MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • 19 ఏళ్ల కుర్రాడు 180 మంది అమ్మాయిలతో లైంగిక చర్యలా...!

19 ఏళ్ల కుర్రాడు 180 మంది అమ్మాయిలతో లైంగిక చర్యలా...!

ఇటీవల బయటపడ్డ ఓ ఘటన అమ్మాయిల పేరెంట్స్ కి వేకప్ కాల్ లాంటిది. మహారాష్ట్రలో ఓ యువకుడు వందలాదిమందిని లోబర్చుకున్న వ్యవహారం యావత్ దేశాన్ని షాక్ కి గురిచేసింది.

3 Min read
Author : Amarnath Vasireddy
Published : Apr 17 2026, 05:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఈ సమాజం ఎటుపోతోంది..?
Image Credit : ChatGPT AI

ఈ సమాజం ఎటుపోతోంది..?

మహారాష్ట్రలో 19 ఏళ్ళ అయాజ్ అనే వ్యక్తి 180 మంది అమ్మాయిలను లవ్ పేరుతొ ట్రాప్ చేసి లైంగిక చర్యలకు పాల్పడ్డాడు - వార్త.

నిందితుడు... శిక్ష.. ఈ వివరాలు మీడియా ఇస్తోంది. జనాలు చర్చించుకొంటున్నారు. అంతవరకు ఓకే.

కానీ..

ఈ నేరానికి మరో కోణం గురించి ఆలోచించకపోతే ఎలా..?

1. కాస్త ఎర్రగా బుర్రగా ఉండి క్రిమినల్ తెలివితేటలున్న ఒకడు వల విసిరితే ఏకంగా 180 అమ్మాయిలు పడిపోతారా..? వీరి తల్లితండ్రులు వీరిని ఎలా పెంచారు..?

2. వీరి చదువులు ఏమయ్యాయి..?

3. పోనీ... ఇది తొలి ఘటనా అంటే కాదు. పత్రికల్లో ప్రతిరోజు ఇలాంటి క్రైమ్ వార్తలు బోలెడు.

అమ్మాయిల భద్రత అంటే వారి జీవితాలు నాశనం అయిపోయాక సోషల్ మీడియాలో సానుభూతి పోస్ట్ లు పెట్టడమేనా..?

23
ఇంత నెగెటివిటీనా...?
Image Credit : Getty

ఇంత నెగెటివిటీనా...?

ఆ "కంప్యూటర్ టీచర్ ఈ అమ్మాయి దక్కలేదని ఫీల్ అవుతున్నాడు" అని ఇంకో చెత్త కామెంట్.

ఈ కామెంట్స్ అన్నీ అతను చూసాడు.

పాపం ఫీల్ కాలేదు. "సార్ దయ చేసి మా బడికి రండి" అని బతిమలాడి పిలిపించుకున్నాడు.

బడి చిన్నదే. హై స్కూల్ పిల్లలు అందరూ కూర్చున్నారు.

కంప్యూటర్ టీచర్ తన శ్రీమతిని కూడా క్లాస్ కు తెచ్చాడు. (ఆమె కూడా ఆ చెత్త కామెంట్స్ ను చూసింది)

మూడు గంటల క్లాస్.

పిల్లలు ఏడ్చారు .

టీచర్స్ ఏడ్చారు .

నా కంఠం కూడా గద్గదమయ్యింది.

"ఎడ్యుకేట్ చేస్తే ఎందుకు ఏడ్చారు" అని మరో డిటెక్టివ్ నారద ప్రశ్న వేయకండి.

చిన్న వయసులో దారితప్పితే బతుకు ఇలా అయిపోతుంది అని నేను చెబుతుంటే అమ్మాయిలు అబ్బాయిలు .. వెక్కిళ్లు ఒక్కటే తక్కువ.

5. గత పది రోజులుగా స్లేట్ ఎగ్జిక్యూటివ్స్ స్మార్ట్ స్టార్ట్ పేరుతొ అపార్ట్మెంట్ లు.. ప్రభుత్వ బడులు.. ప్రైవేట్ బడులు మురికి వాడలు ... పోష్ గేటెడ్ కమ్యూనిటీ లు..

ఇప్పటి దాక వంద క్లాసులు.

ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే .

6. పిలల్లు దేవుడు చల్లని వారు. ఒట్టి మాటలు కట్టి పెట్టి... ఒక్కొక్కరు నలుగుర్ని ఎడ్యుకేట్ చేస్తే సమాజం బాగుపడదా..?

7. సోషల్ మీడియా హిపోక్రసి.

పర్సనల్ లైఫ్ లో ఎలాంటి వారయినా సోషల్ మీడియా ఎక్కడంతో వీర విప్లవకారుడిగా సంఘ సంస్కర్తగా మారి పోతారు. టన్నుల కొద్దీ దొంగ ప్రేమను కారబోస్తారు.

ఛీ బతుకులు చెడ .

ఆ మధ్యలో ఒక ఘటన జరిగింది.

అత్మహత్య చేసుకొన్న వ్యక్తి పై క్యూసెక్కుల కొద్దీ దొంగ ప్రేమలు ఒలకబోశారు.

దాని ఫలితం ఇప్పుడు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకోవడం ట్రెండ్ అయిపొయింది.

8. ఆ ఘటన గురించి ఫిబ్రవరి రెండు నాడు నేను చూచాయిగా హింట్ ఇస్తూ ఒక పోస్ట్ పెట్టాను. ఘటన ఎలా జరిగింది అనేది ముఖ్యం కాదు.. ఇలాంటి ఘటనల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి..?అనేది ముఖ్యం అని క్లియర్ గా చెప్పినా దాన్ని పట్టించుకోకుండా కేవలం ఒక్క పాయింట్ పై ద్రుష్టి పెట్టారు. ఒకరిద్దరు ఫేక్ వ్యక్తులు ఇలా పోస్ట్ చెయ్యడానికి సిగ్గు లేదా? అని అడిగారు.

సిగ్గు నాకెందుకు..?

కాలక్షేపం కోసం పోస్ట్ పెట్టను.

సమాజన్ని ఎడ్యుకేట్ చేసే టీచర్ నేను .

ఆ పోస్ట్ అలాగే వుంది .

జస్ట్ నాకు మాత్రమే కనబడేలా సెట్టింగ్స్ మార్చాను .

ఎంత దాచినా నిజాలు దాగవు . నిజాలు బయటకు వచ్చిననాడు ఆ పోస్ట్ ను తిరిగీ ఓపెన్ చేస్తాను.

నన్ను నెగెటివ్ గా కామెంట్ చేసిన వారిని అడుగుతాను. సిగ్గు లేనిది ఎవరికి అని..?

Related Articles

Related image1
Sexual Harassment:18 నెల‌లుగా లైంగిక వేధింపులు.. ఆత్మ‌హ‌త్య‌..నిందితుల్లో ఒక‌రూ బాధితురాలి ప్రాణ స్నేహితురాలు
Related image2
Asha Bhosle Family: కూతురు ఆత్మహత్య, కొడుకు క్యాన్సర్‌తో మృతి.. ఆశా భోస్లే జీవితంలో పిడుగుల్లాంటి విషాదాలు, అయినా కూడా
33
అమ్మాయిలూ జర భద్రం..
Image Credit : GEMINI

అమ్మాయిలూ జర భద్రం..

9. సమాజం నెగెటివిటీతో నిండిది. సొషల్ మీడియా ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెడితే .. సమాజంలో అందరం భద్రం.

లేకపోతే మూడు రోజులుగా వైరల్ అవుతున్న విషయాలు పదేపదే పునరావృతం అవుతాయి.

చివరిగా రెండు మాటలు . 1. ఎవరో వచ్చి .. మీకు అన్ని లాభాలు వస్తాయి .. అక్కడ పెట్టుబడి పెడుతాము అనగానే మటన్ షాప్ వాడిని నమ్మిన పొట్టేలు లాగా గుడ్డిగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసెయ్యడమేనా..?

2. ఇన్స్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ .. నెలకు ఇంత కడితే అలాంటి ఫోటోలు, వీడియోలు.

నెలకు ఇంత సంపాదన అని యూట్యూబ్ వీడియోలు.

నెట్ నిండా ఇలాంటి వారు లక్షల్లో.

ఒక నెల కడుతారు.

చూసి బోర్ కొడుతుంది.

రెండో మూడో నెల చందాలు తగ్గిపోతాయి.

బతకడం కోసం ఇంకెవరినైనా ముంచే క్రైమ్ పని అప్పుడు చూసుకొంటారు.

సిస్టం గురించి మాట్లాడకుండా కాలక్షేపం కోసం ఎవరో వ్యక్తి గురించి మాట్లాడితే ఏమి లాభం..?

ఏమిరా బాలరాజూ..?

ఏమి నీ వల్ల దేశానికి లాభం..?

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం.. దీంతో ఆడబిడ్డలకు కలిగే ప్రయోజనాలివే..!
Recommended image2
Schemes : మహిళలకు నెలనెలా రూ.2,500, యువతకు రూ.5000
Recommended image3
మహిళా రిజర్వేషన్లపై కేంద్రం సంచలనం.. 816 సీట్లు.. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఎంపీ స్థానాలు ఇవే !
Related Stories
Recommended image1
Sexual Harassment:18 నెల‌లుగా లైంగిక వేధింపులు.. ఆత్మ‌హ‌త్య‌..నిందితుల్లో ఒక‌రూ బాధితురాలి ప్రాణ స్నేహితురాలు
Recommended image2
Asha Bhosle Family: కూతురు ఆత్మహత్య, కొడుకు క్యాన్సర్‌తో మృతి.. ఆశా భోస్లే జీవితంలో పిడుగుల్లాంటి విషాదాలు, అయినా కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved