MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • India Pakistan war: ఈ ఐదు మిస్సైళ్లు చాలు పాకిస్తాన్ పని పట్టడానికి

India Pakistan war: ఈ ఐదు మిస్సైళ్లు చాలు పాకిస్తాన్ పని పట్టడానికి

India Pakistan war: భార‌త్ బలమైన సైనికుల‌కు తోడుగా దుర్భేద్యమైన అస్త్ర శక్తిని క‌గిలివుంది. శత్రుదేశాలను నిమిషాల్లో అంతం చేయ‌గ‌ల ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుసుకోబోయే ఐదు మిస్సైళ్లు చాలు పాకిస్తాన్ ప‌నిప‌ట్ట‌డానికి. శ‌త్రు దేశాల‌కు వ‌ణుకు పుట్టించే భార‌త్ వ‌ద్ద ఉన్న ఆ ఐదు క్షిపణులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : May 09 2025, 03:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Top 5 Indian missiles that can strike deep into Pakistan: భారతదేశం తాను కలిగి ఉన్న అత్యాధునిక క్షిపణుల శక్తిని తాజా ఆపరేషన్ సింధూర్ లో మరింత బలంగా ప్రదర్శించింది. బ్రహ్మోస్ నుండి అగ్ని వరకూ భారత రక్షణ వ్యవస్థలో కీలకంగా నిలిచిన ఈ ఐదు ప్రధాన క్షిపణులు శత్రుదేశాలపై తక్షణ, ఖచ్చితమైన ప్రతీకారానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి కొన్ని నిమిషాల్లో శత్రువు స్థావరాలను నేలమట్టం చేయగల సామర్థ్యంతో ఉన్నాయి. పాకిస్తాన్ పనిపట్టే 5 క్షిపణుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

26

1. బ్రహ్మోస్ - సూపర్‌సోనిక్ గేమ్ ఛేంజర్

భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ప్రపంచంలోనే వేగవంతమైన క్రూయిజ్ మిస్సైల్. ఇది మాక్ 3 (శబ్ద వేగం కంటే మూడింతలు ఎక్కువ) కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించి, 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా తాకగలదు. ఇందులో ఉన్న టెక్నాలజీ వల్ల ఇది శత్రువు రక్షణ వ్యవస్థలను ఛేదించగలదు.

36

2. అగ్ని సిరీస్ - భారత దీర్ఘ శ్రేణి శక్తి మిస్సైల్

అగ్ని సిరీస్‌లోని అగ్ని-V అంతరిక్ష స్థాయి క్షిపణి. ఇది 5,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. ఈ క్షిపణులు సాధారణ లేదా అణు ఆయుధాలను మోయగల సామర్థ్యంతో ఉంటాయి.

46

3. ప్ర‌లయ్ - త‌క్కువ స‌మ‌యంలో దుమ్మురేపే  మిస్సైల్

ప్రలయ్ అనేది శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్. ఇది 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను వేగంగా, ఖచ్చితంగా ముట్టడించగలదు. దీనిని మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించబడేలా రూపొందించారు. 

56

4. నిర్భయ్ - రాడార్‌కి దొరక్కుండా దూసుకెళ్లే మిస్సైల్

నిర్భయ్ అనేది సబ్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. ఇది తక్కువ ఎత్తులో ఎగురుతూ, 1,000 కిలోమీటర్ల దూరాన్ని దాటి లక్ష్యాన్ని తాకగలదు. ఇది శత్రుదేశం లోతుల్లో తాకాలసిన లక్ష్యాలకు అనుకూలంగా ఉంటుంది.

66

5. శౌర్య - హైపర్‌సోనిక్ మిస్సైల్

శౌర్య హైపర్‌సోనిక్ వేగంతో ప్రయాణించే క్షిపణి. దీన్ని కెనిస్టర్ ద్వారా ప్రయోగించవచ్చు. ఇది 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాకగలదు. దీనిని గుర్తించడం, తిప్పికొట్టడం చాలా కష్టమైన పని.

ఆపరేషన్ సింధూర్, త‌ర్వాత జ‌రిపిన దాడుల‌తో ఈ క్షిపణుల యాక్టివేషన్ ద్వారా భారత్ తన రక్షణలో ఎంతగా సిద్ధంగా ఉందో ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. శత్రుదేశాలపై తక్షణ ప్రతీకార చర్యల్లో ఈ ఆయుధాలు కీలక పాత్ర పోషించగలవని రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
పాకిస్తాన్
యుద్ధం
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్
ఆపరేషన్ సింధూర్
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
19 ఏళ్ల కుర్రాడు 180 మంది అమ్మాయిలతో లైంగిక చర్యలా...!
Recommended image2
అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం.. దీంతో ఆడబిడ్డలకు కలిగే ప్రయోజనాలివే..!
Recommended image3
Schemes : మహిళలకు నెలనెలా రూ.2,500, యువతకు రూ.5000
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved