MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Mangoes: మామిడి పండ్లు తింటున్నారా? ఇలా మాత్రం తినకూడదని మీకు తెలుసా?

Mangoes: మామిడి పండ్లు తింటున్నారా? ఇలా మాత్రం తినకూడదని మీకు తెలుసా?

Mangoes: మామిడి పండును పండ్లలో రారాజు అని పిలుస్తాం. కానీ, దానిని తినే విధానం సరిగా లేకపోతే మీ ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ. అందుకే, దీనిని ఎలా తినాలో తెలుసుకోవడం ముఖ్యం. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 17 2026, 02:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Mangoes
Image Credit : Getty

Mangoes

ఎండాకాలం వచ్చింది అంటే చాలు.. అందరికీ ముందు గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. కేవలం ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయి కాబట్టి.. అందరూ వీటిని ఇప్పుడే తినాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ, ఈ పండు తినే సమయంలో తెలిసీ తెలియక కొందరు చేసే తప్పుల కారణంగా చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి, ఈ మామిడి పండ్లు తినే విషయంలో చేయకూడని తప్పులు ఏంటో చూద్దాం...

23
1.అతిగా తినడం..
Image Credit : Asianet News

1.అతిగా తినడం..

మామిడి పండు రుచిలో అద్భుతం. ఈ విషయం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. చాలా మంది రుచిగా ఉన్నాయి కదా అని గంపలు గంపలు తినేస్తూ ఉంటారు. ఈ తప్పు చేయకూడదు. ఈ పండులో షుగర్ లెవల్స్, కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. విరేచనాలు కూడా అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఒక పండు కంటే ఎక్కువగా తినకూడదు.

2.ప్రోటీన్ లేకుండా తీసుకోవడం...

మామిడి పండు తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. దీనిని కంట్రోల్ చేయడానికి మామిడి పండును ప్రోటీన్ తో కలిపి తీసుకోవాలి. అంటే కొన్ని బాదం పప్పులు, పెరుగు లేదా కొంచెం పన్నీర్ వంటి ప్రోటీన్ కలిగిన ఆహారం తో కలిపి తీసుకోవాలి. అప్పుడు అధిక బరువు పెరిగే సమస్య ఉండదు. ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

Related Articles

Related image1
Pomegranate:30 సెకన్లలో దానిమ్మ కాయ నుంచి గింజలు వేరే చేసే టెక్నిక్ ఇది..!
Related image2
Chicken Recipe: చికెన్ కర్రీ, చట్నీ కాదు.. టేస్టీగా చికెన్ కారం పొడి చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది..!
33
3.భోజనం చేసిన తర్వాత మామిడి పండు తినడం...
Image Credit : Getty

3.భోజనం చేసిన తర్వాత మామిడి పండు తినడం...

చాలా మంది భోజనం చేసిన వెంటనే డెజర్ట్ లా మామిడి పండు తింటారు. ముఖ్యంగా బిర్యానీ లాంటివి హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు స్వీట్ క్రేవింగ్స్ కోసం మామిడి పండు తినకూడదు. భోజనంలోని కేలరీలకు తోడు మామిడి కేలరీలు కూడా చేరితే.. జీర్ణక్రియ పై భారం పడుతుంది. ఇది అజీర్తి, గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. భోజనం చేసిన తర్వాత కనీసం 1 నుంచి 2 గంటల తర్వాత మాత్రమే పండు తినాలి.

4.వేగంగా తినడం...

ఏ ఆహారాన్ని అయినా బాగా నమిలి తింటేనే అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి. మామిడి పండును త్వరత్వరగా మింగేయడం వల్ల జీర్ణ ఏంజైమ్ లు సరిగా కలవవు. నిదానంగా నమిలి ఆస్వాదిస్తూ తింటేనే అది సులభంగా జీర్ణం అవుతుంది.

5.జ్యూస్ రూపంలో తీసుకోవడం...

చాలా మంది మ్యాంగో జ్యూస్ తాగడాన్ని ఇష్టపడతారు. మామిడి పండు జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల అందులో ఫైబర్ పోతుంది. ఫైబర్ లేకుండా తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయి. పండును పండులా తీసుకుంటేనే మంచి పోషకాలు లభిస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chicken Recipe: చికెన్ కర్రీ, చట్నీ కాదు.. టేస్టీగా చికెన్ కారం పొడి చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది..!
Recommended image2
Instant Tea: గ్యాస్, పాలు లేకుండా.. నిమిషంలో అదిరిపోయే టీ రెడీ
Recommended image3
Curd Tips: స‌మ్మ‌ర్‌లో పెరుగు పుల్ల‌గా కాకుండా, గ‌ట్టిగా ఉండాలంటే ఏం చేయాలి.? సింపుల్ చిట్కాలు
Related Stories
Recommended image1
Pomegranate:30 సెకన్లలో దానిమ్మ కాయ నుంచి గింజలు వేరే చేసే టెక్నిక్ ఇది..!
Recommended image2
Chicken Recipe: చికెన్ కర్రీ, చట్నీ కాదు.. టేస్టీగా చికెన్ కారం పొడి చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved