MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Viral Video: ఇదెక్క‌డి మాస్‌రా మామా.! పారాసెట్‌మాల్ ట్యాబ్లెట్‌ని ఇలా కూడా వాడొచ్చా.?

Viral Video: ఇదెక్క‌డి మాస్‌రా మామా.! పారాసెట్‌మాల్ ట్యాబ్లెట్‌ని ఇలా కూడా వాడొచ్చా.?

Viral Video: జ్వరం వచ్చిన వెంటనే చాలా మంది పారాసెట్‌మాల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. అయితే ఈ ట్యాబ్లెట్‌ను అందుకు కాకుండా మరో ప‌నికి ఉప‌యోగించింది ఓ మ‌హిళ. దీనికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఆ వీడియోలో ఏముందంటే.? 

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 08 2025, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విచిత్రమైన హోమ్ ట్రిక్
Image Credit : 𝗩𝗲𝗱𝗮𝗰𝗵𝗮𝗿𝘆𝗮/X

విచిత్రమైన హోమ్ ట్రిక్

ఓ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో ఆమె, “పారాసెటమాల్ మాత్రతో బట్టలు ఉతికితే మరకలు సులభంగా పోతాయి” అని చెబుతోంది. సబ్బు లేదా డిటర్జెంట్ అవసరం లేకుండా, ఒక బకెట్ నీటిలో పారాసెటమాల్ మాత్ర వేస్తే, దుస్తులు తెల్లగా మెరుస్తాయని ఆమె సూచించింది. మురికిగా ఉన్న లేదా పసుపు రంగులోకి మారిన దుస్తులు కూడా అలా శుభ్రం అవుతాయని వీడియోలో పేర్కొంది.

25
వీడియో వైరల్, లక్షల్లో వ్యూస్
Image Credit : 𝗩𝗲𝗱𝗮𝗰𝗵𝗮𝗿𝘆𝗮/X

వీడియో వైరల్, లక్షల్లో వ్యూస్

ఈ వీడియోను @acharyaveda అనే ఎక్స్ యూజర్ పోస్ట్ చేశారు. కొద్దిగంటల్లోనే అది వైరల్‌గా మారింది. “తెల్లని దుస్తుల‌ నుంచి మురికిని తొలగించడానికి సులభమైన మార్గం” అంటూ షేర్ చేసిన ఆ క్లిప్‌ను ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా చూశారు. వేల మంది లైక్స్, షేర్లు, కామెంట్లు చేయడంతో వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

Related Articles

Related image1
Gold Trends: అడ్డ‌గోలుగా బంగారం కొంటున్నారా.? ఆగ‌మైపోతారు జాగ్ర‌త్త‌. అస‌లేం జ‌రగ‌నుందంటే
Related image2
Post Office: 5 ఏళ్లలో రూ. 36 లక్ష‌లు ఎలా పొందాలి? ఇంత‌కంటే సెక్యూరిటీ మ‌రెక్క‌డ ఉండ‌దు.
35
నెటిజన్లు ఏమంటున్నారంటే.?
Image Credit : 𝗩𝗲𝗱𝗮𝗰𝗵𝗮𝗿𝘆𝗮/X

నెటిజన్లు ఏమంటున్నారంటే.?

ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. పారాసెట్‌మాల్‌తో దుస్తులు ఉతికితే, మ‌రి జ్వ‌రం వ‌స్తే డిట‌ర్జెంట్ తినాలా అంటూ ఓ యూజ‌ర్ రాసుకొచ్చాడు. మ‌రో యూజ‌ర్.. “ఇకపై మెడిసిన్ షాప్‌లో డిట‌ర్జెంట్‌కు బ‌దులు పారాసెట్‌మాల్ ట్యాబ్లెట్లు ఇస్తారా” అని ఫ‌న్నీగా కామెంట్ చేస్తున్నారు.

45
ఇది నిజంగా పనిచేస్తుందా?
Image Credit : 𝗩𝗲𝗱𝗮𝗰𝗵𝗮𝗿𝘆𝗮/X

ఇది నిజంగా పనిచేస్తుందా?

పారాసెట్‌మాల్ ట్యాబ్లెట్ నిజంగానే దుస్తుల్లోని మరకలను తొలగిస్తుందనడంలో నిజం లేదు. ఇందులో అలాంటి రసాయన గుణాలు ఏవీ ఉండవు. పారాసెట్‌మాల్ జ్వరం, నొప్పులు తగ్గించడానికి మాత్రమే ఉపయోగించే ఔషధం. కాబట్టి ఇది బట్టలు శుభ్రం చేయడంలో ఉపయోగపడుతుందన్న వాదనకు శాస్త్రీయ ఆధారం లేదు. అయితే, ఈ వీడియోలోని ఆలోచన వినూత్నంగా ఉందని, గృహిణుల సృజనాత్మకతను చూపుతోందని నెటిజన్లు అంటున్నారు.

నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో ఇదే..

सफ़ेद कपडे से मैल हटाने का सबसे आसान तरीका... pic.twitter.com/vQn2Ijhq4T

— 𝗩𝗲𝗱𝗮𝗰𝗵𝗮𝗿𝘆𝗮 (@acharyaveda_) October 5, 2025

55
వినోదం కోసం మాత్ర‌మే..
Image Credit : 𝗩𝗲𝗱𝗮𝗰𝗵𝗮𝗿𝘆𝗮/X

వినోదం కోసం మాత్ర‌మే..

ఇలాంటి వీడియోలు కేవలం వినోదం కోసం మాత్రమే ఉప‌యోగ‌ప‌డ‌తాయని, వాటిని అమలు చేసే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు సూచిస్తున్నారు. పారాసెట్‌మాల్‌ను నేరుగా చేతుల‌తో ట‌చ్ చేయ‌డం వ‌ల్ల చర్మ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని కూడా అంటున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Recommended image2
అమెరికా అర్చకుల ముందు ఐటీ ఉద్యోగులు జూజుబి.. ఒక్కో అయ్యవారి ఆదాయం ఎంతో తెలుసా..?
Recommended image3
Top 5 Mysterious Places : ఇళ్లకు తలుపులే ఉండవు, పాములతో కలిసి జీవనం.. ఇండియాలో టాప్ 5 వింత గ్రామాలు..!
Related Stories
Recommended image1
Gold Trends: అడ్డ‌గోలుగా బంగారం కొంటున్నారా.? ఆగ‌మైపోతారు జాగ్ర‌త్త‌. అస‌లేం జ‌రగ‌నుందంటే
Recommended image2
Post Office: 5 ఏళ్లలో రూ. 36 లక్ష‌లు ఎలా పొందాలి? ఇంత‌కంటే సెక్యూరిటీ మ‌రెక్క‌డ ఉండ‌దు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved