MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య.. ఇలాంటి వార్తలు చదివినా ప్రమాదమే..!

ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య.. ఇలాంటి వార్తలు చదివినా ప్రమాదమే..!

మనం ప్రతిరోజు సూసైడ్ వార్తలు చూస్తుంటాం… ఇటీవల ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. అయితే ఇలాంటి వార్తలు ఇతరులపైనా ప్రభావం చూపిస్తాయి. ఎంత ప్రమాదకరం అంటే…

4 Min read
Author : Amarnath Vasireddy
Published : Feb 10 2026, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ తల్లిది మానసిక దౌర్బల్యం...
Image Credit : X/barkhatrehan16

ఈ తల్లిది మానసిక దౌర్బల్యం...

1 . సమస్యలనుంచి తప్పించుకోవడానికి "ఆత్మ హత్య చేసుకోవాలి.." అని ఆలోచించడం పరమ మానసిక దౌర్బల్యం.

2 . "నేను మరణిస్తున్నాను కాబట్టి... నా బిడ్డలు కూడా ఉండకూడదు అని .. లేదా నేను లేకపోతే నా బిడ్డలు {అదీ ఎదిగినవారు} బతకలేరు"అనుకోవడం.. వారు కూడా ఆత్మహత్య చేసుకొనేలా చేయడం మానసిక దౌర్బల్యానికి... పరాకాష్ట.

3 . వ్యక్తులు జీవితాల్లోకి తొంగి చూడడం ఒక రకమయిన మానసిక దౌర్బల్యం.

కుతూహలం కొద్దీ, గాసిప్ కోసం, టైం పాస్ కోసం ఈ పని చేయడం సరికాదు.

అదే సమయంలో మన చుట్టూరా జరుగుతున్న ఘటనల నుంచి మనం జీవన పాఠాలను గ్రహించడం అవసరం.

4. ఆత్మహత్య వార్త చదివినప్పుడు... అందునా దయనీయమయిన రీతిలో ఒక మహిళ తన ఇద్దరు ఎదిగిన పిల్లలతో రైలుకు ఎదురెళ్లి చనిపోయిన వార్తను చదివినప్పుడు బాధ కలగడం సహజం.

గంట... లేదా ఒక రోజు..

ఆ నెగటివ్ వార్తను... నెగటివ్ ఫీలింగ్ ను మనసునుంచి తొలగించాలి.

ఆత్మ హత్య గురించి పదేపదే ఆలోచించడం మనలో నెగెటివిటీని పెంచుతుంది.

రాబందులు శవాల్ని వెతుక్కొంటూ పోతాయి.

డిజిటల్ మీడియా... ఒక నెగెటివ్ వార్తను పదేపదే ప్రస్తావిస్తోంది అంటే ..కేవలం వ్యూస్ కోసం .

పాజిటివ్ వార్తల పట్ల జనాలు ఆసక్తి చూపరు.

అదే నెగెటివ్ వార్తలంటే లక్షల్లో వ్యూస్.

వారం రోజులుగా కొన్ని వందల వీడియోలు .

ఒకటి చూస్తే అల్గారిథమ్ అలాంటివే పదింటిని ముందుకు తెస్తుంది.

మరణించిన వ్యక్తి గురించి సానుభూతి చూపుతూ ఎంతో మంది పోస్టులు.

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళే ... అనుకొందాం.

కానీ పదేపదే ఆత్మహత్య చేసుకొన్నవారి గురించి... మహా సానుభూతి కోణం నుంచి పోస్ట్లు చదువుతూ ఉంటే .. ఆ గజ్జి మీకు అంటుకుంటుంది.

వారం రోజులుగా ... వద్దు వద్దు అనుకొంటూ .. ఇక భరించలేక ... నేను ఈ పోస్ట్ పెట్టడానికి కారణం ఇదే.

పోయినోళ్ళను వదిలేయండి .

అదే ఆలోచనల్లో మీరు ఉంటే మీకు తెలియకుండా మీ బాడీలో స్ట్రెస్ డిప్రెషన్ అలుముకుంటుంది.

ఒక ఇంట్లో ఒకరు ఆత్మహత్య చేసుకొంటే ఆ ప్రభావం ఇంట్లో మిగతా వారిపై పడుతుంది.. తరాల తరబడి ..

కేవలం జన్యు కోణంలో కాదు .

న్యూరో లింగ్విస్టిక్ కోణంలో.

ఆత్మహత్య చేసుకొన్నవారి గురించి పదేపదే అయ్యో అయ్యో అని ఆలోచిస్తుంటే .. "ఆత్మహత్య సరైనది" అని మన ఉపచేతన మనసును... మనకు తెలియకుండానే సిద్ధం చేస్తున్నాము అని గ్రహించండి .

అది సబ్ కాన్షియస్ మైండ్ లో తిష్ట వేస్తుంది .

ఒక బలహీన క్షణంలో బయటపడుతుంది .

మీరు బాగుండాలి .

మీ కుటుంబాలు బాగుండాలి .

24
మహిళల్లో డిప్రెషన్ చాలా ప్రమాదకరం...
Image Credit : Getty

మహిళల్లో డిప్రెషన్ చాలా ప్రమాదకరం...

5 . నాకు తెలుసు .. ఇంత చెప్పినా డిజిటల్ మీడియా నెగటివ్ మేతకు అలవాటు పడిన జనాలు .. "అసలు ఏమి జరిగింది?"" అని ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు. ఆత్మహత్యను జస్టిఫై చేయడానికి కారణాలు వెదకకండి .

అది నెగటివ్ న్యూరో లింగ్విస్టిక్ అఫ్ఫిర్మేషన్ అవుతుంది.

బతుకుల్లో సునామీ తెచ్చే ప్రమాదం .

6. మేజర్ డిప్రెసివ్ డిసార్డర్ అనేది ఒకటుంది.

ఇది ఉన్నవాళ్ళు బయటకు మామూలుగా వుంటారు .

ఆ మధ్య కాలం ఒక జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకొన్నారు .

ఆమె చక్కగా ఉండేది పిరికిది కాదు అని అప్పట్లో పుంఖానుపుంఖాలుగా పోస్ట్లు

ఆమెతో రోజూ పనిచేసే మరో మహిళ నాకు పరిచితురాలు.

అప్పుడే మాట్లాడాను.

నాకు అప్పుడే అర్థం అయ్యింది.

ఆమెకు మెంటల్ డిజార్డర్ .. ఆత్మహత్యకు అదే ప్రధాన కారణం అని.

అప్పట్లో పోస్ట్ పెట్టానే అనుకోండి .... కొంతమంది చీల్చి చెండాడేవారు.

దర్యాప్తు చేసే పని పోలీసులది.

వ్యక్తులు కోణం నుంచి కాకుండా నలుగురికీ ఉపయోగపడేది మాత్రమే చెబుదాము అనేది నా పాలసీ.

Related Articles

Related image1
ప్రముఖ టీవీ యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య, కారణం ఏంటి?.. అతడి వల్లే కెరీర్‌ నాశనం
Related image2
CJ Roy : రివాల్వర్‌తో కాల్చుకుని బిగ్ బాస్ స్పాన్సర్, బిలియనీర్ సిజే రాయ్ ఆత్మహత్య
34
అమ్మాయిలూ... ధైర్యంగా ఉండండి
Image Credit : Geini AI

అమ్మాయిలూ... ధైర్యంగా ఉండండి

7. మేజర్ డెప్రీస్సివ్ డిసార్డర్ అనేది పురుషుల్లో కంటే మహిళల్లో మూడు రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది .

రజస్వల వయస్సులో అమ్మాయిలో ఎక్కువ.

8. ఈ మానసిక సమస్య వున్నవారు బయటకు బాగానే ఉంటారు. చూసేవారు ధైర్యవంతురాలు అనుకొంటారు.

కానీ చెదలు పట్టిన కట్టెలా... వీరు లోపల మహా బలహీనం.

" ఎందుకు బతకాలి? బతికితే ఏమి వస్తుంది?"... అనే రీతిలో వీరి ఆలోచనలు సాగుతాయి.

జీవించాలనే ఇచ్ఛను కోల్పోతారు.

నగరాల్లో పాశ్చాత్య సమాజాల్లో ఇది ఎక్కువ.

8. ఇది ఉన్నవారందరూ ఆత్మహత్య చేసుకొంటారు అని లేదు. కానీ ఒంటరి తనం దీన్ని మరింత పెంచుతుంది.

చివరిగా రెండు మాటలు ..

ఆ వార్త విన్న తరువాత నాకు కూడా అయ్యో అన్పించింది.

కానీ ..

1 . నేను పోతున్నాను కాబట్టి నాతో నా బిడ్డలు కూడా రావాలి అనుకొని... వారు తన మాటకు ఎదురు చెప్పరు కాబట్టి తనతో బాటు మృతువు ఒడిలోకి నడిపించడం ప్రేమ కాదు.

విషపు ప్రేమ.

అదే తల్లి ప్రేమ .. అనుకొనే వారికో దండం.

2. ఉద్యోగాలు ముఖ్యమే...సంపాదన అవసరం.. కానీ ఏళ్ళ తరబడి కుటుంబానికి దూరంగా ఉంటే??

ఆ పిల్లలకు తల్లిపై ఉన్న అటాచ్మెంట్ లో కనీసం సగం తండ్రిపై ఉంటే .. తల్లితో ఆలా కలిసి వెళ్లి పట్టాలు ఎక్కి జీవితాన్ని పట్టాలు తప్పించేవారా ? ఆలోచించండి .

నా పోస్ట్ లో గత వారం అదే చెప్పాను. కుటుంబ సభ్యులతో కాలం గడపండి. విదేశీ ఉద్యోగం అయినా సంవత్సరానికి కనీసం మూడునెలలు వారిని అక్కడికి రప్పించుకోండి .. మీరు ఇక్కడికి రండి అని.

44
ఎలాంటి నెగెటివ్ థింకింగ్ వద్దు
Image Credit : ANI

ఎలాంటి నెగెటివ్ థింకింగ్ వద్దు

3. ఆమె హిందువు.

హిందువుల నమ్మకం గురించి మాట్లాడుతాను.

ఆత్మహత్య చేసుకొంటే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. పరలోకాని పోదు.

దెయ్యంగా మారుతుంది.

ఏమి పాపం చేశారని ఆమె తన బిడ్డల్ని దెయ్యాలుగా మార్చింది??

ఆమెపై సానుభూతి... టన్నులకొద్దీ చూపుతున్న వారే చెప్పాలి.

4. మరణం తరువాత కట్టెను ఎలా పూడ్చాలో/కాల్చాలో నియమాలున్నాయి.

మీకు తెలుసా??

ఆ ముగ్గురు వ్యక్తుల శవాలను కొంత సేపు కుక్కలు పీక్కొని తిన్నాయి .

ఏంది స్వామి ఈ దౌర్భగ్యం?

బతుకు లేదు.

కానీ... చావు కూడా ఇంత ఘోరంగా... హీనంగా ఉండాలా ?

వారి గురించి కాదు .

వారు పోయారు .

మంచి చెడు ఇక వారికి అంటదు.

మీ ఆలోచనా తీరు సరిగా ఉండాలని .. చక్కగా బతకాలని .. బతికి సాధించాలని .. మీలో నెగటివ్ ఆలోచనలు రాకూడదని .. మీరు మీ కుటుంబాలు .. పిల్లాపాపలతో సల్లగా ఉండాలని ఈ విశ్లేషణ .

నిజాలు చాలా సార్లు మహా చేదుగా ఉంటాయి .

సారీ ..

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
నేరాలు, మోసాలు
హైదరాబాద్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Recommended image2
అమెరికా అర్చకుల ముందు ఐటీ ఉద్యోగులు జూజుబి.. ఒక్కో అయ్యవారి ఆదాయం ఎంతో తెలుసా..?
Recommended image3
Top 5 Mysterious Places : ఇళ్లకు తలుపులే ఉండవు, పాములతో కలిసి జీవనం.. ఇండియాలో టాప్ 5 వింత గ్రామాలు..!
Related Stories
Recommended image1
ప్రముఖ టీవీ యాంకర్‌ స్వేచ్ఛ ఆత్మహత్య, కారణం ఏంటి?.. అతడి వల్లే కెరీర్‌ నాశనం
Recommended image2
CJ Roy : రివాల్వర్‌తో కాల్చుకుని బిగ్ బాస్ స్పాన్సర్, బిలియనీర్ సిజే రాయ్ ఆత్మహత్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved