MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఈ ఐడియా మీ జీవితాన్ని మార్చ‌డం ఖాయం.. ప్రింటెడ్ చాక్లెట్ బిజినెస్‌తో నెల‌కు ల‌క్ష ప‌క్కా

ఈ ఐడియా మీ జీవితాన్ని మార్చ‌డం ఖాయం.. ప్రింటెడ్ చాక్లెట్ బిజినెస్‌తో నెల‌కు ల‌క్ష ప‌క్కా

ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఇదొక యాడ్ మాత్ర‌మే కాదు. నిజంగా ఒక మంచి ఐడియా మ‌న జీవితాన్ని మార్చ‌డం ఖాయం. వ్యాపారానికి కూడా ఇది వ‌ర్తిస్తుంది. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 27 2025, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క‌స్ట‌మైజ్డ్ గిఫ్టుల‌కు పెరుగుతోన్న ఆద‌ర‌ణ
Image Credit : Meeshow

క‌స్ట‌మైజ్డ్ గిఫ్టుల‌కు పెరుగుతోన్న ఆద‌ర‌ణ

ప్రస్తుత కాలంలో కస్టమైజ్డ్ గిఫ్టింగ్ ట్రెండ్ ఎక్కువైంది. ముఖ్యంగా ప్రింటెడ్ చాక్లెట్లు పుట్టినరోజులు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, కార్పొరేట్ గిఫ్టింగ్ వంటి సందర్భాల్లో డిమాండ్ పెరుగుతోంది. ఇది చిన్న పెట్టుబడితో ప్రారంభించగలిగే వ్యాపారం కావ‌డం క‌లిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. దీనిలో పెట్టుబడి, లాభాలు, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలు చూద్దాం.

25
ప్రింటెడ్ చాక్లెట్లకు ఎందుకంత డిమాండ్‌.?
Image Credit : Meeshow

ప్రింటెడ్ చాక్లెట్లకు ఎందుకంత డిమాండ్‌.?

ప్ర‌స్తుతం గిఫ్టింగ్ కల్చర్ పెరిగింది. వ్యక్తిగత మెసేజ్‌లు, ఫోటోలు, పేర్లు ఉండే కవర్లతో చాక్లెట్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. పిల్లల పుట్టిన రోజులు, వివాహాలు, స్నేహితుల వేడుకలు, కార్పొరేట్ ఈవెంట్స్‌లో ఇవి ఆకర్షణీయంగా ఉంటాయి. సోషల్ మీడియాలో "యూనిక్ గిఫ్ట్" లా కనిపించడం వల్ల కూడా ట్రెండ్ పెరుగుతోంది.

Related Articles

Related image1
Astrology: ఒక్క నెల ఆగితే ఈ 3 రాశుల వారి జీవితం మారడం ఖాయం.. శ‌ని సంచారంతో
Related image2
Astrology: సెప్టెంబ‌ర్‌లో ఈ రాశి వారు జాగ్ర‌త్త‌.. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి
35
పెట్టుబడి ఎంత అవసరం?
Image Credit : mersal_creations/Instagram

పెట్టుబడి ఎంత అవసరం?

* ప్రింటింగ్ మెషిన్ – రూ. 70,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు (హై క్వాలిటీ కలర్ ప్రింటింగ్ కోసం).

* ప్యాకేజింగ్ మెటీరియల్స్ – రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకు అవుతుంది.

* చాక్లెట్ తయారీ/సప్లైకి మొద‌ట్లో రూ. 10 నుంచి రూ. 20 వేల ఖ‌ర్చ‌వుతుంది.

* ఇలా మొత్తం మీద ఈ వ్యాపారాన్ని సుమారు రూ. 1 ల‌క్ష నుంచి రూ. 2 ల‌క్ష‌ల్లో ప్రారంభించ‌వ‌చ్చు.

45
లాభాలు ఎలా ఉంటాయి.?
Image Credit : hayee.in

లాభాలు ఎలా ఉంటాయి.?

* ఒక ప్రింటెడ్ చాక్లెట్ కవర్ ఖర్చు సుమారు రూ.10 నుంచి రూ. 15 ఖ‌ర్చ‌వుతుంది.

* మార్కెట్‌లో వీటిని రూ. 25 నుంచి రూ. 40 వ‌ర‌కు విక్ర‌యించ‌వ‌చ్చు.

* పెద్ద ఈవెంట్స్‌లో ఒక్క ఆర్డర్‌కు 200–500 చాక్లెట్లు అవసరం అవుతాయి.

* ఇలా చూస్తే ఒక్క ఆర్డర్‌ నుంచే రూ. 5,000 నుంచి రూ.15,000 వరకు లాభం వచ్చే అవకాశం ఉంది. నెల‌లో ఒక్క ప‌ది ఆర్డ‌ర్లు వ‌చ్చినా క‌నీసం రూ. ల‌క్ష ఆర్జించ‌వ‌చ్చు.

55
మార్కెటింగ్ స్ట్రాటజీలు
Image Credit : AI meta

మార్కెటింగ్ స్ట్రాటజీలు

* సోషల్ మీడియా ప్రమోషన్ – ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌, వాట్సాప్ ద్వారా మీ వ్యాపారాన్ని ప్ర‌మోట్ చేసుకోవ‌చ్చు.

* ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలతో టైఅప్ – పెళ్లిళ్లు, పార్టీలు, కార్పొరేట్ ఈవెంట్స్‌లో ఆర్డర్లు వస్తాయి.

* ప్రత్యేక ఆఫర్లు – పండుగల సమయంలో గిఫ్ట్ ప్యాక్స్ రూపంలో ఆఫర్లు ఇవ్వాలి.

* ఆన్‌లైన్ స్టోర్ – చిన్న వెబ్‌సైట్ లేదా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా అమ్మకాలు చేయవచ్చు.

భవిష్యత్తు అవకాశాలు

* పెళ్లిళ్లు, బర్త్‌డేలకు మాత్రమే కాకుండా కార్పొరేట్ గిఫ్టింగ్ మార్కెట్ కూడా చాలా పెద్దది.

* కస్టమైజ్డ్ గిఫ్ట్స్ డిమాండ్ తగ్గదని నిపుణులు చెబుతున్నారు.

* దీన్ని ఫ్రాంచైజీ మోడల్‌గా కూడా విస్తరించవచ్చు.

* తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
Astrology: ఒక్క నెల ఆగితే ఈ 3 రాశుల వారి జీవితం మారడం ఖాయం.. శ‌ని సంచారంతో
Recommended image2
Astrology: సెప్టెంబ‌ర్‌లో ఈ రాశి వారు జాగ్ర‌త్త‌.. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved