MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • "నెమ్మ‌దిగా వెళ్తేనే తొంద‌ర‌గా గ‌మ్యాన్ని చేరుకుంటాం".. ఈ క‌థ చ‌దివితే మీరూ ఒప్పుకోవాల్సిందే.

"నెమ్మ‌దిగా వెళ్తేనే తొంద‌ర‌గా గ‌మ్యాన్ని చేరుకుంటాం".. ఈ క‌థ చ‌దివితే మీరూ ఒప్పుకోవాల్సిందే.

సామెతలు కేవ‌లం మాటలు మాత్ర‌మే కావు. అవి జీవిత పాఠాలు. “నిదానమే ప్రధానం” అన్న సామెత కూడా మ‌నం విని ఉంటాం. అయితే నెమ్మ‌దిగా వెళ్తే గ‌మ్యాన్ని త్వ‌ర‌గా ఎలా చేరుకుంటాం. అనే సందేహం వ‌స్తోంది క‌దూ? ఇది చ‌దివితే మీకే అర్థ‌మ‌వుతుంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Aug 19 2025, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వ్యాపారి ప్ర‌యాణం
Image Credit : Generated by google gemini AI

వ్యాపారి ప్ర‌యాణం

దుబ్బాక అనే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి వస్తువులు కొనుగోలు చేసి ఇతర గ్రామాల్లో విక్రయిస్తూ లాభాలు పొందేవాడు. ఒక రోజు తక్కువ ధరకు కొబ్బరి బొండాలు దొరికే మ‌రో గ్రామానికి వెళ్లి ఎడ్ల బండి నిండా కొనుగోలు చేశాడు. వాటిని పక్కనే ఉన్న ముస్తాబాద్ అనే గ్రామంలో అమ్మాలని నిర్ణయించాడు.

25
మేకల కాపరి చెప్పిన వింత సమాధానం
Image Credit : Generated by google gemini AI

మేకల కాపరి చెప్పిన వింత సమాధానం

దారి సరిగా తెలియకపోవడంతో వ్యాపారి ఒక మేకల కాపరిని ఇలా అడిగాడు. "ఇక్కడి నుంచి ముస్తాబాద్‌కు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది?". అప్పుడు కాపరి మాట్లాడుతూ.. "నెమ్మదిగా వెళ్తే గంట, వేగంగా వెళ్తే రెండు గంటలు" అంటాడు. ఇది విన్న వ్యాపారి ఆశ్చర్యపోయాడు. "వేగంగా వెళ్తే త్వరగా చేరుకోవాలి కదా, ఇది ఏమి లాజిక్?" అని అనుకున్నాడు.

Related Articles

Related image1
పది నిమిషాల్లో వస్తువులే కాదు భూమి కూడా కొనొచ్చు..
Related image2
అస‌లు అలాగే ఉంటుంది, వడ్డీ నెల‌కు రూ. 20 వేలు వ‌స్తాయి.. రిటైర్మైంట్ త‌ర్వాత జీవితం బిందాస్‌
35
తొందరపాటు ఫలితం
Image Credit : Generated by google gemini AI

తొందరపాటు ఫలితం

గొర్రెల కాప‌రి చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా.. గ్రామానికి తొందరగా చేరుకోవాలన్న ఆత్రుతతో వ్యాపారి ఎడ్ల బండిని వేగంగా నడిపించాడు. కానీ మార్గమధ్యంలో పెద్ద గుంత కనిపించక పోవడంతో బండి ఒక్కసారిగా కింద పడింది. బండిలోని అన్ని కొబ్బరిబొండాలు చెల్లాచెదురుగా రోడ్డుమీద పడిపోయాయి. వాటిని ఏరుకోవడంతో ఆయనకు చాలా సమయం పట్టింది. చివరికి ముస్తాబాద్ కు  చేరేసరికి కాపరి చెప్పినట్టుగానే రెండు గంటలు పట్టింది.

45
కాపరి మాటల్లో నిజం
Image Credit : Generated by google gemini AI

కాపరి మాటల్లో నిజం

ఆ క్షణంలోనే వ్యాపారికి అసలు విషయం అర్థమైంది. "వేగంగా వెళ్లాలని తొందరపడితే ఇబ్బందులు వస్తాయి, కానీ నిదానంగా ఉంటే సమస్యల నుంచి తప్పించుకోవచ్చు" అని. కాపరి చెప్పిన "నిదానమే ప్రధానం" అన్న మాట ఎంత సత్యమో ప్రత్యక్షంగా అనుభవించాడు.

55
ఈ కథ నీతి ఏంటంటే.?
Image Credit : Generated by google gemini AI

ఈ కథ నీతి ఏంటంటే.?

మనలో చాలామంది విజయాన్ని త్వరగా అందుకోవాలని ఆర‌ట‌ప‌డుతుంటారు. విజ‌యానికి షార్ట్ కట్ లు వెతుక్కుంటారు. దీంతో తప్పుడు మార్గాల్లో వెళ్లి బొక్కో బోర్లా పడుతారు. కానీ సరైన మార్గంలో, నిదానంగా, ఆలోచించి తీసుకున్న అడుగులే చివరికి స్థిరమైన విజయాన్ని ఇస్తాయనే గొప్ప సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఫీల్ గుడ్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య.. ఇలాంటి వార్తలు చదివినా ప్రమాదమే..!
Recommended image2
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Recommended image3
అమెరికా అర్చకుల ముందు ఐటీ ఉద్యోగులు జూజుబి.. ఒక్కో అయ్యవారి ఆదాయం ఎంతో తెలుసా..?
Related Stories
Recommended image1
పది నిమిషాల్లో వస్తువులే కాదు భూమి కూడా కొనొచ్చు..
Recommended image2
అస‌లు అలాగే ఉంటుంది, వడ్డీ నెల‌కు రూ. 20 వేలు వ‌స్తాయి.. రిటైర్మైంట్ త‌ర్వాత జీవితం బిందాస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved