MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • కాఫీలో ఇదొక్కటి కలిపినా చాలా టేస్ట్ అవుతుంది

కాఫీలో ఇదొక్కటి కలిపినా చాలా టేస్ట్ అవుతుంది

కొంతమంది టీ కంటే కాఫీనే ఇష్టపడతారు. రోజుకు మూడు నాలుగు సార్లైనా కాఫీని తాగుతుంటారు. అయితే కాఫీలో కొన్ని పదార్థాలను మిక్స్ చేస్తే అది టేస్టీగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 31 2025, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కాఫీ
Image Credit : Freepik

కాఫీ

ప్రతి ఒక్కరూ ఉదయాన్నే టీ లేకపోతే కాఫీని తాగుతుంటారు. అయితే కొంతమంది మాత్రం కాఫీనే తాగుతారు. నిజానికి టీ కంటే కాఫీ టేస్ట్ డిఫరెంట్ గా, టేస్టీగా ఉంటుంది. అందుకే కాఫీ టేస్ట్ అంటే చాలా మందికి ఇష్టం. అయితే కాఫీని మోతాదులో తాగితే ఎలాంటి సమస్య రాదు. 

మోతాదుకు మించితేనే సమస్య మీరు తాగే కాఫీ ఆరోగ్యకరమైన పద్దతిలో తయారుచేస్తున్నారా? లేదా? అనేది ముఖ్యం. అయితే కాఫీ టేస్ట్ ను మరింత పెంచడానికి కొన్ని పదార్థాలు, చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. వీటిని గనుక ఫాలో అయితే మాత్రం కాఫీ టేస్టీగా కావడమే కాకుండా.. మీ ఆరోగ్యం కూడా బేషుగ్గా ఉంటుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
లిమిట్ లోనే తాగాలి
Image Credit : Freepik

లిమిట్ లోనే తాగాలి

టేస్టీగా ఉందని కొంతమంది కప్పులకు కప్పుల కాఫీని లాగించేస్తూనే ఉంటారు. కానీ కాఫీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ నిద్రతో పాటుగా మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది. అందుకే మీరు కెఫిన్ ను ఎక్కువగా తీసుకోకూడదు. ఇందుకోసం మీరు రోజుకు ఒకటి రెండు కప్పులకు మించి కాఫీని తాగకూడదు.

దాల్చినచెక్క

మీరు తాగే కాఫీ టేస్టీగా, హెల్తీగా ఉండాలనుకుంటే దాల్చిన చెక్కను ఉపయోగించండి. ఎందుకంటే దాల్చిన చెక్క వాసన బాగుండటమే కాకుండా.. మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలో కేలరీలు పెరగకుండా చేస్తాయి. అలాగే ఈ చెక్కవల్ల కాఫీ తీయగా కూడా అవుతుంది.

Related Articles

Related image1
ఈ చిట్కాలు పాటిస్తే చాలా స్లిమ్ గా, మోడ్రన్ గా కనిపిస్తారు
Related image2
కాఫీ పౌడర్ ను ఇలా వాడితే ముఖంపై మచ్చలు పోయి అందంగా కనిపిస్తారు
35
ఇప్పుడు కాఫీ తాగొద్దు
Image Credit : Getty

ఇప్పుడు కాఫీ తాగొద్దు

మార్నింగ్ లేవగానే చాలా మంది కప్పు కాఫీ తాగే వరకు ఏ పనీ చేయరు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ఎందుకంటే కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు ఉదయాన్నే విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. కానీ పరిగడుపున కాఫీని మాత్రం తాగకూడదు.

మొక్కల ఆధారిత పాలు

కాఫీని తయారుచేయడానికి ఆవు లేదా గేదె పాలను వాడుతారు. కానీ వీటికి బదులుగా మొక్కల ఆధారిత పాలను ఉపయోగిస్తే మంచిది. ఈ పాలతో చేసిన కాఫీ టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం మీరు కొబ్బరి పాలు, బాదం, ఓట్స్ లను ఉపయోగించొచ్చు. ఈ కాఫీ క్రీమీగా కూడా ఉంటుంది.

45
ఫిల్టర్ చేసిన నీరు
Image Credit : Getty

ఫిల్టర్ చేసిన నీరు

కాఫీ తయారుచేయడానికి ఫిల్టర్ చేయని వాటర్ మంచివని అంటుంటారు. కానీ ఈ వాటర్ లో బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే కాఫీని ఎప్పుడు చేసినా ఫిల్టర్ చేసిన వాటర్ ను మాత్రమే ఉపయోగించాలి. ఫిల్టర్ చేయని నీళ్లను ఉపయోగిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది.

55
కోకో పౌడర్
Image Credit : Freepik

కోకో పౌడర్

కాఫీలో దాల్చిన చెక్క వేయడం ఇష్టం లేకపోతే మీరు దీనికి బదులుగా కోకోను కూడా వేయొచ్చు. నిజానికి కోకో పౌడర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
జీవనశైలి
ఆరోగ్యం
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugarcane Juice: ఎండాకాలంలో..చెరకు రసం తాగితే ఏమౌతుంది..?
Recommended image2
Raisin Water: నాన పెట్టిన ఎండు ద్రాక్ష నీరు తాగితే ఏమౌతుంది?
Recommended image3
Silver Mangalsutra: వెండి మంగళసూత్రాల్లో అదిరిపోయే కలెక్షన్
Related Stories
Recommended image1
ఈ చిట్కాలు పాటిస్తే చాలా స్లిమ్ గా, మోడ్రన్ గా కనిపిస్తారు
Recommended image2
కాఫీ పౌడర్ ను ఇలా వాడితే ముఖంపై మచ్చలు పోయి అందంగా కనిపిస్తారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved