MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Unmarried Men: బ్రహ్మచారులకు హెచ్చరిక.. పెళ్లి చేసుకోకపోతే ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశం

Unmarried Men: బ్రహ్మచారులకు హెచ్చరిక.. పెళ్లి చేసుకోకపోతే ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశం

Unmarried Men: పెళ్లి కాని వారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉందని అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది. జీవనశైలి మార్పులే దీనికి ప్రధాన కారణమంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 18 2026, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ్యాచిలర్స్‌కే క్యాన్సర్ ముప్పు ఎక్కువట.. ఎందుకో తెలుసా?
Image Credit : Gemini

బ్యాచిలర్స్‌కే క్యాన్సర్ ముప్పు ఎక్కువట.. ఎందుకో తెలుసా?

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మయామికి చెందిన పరిశోధకులు తాజాగా పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. సింగిల్స్ గా ఉన్నవారు లేదా వివాహం కాని వారిలో, వివాహ బంధంలో ఉన్నవారితో పోలిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. 2015 నుండి 2022 మధ్య కాలంలో అమెరికాలోని 12 రాష్ట్రాల్లో నమోదైన సుమారు 40 లక్షల క్యాన్సర్ కేసులను విశ్లేషించిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు.

25
పురుషుల్లో 68%, మహిళల్లో 85% అధిక ముప్పు
Image Credit : Getty

పురుషుల్లో 68%, మహిళల్లో 85% అధిక ముప్పు

ఈ పరిశోధనలో తేలిన గణాంకాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. పెళ్లి చేసుకోని పురుషులలో, వివాహం చేసుకున్న పురుషులతో పోలిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం 68 శాతం ఎక్కువగా ఉంది. అలాగే, పెళ్లి కాని మహిళల్లో ఈ ముప్పు ఏకంగా 85 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే, ఇక్కడ పెళ్లి చేసుకోవడం వల్ల శరీరంలో ఏదో అద్భుతం జరిగి క్యాన్సర్ రాకుండా ఆగుతుందని అర్థం కాదని, దీని వెనుక అనేక సామాజిక, జీవనశైలి కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Related image1
మీ శరీరానికి నిజంగా బిర్యానీ అవసరమా? 60 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా !
Related image2
Pink Lake: ఈ సరస్సులో నీళ్లు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ లాగా ఎందుకు ఉంటాయో తెలుసా?
35
క్యాన్సర్‌కు, పెళ్లికి సంబంధం ఏమిటి?
Image Credit : Gemini

క్యాన్సర్‌కు, పెళ్లికి సంబంధం ఏమిటి?

ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన క్లినికల్ సైకాలజిస్ట్ ఫ్రాంక్ పెనెడో ఈ వివరాలను వెల్లడిస్తూ.. "మీరు వివాహం చేసుకోకపోతే, మీ ఆరోగ్యం పట్ల మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం" అని ఆయన సూచించారు. ధూమపానం, దీర్ఘకాలిక ఒత్తిడి, సంతానోత్పత్తి చరిత్ర వంటివి సాధారణంగా క్యాన్సర్‌కు కారణమవుతాయి. ఇవన్నీ ఒక వ్యక్తి వివాహ స్థితిపై ఆధారపడి మారుతుంటాయి. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారే పెళ్లికి మొగ్గు చూపే అవకాశం కూడా ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

45
HPV సంబంధిత క్యాన్సర్లు ఎక్కువే..
Image Credit : Asianet News

HPV సంబంధిత క్యాన్సర్లు ఎక్కువే..

హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ల విషయంలో ఈ వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉంది. పెళ్లి కాని పురుషులలో ఆనల్ క్యాన్సర్ వచ్చే అవకాశం వివాహితుల కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. అలాగే, పెళ్లి కాని మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ వచ్చే ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. భాగస్వామి ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.

ఒకరు మరొకరిని చెకప్‌లకు వెళ్లమని ప్రోత్సహించడం వల్ల వ్యాధి ప్రారంభ దశలోనే బయటపడే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వాటికి సరైన స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉండటంతో, వీటి విషయంలో పెళ్లి అయిన వారికి, కాని వారికి మధ్య వ్యత్యాసం తక్కువగా ఉంది.

55
సామాజిక పరిస్థితులే కీలకం
Image Credit : gemini

సామాజిక పరిస్థితులే కీలకం

ఎపిడెమియాలజిస్ట్ పాలో పినహీరో మాట్లాడుతూ.. సామాజిక పరిస్థితులు క్యాన్సర్ ముప్పును సూచించే ముఖ్యమైన సంకేతాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే నివారణా చర్యల్లో వివాహ స్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. అయితే, పెళ్లి వల్ల కేవలం లాభాలే లేవని, గతంలో జరిగిన కొన్ని పరిశోధనలు పెళ్లి వల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి ముప్పు పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపాయి. మరోవైపు, ఒంటరిగా ఉండటం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక నెట్‌వర్క్ బలంగా ఉండే అవకాశాలు ఉంటాయని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ తాజా పరిశోధన ఫలితాలు క్యాన్సర్ రీసెర్చ్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dosa Tawa: హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ కావాలా? ఈ తవా బెస్ట్
Recommended image2
Houseflies: ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే..ఒక్క ఈగ కూడా రాదు
Recommended image3
Bedroom: రాత్రి పడుకునేటప్పుడు బెడ్ రూమ్ డోర్ మూసేస్తే ఏమవుతుందో తెలుసా?
Related Stories
Recommended image1
మీ శరీరానికి నిజంగా బిర్యానీ అవసరమా? 60 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా !
Recommended image2
Pink Lake: ఈ సరస్సులో నీళ్లు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ లాగా ఎందుకు ఉంటాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved