MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఈ పండ్లను రెగ్యులర్ గా తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి!

ఈ పండ్లను రెగ్యులర్ గా తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి!

మన ఆరోగ్యంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. అవి రక్తాన్ని శుద్ధి చేసి, వ్యర్థాలను శరీరం నుంచి బయటకు పంపిస్తాయి. కిడ్నీలు సరిగ్గా పనిచేస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది. కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని రకాల పండ్లు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Sep 04 2025, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు
Image Credit : Getty

కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు

పండ్లు ఆరోగ్యానికి మంచిదనే విషయం మనకు తెలుసు. కొన్ని రకాల పండ్లు కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాటిలోని పోషక గుణాలు కిడ్నీ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి. మరి ఏ పండ్లను రెగ్యులర్ గా తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయో ఇక్కడ చూద్దాం.

27
బ్లూబెర్రీ
Image Credit : Getty

బ్లూబెర్రీ

బ్లూబెర్రీలో పొటాషియం తక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, కిడ్నీలలో వాపును తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా బ్లూబెర్రీ తినడం వల్ల కిడ్నీ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

Related Articles

Related image1
తిన్న వెంటనే ఈ 7 పనులు అస్సలు చేయొద్దు! ఎందుకో తెలుసా?
Related image2
వీళ్లు పొరపాటున కూడా ఎండు చేపల కూర తినకూడదు!
37
క్రాన్బెర్రీ
Image Credit : our own

క్రాన్బెర్రీ

క్రాన్బెర్రీలు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి మూత్రాశయ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా క్రాన్బెర్రీలు తీసుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి, మెరుగైన జీర్ణక్రియకు కూడా క్రాన్బెర్రీలు సహాయపడుతాయి.

47
ఆపిల్
Image Credit : Getty

ఆపిల్

ఆపిల్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఆపిల్ లోని విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు కిడ్నీలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. వాపును తగ్గించి, కిడ్నీలను శుభ్రపరుస్తాయి. 

57
ద్రాక్ష
Image Credit : Getty

ద్రాక్ష

ద్రాక్షలో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీలలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు బీపీ, షుగర్ ను నియంత్రించడం ద్వారా కిడ్నీలను కాపాడుతాయి. 

అనాస

అనాసలో ఉండే బ్రోమేలైన్ అనే ఎంజైమ్ శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. దీని పొటాషియం స్థాయి తక్కువగా ఉండడం వల్ల కిడ్నీ సమస్యలున్నవారికి ఇది చాలా మంచిది. యూరిక్ ఆమ్ల స్థాయిని నియంత్రించడంలోనూ అనాస సహాయపడుతుంది.

67
దానిమ్మ
Image Credit : stockPhoto

దానిమ్మ

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీల వాపు, ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తాయి. దానిమ్మ రసం దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే నష్టం నుంచి కిడ్నీలను రక్షించడంలో సహాయపడుతుంది.  

77
పుచ్చకాయ
Image Credit : Getty

పుచ్చకాయ

కిడ్నీలను రక్షించడంలో పుచ్చకాయ చక్కగా సహాయపడుతుంది. పుచ్చకాయలో విటమిన్ ఎ, సి, మెగ్నీషియం, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లైకోపీన్ ఉంటాయి. నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి కిడ్నీల పనిని తేలికచేస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
బరువు తగ్గాలి అనుకునేవారు తప్పకుండా తాగాల్సిన జ్యూస్‌లు ఇవే!
Recommended image2
Coconut Water: 7 రోజులపాటు కొబ్బరినీళ్లు తాగితే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Recommended image3
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Related Stories
Recommended image1
తిన్న వెంటనే ఈ 7 పనులు అస్సలు చేయొద్దు! ఎందుకో తెలుసా?
Recommended image2
వీళ్లు పొరపాటున కూడా ఎండు చేపల కూర తినకూడదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved