MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • మీ ఇంట్లో టీవీ ఉందా, అయితే మీకో గుడ్ న్యూస్‌.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం?

మీ ఇంట్లో టీవీ ఉందా, అయితే మీకో గుడ్ న్యూస్‌.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం?

టీవీ లేని ఇంటిని ఊహించుకోవడం కష్టం. ప్రస్తుతం లోకల్ కేబుల్ నెట్‌వ‌ర్క్‌లు సైతం డిజిట‌ల్ రూపంలోకి మారాయి. సెట‌ప్ బాక్సుల‌ను ఏర్పాటు చేశాయి. తాజాగా కేంద్రం తీసుకొస్తున్న ఓ నిర్ణ‌యంతో కేబుల్ వినియోగ‌దారుల‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌నుంద‌ని తెలుస్తోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 28 2025, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేబుల్ టీవీ బిల్లులపై ఊరట.?
Image Credit : Meta AI

కేబుల్ టీవీ బిల్లులపై ఊరట.?

దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు టెలివిజన్ అనేది రోజు వారీ జీవితంలో విడదీయరాని భాగం. కానీ ప్రస్తుతం కేబుల్ టీవీ సేవలపై 18% జీఎస్టీ ఉండటం వల్ల వినియోగదారులు అధిక బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుపై ఆలోచనలో ఉందన్న వార్తలు వినియోగదారులకు ఆశ కలిగిస్తున్నాయి.

25
కేబుల్ పరిశ్రమ డిమాండ్
Image Credit : Generated by google gemini AI

కేబుల్ పరిశ్రమ డిమాండ్

ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ (AIDCF) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు ప్ర‌భుత్వానికి ఓ లేఖ‌ను రాశారు. ప్రస్తుతం 18%గా ఉన్న జీఎస్టీని 5%కు తగ్గించాలని వారు విజ్ఞప్తి చేశారు. అధిక పన్ను భారం, శాటిలైట్ ఛానెల్‌ల రుసుములు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల పోటీ వంటి సమస్యలతో పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఫెడరేషన్ వివరించింది.

Related Articles

Related image1
ఈ ఐడియా మీ జీవితాన్ని మార్చ‌డం ఖాయం.. ప్రింటెడ్ చాక్లెట్ బిజినెస్‌తో నెల‌కు ల‌క్ష ప‌క్కా
Related image2
Astrology: ఒక్క నెల ఆగితే ఈ 3 రాశుల వారి జీవితం మారడం ఖాయం.. శ‌ని సంచారంతో
35
వినియోగదారులపై ప్రభావం
Image Credit : Generated by google gemini AI

వినియోగదారులపై ప్రభావం

జీఎస్టీ తగ్గింపున‌కు ప్రభుత్వం ఆమోదం తెలపితే, కేబుల్ టీవీ వినియోగదారుల నెలవారీ బిల్లులు గణనీయంగా తగ్గుతాయి. దీనివల్ల కుటుంబాలకు ఆర్థిక ఊరట లభిస్తుంది. ప్రస్తుతం ఓటీటీ, మొబైల్ డేటా ప్లాన్స్ తక్కువ ధరలకు అందుబాటులో ఉండటంతో కేబుల్ టీవీ బిల్లులు ఎక్కువగా అనిపిస్తున్నాయి. కొత్త నిర్ణయం తీసుకుంటే, కేబుల్ టీవీ మరింత చవకగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

45
చిన్న ఆపరేటర్లకు ఊర‌ట
Image Credit : pexels

చిన్న ఆపరేటర్లకు ఊర‌ట

జీఎస్టీ తగ్గింపుతో కేబుల్ టీవీ పరిశ్రమలో చిన్న స్థాయి ఆపరేటర్లకు ల‌బ్ధి చేకూర‌నుంది. మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్లు (MSOs), లోకల్ ఆపరేటర్లు వ్యాపారం కొనసాగించేందుకు మరింత ఆర్థిక బలం ల‌భిస్తుంది. అంతేకాదు, వారు బ్రాడ్‌బ్యాండ్ సేవలు, డిజిటల్ మౌలిక వసతుల విస్తరణలో పెట్టుబడి పెట్టగలిగే అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ లక్ష్యాలకు తోడ్పడే నిర్ణయంగా మారుతుంది.

55
10 ల‌క్ష‌ల ఉద్యోగాలు
Image Credit : pexels

10 ల‌క్ష‌ల ఉద్యోగాలు

కేబుల్ టీవీ కేవలం వినోదం మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వార్తలు, విద్యా సమాచారం అందించే ముఖ్య వేదికగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ రంగంలో 10 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు ఉన్నాయని ఫెడరేషన్ వెల్లడించింది. జీఎస్టీ తగ్గితే వినియోగదారులకు ఆర్థిక లాభం కలిగించడమే కాకుండా ఉపాధి కూడా స్థిరంగా ఉంటుంది. ఈ నిర్ణయం ఆమోదం పొందితే, కేబుల్ టీవీ సేవలు అందరికీ మరింత సులభంగా చేరువ అవుతాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
నరేంద్ర మోదీ
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
కన్నతల్లి ప్రైవేట్ వీడియోలు ప్రియుడికి పంపిన కూతురు
Related Stories
Recommended image1
ఈ ఐడియా మీ జీవితాన్ని మార్చ‌డం ఖాయం.. ప్రింటెడ్ చాక్లెట్ బిజినెస్‌తో నెల‌కు ల‌క్ష ప‌క్కా
Recommended image2
Astrology: ఒక్క నెల ఆగితే ఈ 3 రాశుల వారి జీవితం మారడం ఖాయం.. శ‌ని సంచారంతో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved