MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Oats Storage Tips: ఓట్స్‌ ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి

Oats Storage Tips: ఓట్స్‌ ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి

Oats Storage Tips: మీకు ఓట్స్ అంటే ఇష్టమా? మీ ఇంట్లో ఎక్కువ మంది ఓట్స్ తింటారా? అయితే కచ్చితంగా మీరు ఈ టిప్ తెలుసుకోవాలి. ఓట్స్ చెడిపోకుండా ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Feb 13 2025, 07:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తినడం చాలా ఆరోగ్యం. ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది ఇంకా మంచిది. అందుకే చాలా మంది దీన్ని బల్క్ గా కొని స్టోర్ చేసుకుంటారు. కానీ ఓట్స్ కూడా ఇతర ఆహార పదార్థాల మాదిరిగానే సరిగ్గా నిల్వ చేయకపోతే త్వరగా చెడిపోతుంది. కాబట్టి ఓట్స్ చెడిపోకుండా ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

25

గాలి, వెలుతురు, ఎక్కువ వేడికి గురైతే ఓట్స్ చెడిపోయి రుచి, పోషకాలను కోల్పోతాయి. అంతేకాకుండా ఓట్స్‌ని సరిగ్గా నిల్వ చేయకపోతే ఫంగస్ రావచ్చు. కీటకాలు కూడా చేరొచ్చు. దీంతో అసలు రుచిని కోల్పోయి చేదుగా మారతాయి. 

ఓట్స్ చెడిపోకుండా ఉండాలంటే అవి బాగా ఎండినవై ఉండాలి. ఎండిన ఓట్స్‌లో తేమ తక్కువగా ఉంటుంది. అందువల్ల అవి చెడిపోయే అవకాశం చాలా తక్కువ.

35

మూత ఉన్న డబ్బాలు బెటర్

గాలి చొరబడని గాజు డబ్బాలో నిల్వ చేయడం ద్వారా ఓట్స్‌ని ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి. గాలిలో ఉండే తేమ వల్ల ఓట్స్‌లోకి కూడా తేమ చేరుతుంది. అందుకే మీరు ఓట్స్ ని గాజు జార్, ప్లాస్టిక్ డబ్బా లేదా జిప్ లాక్ బ్యాగ్‌లో వేసి నిల్వ చేయండి. ఇలా చేయడం వల్ల కీటకాలు కూడా చేరవు. 

 

45

చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి

ఓట్స్‌పై సన్ లైట్ డైరెక్ట్ గా పడకుండా చూసుకోండి.  వేడి నుండి దూరంగా ఉంచండి. ఓట్స్ పై వేడి పడితే అది దాని రుచిని, పోషకాలను కోల్పోతుంది. దీనివల్ల గోధుమ రంగులోకి మారుతాయి. అలా జరగకుండా ఉండాలంటే చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి.

 

55

ఫ్రీజర్‌లో నిల్వ చేయండి

మీరు ఓట్స్‌ని బల్క్ గా కొనుగోలు చేస్తే వాటిని ఫ్రీజర్‌లో ఉంచితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇలా చేస్తే ఒక సంవత్సరం అయినా ఫ్రెష్‌గా ఉంటాయి. దీనికోసం ఓట్స్‌ని గాలి చొరబడని డబ్బాలో వేసి దాన్ని ఫ్రీజర్‌లో వేసి నిల్వ చేయండి. ఫ్రీజర్‌ లేకపోతే ఫ్రిజ్‌లో కూడా నిల్వ చేయవచ్చు. కానీ ఓట్స్ డబ్బా మూతను గట్టిగా మూయడం మర్చిపోవద్దు.

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
బరువు తగ్గాలి అనుకునేవారు తప్పకుండా తాగాల్సిన జ్యూస్‌లు ఇవే!
Recommended image2
Coconut Water: 7 రోజులపాటు కొబ్బరినీళ్లు తాగితే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Recommended image3
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved