MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Male Tiger: పులి పిల్లలను చంపేసే మగపులులు, ఇంత పైశాచిక స్వభావం ఎందుకు ఉంటుంది?

Male Tiger: పులి పిల్లలను చంపేసే మగపులులు, ఇంత పైశాచిక స్వభావం ఎందుకు ఉంటుంది?

Male Tiger: మగ పులులు చిన్న చిన్న పులి పిల్లలను అప్పుడప్పుడు చంపేస్తూ ఉంటాయి. ఇది ఆశ్చర్యంగా అనిపిస్తున్నా కూడా నిజమే. దీని వెనుక సరైన కారణం కూడా ఉంది. అది ప్రకృతి సిద్ధమైనది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jan 19 2026, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎందుకు ఈ స్వభావం?
Image Credit : Getty

ఎందుకు ఈ స్వభావం?

పిల్ల పులులను మగపిల్లలు చంపేయడం అనే విషయం వింటేనే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అయితే అవి చంపేసేది ఆకలి తట్టుకోలేక, ఆహారం కోసమో లేదా విపరీతమైన క్రూరత్వాన్ని చూపించడానికో కాదు... ప్రకృతి ధర్మం. ప్రకృతిలోని జీవులు తమ జాతిని ముందుకు తీసుకెళ్లేందుకే ప్రయత్నిస్తాయి. అలా అనుసరించే మగ పులులు సహజ ప్రవర్తనలో భాగంగానే ఇలా పిల్లలను చంపేయడం కూడా ఒకటి. దీనిని సైన్సులో ఇన్‌ఫాంటీసైడ్ అని పిలుస్తారు. ముఖ్యంగా ఒక మగపులి.. ఒక కొత్త ప్రాంతంలోకి వెళ్లి అక్కడున్న మరో మగ పులి రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు ఇలాంటి స్వభావం చూపిస్తుంది. అక్కడ పుట్టిన పులి పిల్లలు తన జాతివి కాకపోయినా, తన కుటుంబాన్ని కాకపోయినా, తనవి కాకపోయినా కూడా వాటిని చంపడం ద్వారా ఆ ప్రాంతంలో తన అధిపత్యానికి ఎదురు లేకుండా చేసుకుంటాయి.

24
ఇది తప్పు కాదు
Image Credit : Getty

ఇది తప్పు కాదు

ఒక మనిషి భావోద్వేగాలతో మనం ఆలోచిస్తే ఇది తప్పుగా అనిపిస్తుంది. కానీ అది అడవిలో నడిచే ప్రకృతి నియమమే. ఆడ పులికి పిల్లలు పుట్టాక అవి రెండు మూడేళ్ల పాటు తల్లి పైనే ఆధారపడతాయి. ఆ సమయంలో తల్లి పులి తిరిగి మగ పులితో జత కట్టడానికి సిద్ధంగా ఉండదు. దాంతో కొన్ని మగ పులులు పరిస్థితుల రీత్యా తనకు పుట్టని పులి పిల్లలను చంపి.. ఆడ పులిని గర్భధారణకు సిద్ధం చేస్తుంది. ఇలా చేయడం ద్వారా తన సంతానాన్ని ఆ ప్రాంతంలో పొందే అవకాశాలను పెంచుకుంటుంది. ఇది వినడానికి కాస్త కఠినంగానే ఉండొచ్చు. కానీ జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం ఇది సహజమైన ప్రక్రియ గానే భావిస్తారు.

Related Articles

Related image1
Gold: రోడ్డుపై బంగారం దొరికితే దాన్ని ఉంచుకోవడం మంచిది కాదా? ఆ గోల్డ్ ను ఏం చేయాలి?
Related image2
Grey Hair: ఒక తెల్ల వెంట్రుక పీకితే అన్నీ తెల్లబడతాయా? సైన్సు ఏం చెబుతోంది?
34
తల్లి కోసమే పిల్లలను చంపి
Image Credit : Getty

తల్లి కోసమే పిల్లలను చంపి

నిజానికి పులులు... సింహాల్లా గుంపులుగా తిరగవు. ఒంటరిగానే జీవిస్తాయి. మగ పులి ఆడ పులి కలిసి పిల్లల్ని పెంచవు. పిల్లల సంరక్షణ మొత్తం తల్లిపులి పైనే పడుతుంది. అందువల్ల మగపులికి పిల్లలతో భావోద్వేగ సంబంధం ఉండదు. పైగా పులులు అధికంగా ఉండే అడవిలో పులి పిల్లల మరణాల శాతం కూడా ఇందుకే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆహారం దొరకకపోవడం వల్ల, ఇతర జంతువులు దాడి చేయడం, వ్యాధులు వల్ల చాలా పులి పిల్లలు చిన్న వయసులోనే మరణిస్తాయి. అలాగే సొంత పులులే తమ పిల్లలను చంపేయడం కూడా ఇందులో భాగమే.

44
సొంత పిల్లలను చంపవు
Image Credit : Getty

సొంత పిల్లలను చంపవు

అలాగని ప్రతి మగ పులి.. పిల్లలను చంపేస్తుందని భావించకూడదు. సాధారణంగా కొత్త ప్రాంతాన్ని ఆక్రమించిన మగ పులిలోనే ఈ స్వభావం అధికంగా కనిపిస్తుంది. అయితే తనకు పుట్టిన సొంత పిల్లలను మగపులి చంపిన సందర్భాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తల్లి పులులు తమ పిల్లలను రక్షించేందుకు చాలా తీవ్రంగా పోరాడుతాయి. పిల్లలను వేరే ప్రాంతాలకు తరలించి కాపాడుకుంటాయి. అయినా సరే ఒక్కోసారి పులి పిల్లలు మగపులికి దొరికిపోయి ప్రాణాలు కోల్పోతాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య.. ఇలాంటి వార్తలు చదివినా ప్రమాదమే..!
Recommended image2
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Recommended image3
అమెరికా అర్చకుల ముందు ఐటీ ఉద్యోగులు జూజుబి.. ఒక్కో అయ్యవారి ఆదాయం ఎంతో తెలుసా..?
Related Stories
Recommended image1
Gold: రోడ్డుపై బంగారం దొరికితే దాన్ని ఉంచుకోవడం మంచిది కాదా? ఆ గోల్డ్ ను ఏం చేయాలి?
Recommended image2
Grey Hair: ఒక తెల్ల వెంట్రుక పీకితే అన్నీ తెల్లబడతాయా? సైన్సు ఏం చెబుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved