MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌కు ఎంత జీతం వస్తుంది? ఫ్రీగా లభించే సౌకర్యాలు ఏంటి?

ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌కు ఎంత జీతం వస్తుంది? ఫ్రీగా లభించే సౌకర్యాలు ఏంటి?

Vice President CP Radhakrishnan Salary: 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. భారీ వేతనంతతో పాటు ఆయన పింఛన్, ప్రభుత్వ భవనంలో వసతి, భద్రతా సిబ్బంది, వైద్య-ప్రయాణ సౌకర్యాలు ఇలా ఉచితంగా అందుకునే సౌకర్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 09 2025, 09:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ గెలుపు
Image Credit : Getty

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ గెలుపు

2025 సెప్టెంబర్ 9న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఆయనకు 452 ఓట్లు లభించగా, ఇండియా కూటమి అభ్యర్థి బీ. సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు సాధించి ఓడిపోయారు. జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఖాళీ అయిన పదవిని రాధాకృష్ణన్ చేపట్టనున్నారు.

25
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ కు నెలకు లభించే జీతం ఎంత?
Image Credit : X/CPRGuv

ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ కు నెలకు లభించే జీతం ఎంత?

భారత ఉపరాష్ట్రపతికి నెలకు ₹4 లక్షల జీతం లభిస్తుంది. ఇది రాష్ట్రపతి, ప్రధాని వంటి రాజ్యాంగ పదవులకు సమానంగా ఉంటుంది. ఉపరాష్ట్రపతి రాష్ట్రసభా ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు. ఈ బాధ్యతల ఆధారంగానే ఆయన జీతం నిర్ణయించారు. ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ జీతంతో పాటు ప్రత్యేక భత్యాలు కూడా అందుకుంటారు.

Related Articles

Related image1
ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితంపై ప్రతిపక్షాల అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఏమన్నారో తెలుసా?
Related image2
15వ భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్
35
ప్రభుత్వ నివాసం, ప్రత్యేక భద్రత
Image Credit : X/CPRGuv

ప్రభుత్వ నివాసం, ప్రత్యేక భద్రత

ఉపరాష్ట్రపతికి ఢిల్లీలోని లుటియన్స్ జోన్‌లో ప్రత్యేక బంగ్లా కేటాయించారు. ఇది పూర్తిగా ఉచితం. నిర్వహణ ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. అదనంగా ప్రభుత్వ వాహనాలు, డ్రైవర్, భద్రతా సిబ్బంది, సెక్యూరిటీ ఆఫీసర్లు ఎల్లప్పుడూ ఉపరాష్ట్రపతి సేవలో ఉంటారు. భద్రతా ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి. ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడే సీపీ రాధాకృష్ణన్ ఉంటారు.

45
ఉపరాష్ట్రపతి కార్యాలయం, సిబ్బంది
Image Credit : X/CPRGuv

ఉపరాష్ట్రపతి కార్యాలయం, సిబ్బంది

ఉపరాష్ట్రపతికి ప్రత్యేక కార్యాలయంతో పాటు అక్కడ చాలా మంది సిబ్బంది ఉంటారు. కార్యదర్శులు, సహాయకులు, ఇతర సిబ్బంది రోజువారీ పనులను నిర్వహిస్తారు. అధికారిక సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఈ కార్యాలయం ద్వారా సజావుగా కొనసాగుతాయి.

వైద్య, అధికారిక ప్రయాణ సౌకర్యాలు

ఉపరాష్ట్రపతికి ప్రభుత్వ వ్యయంతో వైద్య సౌకర్యాలు లభిస్తాయి. ఇందులో రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు, అత్యవసర వైద్యం, ఆసుపత్రిలో చేరిక వంటి అన్ని వైద్య ఖర్చులు ఉంటాయి.

దేశీయ, విదేశీ పర్యటనల కోసం ప్రయాణ భత్యాలు, ప్రభుత్వ వ్యయంతో విమాన, రైలు, రహదారి ప్రయాణ సౌకర్యాలు లభిస్తాయి. ఇవి ఉపరాష్ట్రపతి అధికారిక పనుల భాగంగానే ఉంటాయి.

55
ఉపరాష్ట్రపతి పదవీ విరమణ పింఛన్
Image Credit : X/CPRGuv

ఉపరాష్ట్రపతి పదవీ విరమణ పింఛన్

ఉపరాష్ట్రపతి పదవి నుంచి విరమణ చేసిన తర్వాత కూడా ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. నెలకు సుమారు ₹1.5 నుండి ₹2 లక్షల వరకు పింఛన్ లభిస్తుంది. అదనంగా ప్రైవేట్ కార్యదర్శి, సహాయక సిబ్బంది, కార్యాలయం, వైద్య సదుపాయాలు, దేశీయ విమాన ప్రయాణాలు లభిస్తాయి. ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం ఈ పింఛన్, సౌకర్యాలు సమయానుకూలంగా పెరగవచ్చు.

భారత ఉపరాష్ట్రపతి పదవి కేవలం రాజ్యాంగ బాధ్యత మాత్రమే కాదు, గౌరవం, భద్రత, సౌకర్యాలు, ఆర్థిక లాభాలు కలిగిన పదవి. అందువల్ల ఈ స్థానానికి రాజకీయ, సామాజిక వర్గాల్లో విశేష ప్రాధాన్యం ఉంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సీపీ. రాధాకృష్ణన్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
రాజకీయాలు
భారత పార్లమెంటు

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
కన్నతల్లి ప్రైవేట్ వీడియోలు ప్రియుడికి పంపిన కూతురు
Related Stories
Recommended image1
ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితంపై ప్రతిపక్షాల అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఏమన్నారో తెలుసా?
Recommended image2
15వ భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved