Health Tips: నిద్ర లేవగానే బెడ్‍షీట్ మడత పెట్టేస్తున్నారా? అదే పెద్ద పొరపాటు
Health Tips: ఉదయం నిద్ర లేవగానే బెడ్‍షీట్ మడత పెట్టడం మంచి అలవాటు, క్రమశిక్షణ అని అనుకుంటారు. కానీ అదే పెద్ద పొరపాటు. అది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఎందుకో తెలుసా?
15

Image Credit : chatgpt
30 నిమిషాలు ఆగాలి
చాలామందికి ఉదయం నిద్ర లేవగానే బెడ్ షీట్ మడతపెట్టుకోవడం అలవాటు ఉంటుంది. ఒకవేళ మడతపెట్టక చికాకుగా ఉంటుంంది. అదేదో క్రమశిక్షణ అనుకుంటారు. కానీ రోజూ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పక్క సర్దే ముందు కనీసం 30 నిమిషాలు ఆగాలని చెబుతున్నారు. దీనికి ఓ బలమైన కారణం ఉంది.
25
Image Credit : gemini ai
డస్ట్ మైట్స్ వేగంగా పెరుగుతాయి
మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం నుంచి చెమట, చర్మ కణాలు దుప్పటిపై పడతాయి. ఈ తేమ 'డస్ట్ మైట్స్' అనే కంటికి కనిపించని సూక్ష్మజీవులకు ఆహారం. మనం లేవగానే దుప్పటి మడిస్తే, ఆ తేమ లోపలే ఉండిపోతుంది. దీంతో డస్ట్ మైట్స్ వేగంగా పెరిగి, మన పరుపు బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుంది.
35
Image Credit : gemini ai
బెడ్‍షీట్ ను అలాగే వదిలేయడం వల్ల లాభం ఉంది
మనం లేచిన తర్వాత పక్క సర్దకుండా కాసేపు అలానే వదిలేస్తే, గదిలోని గాలి, వెలుతురు పరుపుపై పడతాయి. దీనివల్ల దుప్పట్లో ఉన్న తేమ ఆరిపోతుంది. డస్ట్ మైట్స్ బతకాలంటే తేమ తప్పనిసరి. పొడి వాతావరణంలో అవి జీవించలేవు. ఇలా చేయడం వల్ల తుమ్ములు, జలుబు, చర్మంపై దద్దుర్లు వంటి అలర్జీలు తగ్గుతాయి.
45
Image Credit : pinterest
ఎప్పుడు మడవాలి?
ఉదయం లేవగానే గది కిటికీలు తెరిచి, స్వచ్ఛమైన గాలి లోపలికి వచ్చేలా చేయండి. మీరు స్నానం చేసి రెడీ అయ్యాక లేదా టిఫిన్ చేశాక పక్క సర్దడం అలవాటు చేసుకోండి.
55
Image Credit : chatgpt
లేచిన వెంటనే అలాగే వదిలేయండి
వారానికి ఒకసారి దుప్పట్లను వేడి నీటిలో ఉతకడం చాలా మంచిది. నీట్‌గా ఉండటం ఎంత ముఖ్యమో, ఆరోగ్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి, రేపటి నుంచి లేవగానే మీ బెడ్‍షీట్‍కు కాస్త గాలి, వెలుతురు తగలనివ్వండి. ఆ తర్వాతే అందంగా సర్దండి.
Latest Videos

