Telugu

Houseflies: ఈ ఒక్కటి మీ ఇంట్లో ఉంటే..ఒక్క ఈగ కూడా రాదు

Telugu

వేసవిలో ఈగల గోల

వేసవి అంటే మామిడి, పనస పండ్ల సీజన్ . పండ్లతో పాటే ఈగల బెడదా ఉంటుంది. చుట్టూ మూగి ఇబ్బంది పెడతాయి. అయితే ఎలాంటి కెమికల్ వాడకుండా, ఈగలను తరిమికొట్టే సింపుల్ చిట్కాలు చూద్దాం.

Image credits: gemini ai
Telugu

నిమ్మకాయ, లవంగాలు (Lemon & Cloves)

ఒక నిమ్మకాయను సగానికి కోయండి. అందులో 5-6 లవంగాలను గుచ్చండి. దీన్ని ఇంట్లోని మూలల్లో లేదా పండ్లు ఉన్నచోట పెట్టండి. ఈ వాసనకు ఈగలు దగ్గరికి కూడా రావు.

Image credits: stockPhoto
Telugu

కర్పూరం వాడకం (Camphor)

ఇంట్లో రెండు కర్పూరం బిళ్లలను వెలిగించండి. ఆ పొగ ఇల్లంతా వ్యాపించేలా చూడండి. కర్పూరం ఘాటైన వాసనకు ఈగలు వెంటనే ఇంట్లోంచి పారిపోతాయి.

Image credits: Freepik
Telugu

ఉప్పు నీటి ప్రయోగం (Salt Water)

ఇంటి నేల లేదా టేబుళ్లను తుడిచేటప్పుడు, నీటిలో కొద్దిగా కల్లుప్పు కలపండి. ఉప్పు నీటితో తుడిచిన చోట ఈగలు అస్సలు వాలవు.

Image credits: Getty
Telugu

తులసి లేదా పుదీనా (Natural Herbs)

కిటికీల దగ్గర లేదా డైనింగ్ టేబుల్‌పై తులసి లేదా పుదీనా మొక్కలను పెట్టండి. ఈ మొక్కల నుంచి వచ్చే ఘాటైన వాసన ఈగలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Image credits: instagram
Telugu

పండ్లను సరిగ్గా నిల్వ చేయండి (Fruit Storage)

పండ్లను కోసి అలా వదిలేయకండి. వాటిపై ఎప్పుడూ జాలీ మూత పెట్టండి లేదా ఫ్రిజ్‌లో ఉంచండి. పండ్ల తొక్కలను కూడా వెంటనే ఇంట్లోంచి బయట పడేయండి.

Image credits: Getty
Telugu

చెత్తబుట్ట జాగ్రత్తలు (Dustbin Care)

చెత్తబుట్టపై ఎప్పుడూ మూత పెట్టి ఉంచండి. ముఖ్యంగా తడి చెత్తను ఎక్కువసేపు ఇంట్లో ఉంచవద్దు. లేకపోతే ఈగలు మరింత పెరుగుతాయి. 

Image credits: Getty
Telugu

వెనిగర్ ట్రాప్ (Vinegar Trap)

ఒక గిన్నెలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్, రెండు చుక్కల లిక్విడ్ సోప్ కలిపి పెట్టండి. వెనిగర్ వాసనకు ఈగలు ఆకర్షితమై ఆ గిన్నెలో పడి చిక్కుకుంటాయి.

Image credits: social Media

Soft Roti: చపాతీలు మెత్తగా రావాలా? దీనితో పిండి కలిపితే చాలు..!

Lace Bangles: లేస్ గాజులతో చేతులకు ట్రెడిషనల్ లుక్

Ruby Gold Ring: రాయల్ లుక్ ఇచ్చే యూనిక్ డిజైన్ రూబీ రింగ్స్.. ఇవిగో

Gardening Tips: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో..!