- Home
- National
- Operation sindoor: 54 ఏళ్లలో భారత్ ఇలాంటి చర్యకు దిగడం ఇదే తొలిసారి.. వారిపై యుద్ధమే
Operation sindoor: 54 ఏళ్లలో భారత్ ఇలాంటి చర్యకు దిగడం ఇదే తొలిసారి.. వారిపై యుద్ధమే
పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన రెండు వారాల తర్వాత, భారత్ ఉగ్రవాద స్థావరాలపై భారీ ప్రతీకార చర్యలు తీసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పలు ప్రధాన ఉగ్ర స్థావరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని తెలుస్తోంది.

Indian Army
పహల్గామ్ దాడుల తర్వాత ప్రతీ భారతీయుడు ప్రతీకారంతో రగిలిపోయాడు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కనీసం ఉగ్రదాడిని ఖండిచకపోగా.. భారత్‌పైనే అవకాకులు చెవాకులు పేల్చింది. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని భారత్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ నోటికొచ్చినట్లు వాగారు అక్కడి కొందరు నాయకులు.
కాగా భారత ప్రభుత్వం మాత్రం ఉగ్రవాదుల అంతం లక్ష్యంగా కీలకంగా వ్యవహరించింది. పలుసార్లు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఈ క్రమంలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడులకు దిగింది.
ఆపరేషన్ సింధూర్ పేరుతో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణుల దాడులు నిర్వహించాయి. 1971 యుద్ధం తర్వాత మొదటిసారి మూడు భద్రతా దళాలు కలిసి పాకిస్తాన్‌పై పెద్ద స్థాయిలో దాడికి దిగిన సందర్భం. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Operation Sindoor
* ఈ దాడులు బుధవారం తెల్లవారుజామున 1:44కి ప్రారంభమయ్యాయి.
* పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై ఈ దాడులు జరిగాయి.
* ఈ ఉగ్ర స్థావరాల నుంచే భారత్‌పై దాడులు ప్లాన్ అవుతున్నాయని భారత సైన్యం వెల్లడించింది.
* ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి ఖచ్చితమైన లక్ష్యాలను వీక్షించే ‘కామికాజే డ్రోన్లు’ (loitering munitions) ఉపయోగించారు.
* మొత్తం తొమ్మిది టార్గెట్లు లక్ష్యంగా చేసుకోగా, వాటిలో జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రం బహావల్పూర్, లష్కరే తోయిబా ప్రధాన కేంద్రం మురిద్కే ఉన్నాయి.
* భారత ఆర్మీ ప్రకారం, పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను ఎక్కడా లక్ష్యంగా చేయలేదని, తగిన జాగ్రత్తలతో మాత్రమే ఉగ్ర స్థావరాలపై దాడులు చేశామని తెలిపింది.
* ఈ దాడులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షణ చేశారని సమాచారం.
* ఆపరేషన్ అనంతరం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు.. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడి వివరణ ఇచ్చారు.