విజ‌య్‌కి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. విజ‌య్‌తో క‌లిసి ప్ర‌శాంత్ టీమ్ ప‌నిచేస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ముఖ్యంగా ఈ ర్యాంప్ ఏర్పాట్లను గ‌మ‌నిస్తే ఇది స్ప‌ష్ట‌మ‌వుతోంది. జ‌గ‌న్‌కు కూడా ప్ర‌శాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ టీమ్ ప‌నిచేసిన విష‌యం తెలిసిందే.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
రాజకీయాలు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
కన్నతల్లి ప్రైవేట్ వీడియోలు ప్రియుడికి పంపిన కూతురు
Related Stories
Recommended image1
ల‌క్ష‌ల్లో జీతం వ‌చ్చే కోర్సులు.. ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయితే చాలు. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
Recommended image2
భయపెడుతోన్న టమాట.. కిలో ధ‌ర ఎంతకు చేరిందో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved