MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Big Story: సమాజంలో పెరుగుతోన్న సూర్పనఖలు.. భర్తలను చంపిన భార్యలకు సరైన గుణ‌పాఠం

Big Story: సమాజంలో పెరుగుతోన్న సూర్పనఖలు.. భర్తలను చంపిన భార్యలకు సరైన గుణ‌పాఠం

Big Story: భార‌తీయ మ‌హిళ‌లంటే ఓర్పు, స‌హ‌నానికి సాక్ష్యాలుగా చెబుతుంటారు. అయితే ఇటీవ‌ల జ‌రుగుతోన్న సంఘ‌ట‌న‌లు చూస్తుంటే దీనికి అర్థం మారుతోందా? అన్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.  

3 Min read
Author : Narender Vaitla
Published : Sep 20 2025, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హనీమూన్ మర్డర్
Image Credit : Generated by google gemini AI

దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హనీమూన్ మర్డర్

మేఘాలయలో సంచలనం రేపిన హనీమూన్ హత్య కేసు గురించి అందరికీ తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌కు చెందిన సోన‌మ్ పెళ్లి జ‌రిగిన తొమ్మిది రోజుల‌కే భ‌ర్త రాజా ర‌ఘువంశీని ప్రియుడితో క‌లిసి చంపేసింది. ఈ సంఘటన తర్వాత సోనమ్ కుటుంబం ఆమెతో సంబంధం తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. ప్ర‌స్తుతం సోన‌మ్ షిల్లాంగ్ జైలులో ఉంది. ములాఖత్‌కు అవకాశం ఉన్నా కుటుంబసభ్యులు ఆమెను క‌ల‌వ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు.

26
భర్తను చంపి మృత‌దేహాన్ని డ్ర‌మ్ములో పెట్టి
Image Credit : Social media

భర్తను చంపి మృత‌దేహాన్ని డ్ర‌మ్ములో పెట్టి

రాజస్థాన్‌లోని అల్వాల్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది. భార్య తన ప్రియుడితో కలసి భర్తను హత్య చేసి, మృతదేహాన్ని డ్రమ్ములో దాచిపెట్టినట్లు బయటపడింది. ఈ రహస్యాన్ని 8 ఏళ్ల కుమారుడు అమాయకంగా పోలీసులకు వివరించడంతో నిజం బట్టబయలైంది. వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు మహిళతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Related image1
H1B Visa: మ‌రో బాంబు పేల్చిన ట్రంప్‌.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి పిడుగులాంటి వార్త‌
Related image2
Asia Cup 2025: గెల‌వనైతే గెలిచాం కానీ.. ఎన్నో ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తిన భార‌త్ - ఒమాన్ మ్యాచ్‌
36
తమిళనాడులో మరో ఘటన
Image Credit : Gemini AI Generated

తమిళనాడులో మరో ఘటన

తమిళనాడులో భయంకర ఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది. వేలూరు జిల్లా కుప్పంపాళ్యానికి చెందిన భారత్‌ (36) ను అతని భార్య నందిని, ఆమె ప్రియుడు సంజయ్‌తో కలిసి హత్య చేయించింది. ఘటనాస్థలంలోనే భారత్‌ చనిపోయాడు. మూడు సంవత్సరాల చిన్న కుమార్తె అమాయకంగా చెప్పిన వివరాలతో నిజం వెలుగులోకి రావడంతో పోలీసులు నందిని, సంజయ్‌లను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

46
తెలంగాణలో కూడా..
Image Credit : X

తెలంగాణలో కూడా..

జోగుళాంబ గద్వాలలో జరిగిన తేజేశ్వర్ హత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఏపీలోని క‌ర్నూల్‌కి చెందిన ఐశ్వ‌ర్య‌తో తేజేశ్వ‌ర్‌కి ఈ ఏడాది మే18న‌ వివాహం కాగా.. అప్ప‌టికే తిరుమ‌ల్ రావు అనే మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న ఐశ్వ‌ర్య‌.. భ‌ర్త‌ను చంపేందుకు కుట్ర చేసింది. ఈక్రమంలోనే సుపారీ ఇచ్చిమరీ.. తేజేశ్వర్‌ను హత్య చేయించి కర్నూల్‌ జిల్లాలోని పిన్నాపురం చెరువులో పడేశారు. హత్యకు పాల్పడిన ముగ్గురితోపాటు ఐశ్వర్యను ఆమె తల్లి సుజాతను అరెస్టు చేశారు. తిరుమ‌ల్ రావు కొన్ని రోజులు ప‌రారీలో ఉన్నా. చివ‌రికి ఆయ‌న‌ని కూడా పోలీసులు ప‌ట్టుకున్నారు.

56
ఇలా చెప్పుకుంటూ పోతే మ‌రెన్నో..
Image Credit : Social Media

ఇలా చెప్పుకుంటూ పోతే మ‌రెన్నో..

ప్రియుడి స‌హాయంతో భ‌ర్త‌ల‌ను హ‌త‌మార్చిన సంఘ‌ట‌న‌లు ఈ ఏడాది ఎన్నో చోటు చేసుకున్నాయి. వెలుగులోకి వ‌చ్చిన ఇలాంటి కొన్ని దారుణ సంఘ‌ట‌న‌లు.

* వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన నిర్మల్‌ జిల్లాలో జరిగింది. ఆగస్టులో ఈ సంఘటన జరిగింది.

* వివాహేత‌ర సంబంధానికి అడ్డొస్తున్నాడ‌ని భావించిన ఓ భ‌ర్త‌ను ప్రియుడితో క‌లిసి హ‌త‌మార్చింది క‌రీంన‌గ‌ర్‌కు చెందిన ఓ భార్య‌. భర్తకు మద్యం తాగించి.. ఆపై చెవుల్లో గడ్డి మందు పోసి కిరాతకంగా అంతమెుందించింది. ఈ సంఘ‌ట‌న ఆగ‌స్టు 6న వెలుగులోకి వ‌చ్చింది.

* ఈ ఏడాది జూలైలో ఇలాంటి ఓ విస్తుపోయే సంఘ‌ట‌న యూపీలో జ‌రిగింది. మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం ఏర్పాటు చేసుకున్న భార్య.. భ‌ర్త భర్త అడ్డుతొల‌గించుకుంది. ప్రియుడితో క‌లిసి భర్తకు రెండుసార్లు విషమిచ్చి భార్య హత్య చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మహిళ, ఆమె ప్రియుడ్ని అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

66
ఈసారి సూర్ప‌న‌ఖ సంహారం
Image Credit : Generated by google gemini AI

ఈసారి సూర్ప‌న‌ఖ సంహారం

ప్రతి దసరా రోజు మనం చెడుపై మంచి గెలిచినందుకు, రాముడు రావణాసురుడిని ఓడించినందుకు రావణ దహనం నిర్వహిస్తాం. రామ్‌లీలా ప్రదర్శనలు, రావణ బొమ్మ దహనం అనేవి అందరికీ సాంప్రదాయంగా తెలుసు. కానీ ఈ సారి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వినూత్న విధంగా దసరా జరుపుతున్నారు. రావణ కాదు, ఆయన సోదరి సూర్పనఖ బొమ్మను దహనం చేయనున్నారు.

పౌరుష్ సంస్థ కొత్త నిర్ణయం

పౌరుష్ అనే పురుష హక్కుల సంస్థ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అక్టోబర్ 2, దసరా రోజున నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా స్త్రీ దుష్టత్వానికి ప్రతీకగా సూర్పనఖ బొమ్మను దహనం చేస్తారు. సాంప్రదాయంగా పది తలల రావణ బొమ్మకు బదులుగా.. ఈ సారి స్త్రీ నేరాలకు ప్రతీకగా ప్రియుళ్లతో కలిసి భర్తలను హత్య చేసిన మహిళల 11 తలల ఫొటోలతో సూర్పనఖ బొమ్మను రూపొందించి దహనం చేయనున్నారు.

నేరానికి లింగ భేదం ఉండదు

పౌరుష్ సంస్థ తెలిపిన విధంగా, దుష్టత్వానికి లింగ భేదం ఉండదు. మహిళలు చేసిన నేరాలను సమాజం ఖండించాలి అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు. సమాజంలో నమ్మకద్రోహం, నేరపూరిత ప్రవర్తన చూపే “ఆధునిక సూర్పనఖలు” చాలా మంది ఉన్నారని, అందుకే ఈసారి దసరాకు ఈ థీమ్‌ను ఎంచుకున్న‌ట్లు నిర్వాహ‌కులు చెబుతున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత దేశం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
నేరాలు, మోసాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
కన్నతల్లి ప్రైవేట్ వీడియోలు ప్రియుడికి పంపిన కూతురు
Related Stories
Recommended image1
H1B Visa: మ‌రో బాంబు పేల్చిన ట్రంప్‌.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి పిడుగులాంటి వార్త‌
Recommended image2
Asia Cup 2025: గెల‌వనైతే గెలిచాం కానీ.. ఎన్నో ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తిన భార‌త్ - ఒమాన్ మ్యాచ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved