MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ఏడేళ్ల క్రితం తప్పిపోయిన భర్త ఇన్‌స్టాలో ప్ర‌త్య‌క్షం.. రీల్ చూసిన భార్య‌కు ఫ్యూజులు అవుట్

ఏడేళ్ల క్రితం తప్పిపోయిన భర్త ఇన్‌స్టాలో ప్ర‌త్య‌క్షం.. రీల్ చూసిన భార్య‌కు ఫ్యూజులు అవుట్

సోష‌ల్ మీడియా ప్ర‌పంచాన్ని పూర్తిగా మార్చేసింది. సోష‌ల్ మీడియా ద్వారా నేరాలు జ‌రుగుతున్నాయని చెప్ప‌డంలో ఎంత నిజం ఉందో ఆ నేరాల‌ను చేధించ‌డంలో కూడా సోష‌ల్ మీడియా ఉప‌యోగ‌ప‌డుతుంది. తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Sep 03 2025, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పెళ్లి జ‌రిగిన ఏడాదికే అదృశ్యం
Image Credit : Representative image

పెళ్లి జ‌రిగిన ఏడాదికే అదృశ్యం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అతామౌ గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్ అలియాస్ బబ్లూ, 2017లో మురార్నగర్‌కు చెందిన శీలా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఒక ఏడాదిలోనే వారి సంబంధాలు క్షీణించాయి. కట్నం పేరుతో బంగారు గొలుసు, ఉంగరం కోసం ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవి అందకపోవడంతో శీలాను ఇంటి నుంచి బయటికి పంపేశారు. దీంతో ఆమె కుటుంబం కట్న వేధింపుల కేసు పెట్టింది. ఇదే సమయంలో 2018 ఏప్రిల్‌లో జితేంద్ర అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు.

24
శీలాపై హత్య ఆరోపణలు
Image Credit : Asianet News

శీలాపై హత్య ఆరోపణలు

జితేంద్ర కనిపించకపోవడంతో అతని తండ్రి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు గాలింపు చేపట్టినా ఫలితం రాలేదు. ఇంతలో జితేంద్ర కుటుంబం, శీలా కుటుంబాన్ని నిందిస్తూ "మా కొడుకును చంపి శరీరాన్ని అదృశ్యం చేశారు" అని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో శీలా ఎన్నో సంవత్సరాలు అవమానాలను భరించాల్సి వచ్చింది.

Related Articles

Related image1
Alien Attack: భూమిపై దాడి చేసేందుకు వస్తున్న ఏలియన్స్.. నవంబర్‌లోనే అటాక్.?
Related image2
OYO: ఓయో రూమ్‌కి వెళ్లే వారికి పండగలాంటి వార్త.. ఈ విషయం తెలిస్తే గంతేస్తారు.
34
సోషల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం
Image Credit : Asianet News

సోషల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం

ఏడు సంవత్సరాల తరువాత శీలా ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో జితేంద్రను గుర్తించింది. అతను మరో మహిళతో లూధియానాలో ఉంటూ వీడియోలు తీస్తున్నాడు. ఈ రీల్ వైరల్ కావడంతో నిజం బయటపడింది. శీలా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. జితేంద్ర కావాల‌నే ఇంటి నుంచి పారిపోయి లూధియానాలో మరో మహిళను పెళ్లి చేసుకుని జీవిస్తున్నట్లు విచార‌ణ‌లో తేలింది.

44
పోలీసులు కేసు నమోదు
Image Credit : Getty

పోలీసులు కేసు నమోదు

కోట్వాలి సండిలా పోలీస్‌స్టేషన్‌కి శీలా ఫిర్యాదు చేసిన తరువాత పోలీసులు జితేంద్రను అదుపులోకి తీసుకున్నారు. రెండు వివాహాలు, మోసం, కట్న వేధింపుల కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అతను పోలీసు కస్టడీలో ఉన్నాడు. శీలా మీడియాతో మాట్లాడుతూ "నా భర్త కనిపించకుండా పోయిన తరువాత, అతని కుటుంబం నాపై హత్య ఆరోపణలు చేసింది. కానీ నిజానికి వారు నన్ను మోసం చేశారు. ఇప్పుడు రీల్స్‌లో అతని నిజమైన జీవితం బయటపడింది" అని చెప్పింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
నేరాలు, మోసాలు
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
కన్నతల్లి ప్రైవేట్ వీడియోలు ప్రియుడికి పంపిన కూతురు
Related Stories
Recommended image1
Alien Attack: భూమిపై దాడి చేసేందుకు వస్తున్న ఏలియన్స్.. నవంబర్‌లోనే అటాక్.?
Recommended image2
OYO: ఓయో రూమ్‌కి వెళ్లే వారికి పండగలాంటి వార్త.. ఈ విషయం తెలిస్తే గంతేస్తారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved