MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Clove water: నిద్రపోయే ముందు 7 రోజులపాటూ లవంగం నీటిని తాగి చూడండి

Clove water: నిద్రపోయే ముందు 7 రోజులపాటూ లవంగం నీటిని తాగి చూడండి

Clove water: లవంగాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. లవంగాల నీరు కూడా మన శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతాయి. పడుకునే ముందు లవంగాల నీటిని తాగితే మీరు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Feb 13 2026, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
లవంగం నీటితో ఉపయోగాలు
Image Credit : Getty

లవంగం నీటితో ఉపయోగాలు

లవంగాలను ఔషధాల గనిగా చెప్పుకోవాలి. ఇక దీనితో చేసే లవంగం నీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లవంగాల్లో యూజినాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణక్రియను, నిద్రను మెరుగుపరుస్తుంది. లవంగం నీరు రాత్రి పడుకోబోయే ముందు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు రక్తంలో చక్కెర సమస్య ఉంట లవంగాల నీరు ఎంతో మంచిది. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి, చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. పడుకునే ముందు తాగితే గ్యాస్, ఉబ్బరం, అజీర్తి తగ్గుతాయి. పొట్ట తేలికగా మారి హాయిగా నిద్రపడుతుంది.

24
గాఢమైన నిద్ర
Image Credit : Getty

గాఢమైన నిద్ర

ప్రశాంతంగా నిద్రపడితేనే ఎవరైనా చక్కగా పనిచేయగలరు.  నిద్రపట్టకపోయినా, మధ్యలో మెలకువ వచ్చినా పడుకునే ముందు లవంగాల నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇది ఒత్తిడిని తగ్గించి, నిద్రలేమిని పోగొడుతుంది. మీరు తరచుగా అనారోగ్యానికి గురైతే రోగనిరోధక శక్తిని పెంచడానికి లవంగాల నీరు వాడడం మంచిది. ఈ లవంగం నీరు ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది. నోటి సమస్యలున్న వారు లవంగాల నీరు తాగితే ఎంతో ఉత్తమం. ఇది బ్యాక్టీరియాను చంపి, నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలను తగ్గిస్తుంది. లవంగంలోని యూజినాల్ వాపును తగ్గిస్తుంది. ఇది కీళ్ల నొప్పులు లేదా వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Related Articles

Related image1
Headache: నాలుక కింద చిటికెడు ఉప్పు పెట్టుకుంటే తలనొప్పి తగ్గిపోతుందా?
Related image2
Rahu Transit: రాహువు వల్ల ఈ 4 రాశుల వారికి కోటీశ్వర యోగం
34
లవంగాల నీటిని ఎలా తయారు చేయాలి?
Image Credit : Getty

లవంగాల నీటిని ఎలా తయారు చేయాలి?

  • ఒక గిన్నెలో నీళ్లు మరిగించండి.
  • లవంగాలు వేసి 5-7 నిమిషాలు తక్కువ మంటపై మరిగించండి.
  • స్టవ్ ఆపి, కొద్దిగా చల్లారనిచ్చి, వడకట్టండి.
  • పడుకునే ముందు గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి.
  • రుచి కోసం: కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలపవచ్చు.
44
ఈ పనులు వద్దు
Image Credit : istock

ఈ పనులు వద్దు

  • లవంగాల నీరు తాగడం కష్టంగా అనిపించినా కూడా ఎక్కువ చక్కెర లేదా తేనె కలపవద్దు.
  • రక్తం గడ్డకట్టే సమస్యలు, లో బ్లడ్ షుగర్ ఉంటే లేదా రక్తం పలుచబడే మందులు వాడుతున్న వారు కూడా లవంగం నీరు తాగకూడదు.
  • గర్భిణులు, పాలిచ్చే తల్లులు కూడా వైద్యులను సంప్రదించి ఆ తరువాతే వాడాలి.
  • లవంగం నీరు తాగిన తరువాత అలర్జీలు లేదా కడుపునొప్పి వస్తే దాన్ని తాగడం ఆపేయండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Headache: నాలుక కింద చిటికెడు ఉప్పు పెట్టుకుంటే తలనొప్పి తగ్గిపోతుందా?
Recommended image2
Sugarcane Juice: ఎండాకాలంలో..చెరకు రసం తాగితే ఏమౌతుంది..?
Recommended image3
Raisin Water: నాన పెట్టిన ఎండు ద్రాక్ష నీరు తాగితే ఏమౌతుంది?
Related Stories
Recommended image1
Headache: నాలుక కింద చిటికెడు ఉప్పు పెట్టుకుంటే తలనొప్పి తగ్గిపోతుందా?
Recommended image2
Rahu Transit: రాహువు వల్ల ఈ 4 రాశుల వారికి కోటీశ్వర యోగం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved