MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • రెండు నెల‌లు ఓపిక పడితే మీ డ‌బ్బులు భారీగా ఆదా.. ఈ వ‌స్తువుల‌ ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి.

రెండు నెల‌లు ఓపిక పడితే మీ డ‌బ్బులు భారీగా ఆదా.. ఈ వ‌స్తువుల‌ ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి.

శుక్ర‌వారం స్వాతంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎర్ర‌కోట వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. వీటిలో ప్ర‌ధాన‌మైంది జీఎస్‌టీ మార్పులు. దీంతో భారీగా ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌నున్నాయి.  

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 16 2025, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
GSTలో పెద్ద మార్పులు – కేంద్రం కొత్త ప్రతిపాదనలు
Image Credit : Generated by google gemini AI

GSTలో పెద్ద మార్పులు – కేంద్రం కొత్త ప్రతిపాదనలు

కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కీలక సవరణలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు శ్లాబ్‌లకు బదులుగా ఇకపై రెండు మాత్రమే ఉండేలా ప్రణాళిక రూపొందించింది. 5%, 18% అనే రెండు రేట్లలోనే ఎక్కువ వస్తు సేవలు వచ్చేలా మార్పులు చేస్తూ సామాన్యులపై పన్ను భారం తగ్గించాలనే ఉద్దేశం ఉంది. దీపావళి సందర్భంగా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఇదే విష‌యాన్ని ప్ర‌ధాని శుక్ర‌వారం తెలిపారు.

DID YOU
KNOW
?
ఏ రంగాలకు లాభం?
ఈ సవరణల ప్రభావంతో జౌళి, వ్యవసాయం, హస్తకళలు, ఎరువులు, పునరుత్పాదక విద్యుత్తు, ఆటోమోటివ్, వైద్య రంగం, బీమా రంగాలకు ప్రత్యేక లాభం చేకూరనుంది.
25
12%, 28% శ్లాబ్‌లకు ముగింపు
Image Credit : our own

12%, 28% శ్లాబ్‌లకు ముగింపు

ఇప్పటి వరకు ఉన్న 12% పన్ను శ్రేణి పూర్తిగా రద్దవనుంది. ఆ శ్లాబ్‌లో ఉన్న దాదాపు 99% వస్తువులు నేరుగా 5% కేటగిరీలోకి చేరతాయి. ఇదే విధంగా 28% పన్ను చెల్లిస్తున్న వస్తువుల్లో సుమారు 90% ఉత్పత్తులు ఇకపై 18% శ్రేణిలోకి వస్తాయి. దీని వ‌ల్ల‌ సాధారణ వినియోగ వస్తువులు మరింత చవకగా అందుబాటులోకి రానున్నాయి.

Related Articles

Related image1
మనిషి ముఖ్యమా? లేక కుక్క ముఖ్యమా? దేశాన్ని కుదిపేస్తున్న కొత్త సమస్య!!
Related image2
Big story: 78 ఏళ్లు ఒక ఎత్తు.. వచ్చే 22 ఏళ్లు మరో ఎత్తు. మన భవిష్యత్తు ఏం కానుంది?
35
ఏ రంగాలకు లాభం?
Image Credit : our own

ఏ రంగాలకు లాభం?

ఈ సవరణల ప్రభావంతో జౌళి, వ్యవసాయం, హస్తకళలు, ఎరువులు, పునరుత్పాదక విద్యుత్తు, ఆటోమోటివ్, వైద్య రంగం, బీమా రంగాలకు ప్రత్యేక లాభం చేకూరనుంది. దాంతో ముడిసరుకు ఖర్చులు తగ్గి ఉత్పత్తి ధరలు కూడా క్రమంగా పడిపోవచ్చు.

45
ధరలు తగ్గే అవకాశమున్న వస్తువులు
Image Credit : Dmart India

ధరలు తగ్గే అవకాశమున్న వస్తువులు

ఈ మార్పుల తర్వాత పన్ను రేటు తగ్గే అవకాశం ఉన్న వస్తువుల జాబితా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోజువారీ ఉపయోగాలు: టూత్‌పేస్ట్‌, టూత్‌పౌడర్‌, సబ్బులు, హెయిర్ ఆయిల్‌, గొడుగులు, కుట్టు మెషీన్లు

ఆహార ఉత్పత్తులు: ప్రాసెస్డ్ ఫుడ్స్‌, కండెన్స్‌డ్ మిల్క్‌, శీతలీకరించిన కూరగాయలు, షుగర్ సిరప్‌లు, ప్రోటీన్ సప్లిమెంట్లు, కాఫీ ఉత్పత్తులు

ఇంటి సామగ్రి: ప్రెజర్ కుక్కర్లు, వాటర్ ఫిల్టర్లు, ఎలక్ట్రానిక్ ఐరన్స్‌, గీజర్లు, వాక్యూమ్ క్లీనర్లు

దుస్తులు, పాదరక్షలు: రెడీమేడ్ డ్రెస్‌లు, రూ.500-1000లోపు షూస్

ఆరోగ్య ఉత్పత్తులు: హెచ్‌ఐవీ, హెపటైటిస్‌, టీబీ పరీక్షల కిట్లు, కొన్ని వ్యాక్సిన్లు, ఆయుర్వేద ఔషధాలు

ఇతర వస్తువులు: సైకిళ్లు, వ్యవసాయ పరికరాలు, టైల్స్‌, లిక్విడ్ సోప్స్‌, వాహన టైర్లు, స్టీల్ వంటపాత్రలు, జామెట్రీ బాక్సులు, సోలార్ హీటర్లు, ప్రింటర్లు, అల్యూమినియం ఫాయిల్ మొదలైనవి

అదే విధంగా సిమెంట్‌, రెడీ మిక్స్ కాంక్రీట్‌, ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, కార్లు వంటి వస్తువులపై కూడా పన్ను తగ్గే అవకాశం ఉంది.

55
బీమా, సేవలపై కొత్త నిర్ణయాలు
Image Credit : AI

బీమా, సేవలపై కొత్త నిర్ణయాలు

ప్రస్తుతం బీమాపై 18% పన్ను విధిస్తున్నారు. దాన్ని 5% వరకు తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అవసరమైతే సున్నా శాతం వరకు తీసుకెళ్లే అవకాశముందని సమాచారం. ఇక మిగతా సేవల రంగంపై మాత్రం 18% GST ఉండేలా ప్రతిపాదన ఉంది. మరోవైపు ఆరోగ్యానికి హానికరమైన వస్తువులపై 40% వరకు ప్రత్యేక పన్ను విధించే అవకాశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
YS Sahil Reddy : ఎవరీ సాహిల్ రెడ్డి? పెళ్లికి జగన్, స్టాలిన్.. హీరోలు విజయ్, సూర్య హాజరయ్యేంత తోపా..?
Recommended image2
Deccan odyssey: ఈ రైలు ఎక్కాలంటే రాసిపెట్టుండాలి.. టికెట్ ధ‌ర అక్ష‌రాల రూ. 9 ల‌క్ష‌లు, న‌డిచే ఇంద్ర‌భ‌వ‌నం.
Recommended image3
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Related Stories
Recommended image1
మనిషి ముఖ్యమా? లేక కుక్క ముఖ్యమా? దేశాన్ని కుదిపేస్తున్న కొత్త సమస్య!!
Recommended image2
Big story: 78 ఏళ్లు ఒక ఎత్తు.. వచ్చే 22 ఏళ్లు మరో ఎత్తు. మన భవిష్యత్తు ఏం కానుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved