MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Prabhas: రాజాసాబ్ సినిమాలో చెప్పిన స‌హ‌స్ర చ‌క్రం అంటే ఏంటి.? అది ఎలా యాక్టివ్ అవుతుంది..

Prabhas: రాజాసాబ్ సినిమాలో చెప్పిన స‌హ‌స్ర చ‌క్రం అంటే ఏంటి.? అది ఎలా యాక్టివ్ అవుతుంది..

Prabhas: ప్ర‌భాస్ హీరోగా వచ్చిన రాజాసాబ్ సినిమాలో “సహస్ర చక్రం” అనే ఆధ్యాత్మిక అంశం ప్రస్తావనకు వచ్చిన విష‌యం తెలిసిందే. ఆ సీన్ చూసిన చాలామందికి సహస్ర చక్రం అంటే ఏంటి? నిజంగా అది ఉంటుందా? మనం దాన్ని తాకగలమా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jan 14 2026, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇంత‌కీ సహస్ర చక్రం అంటే ఏంటి?
Image Credit : Gemini AI, Prabhas/Instagram

ఇంత‌కీ సహస్ర చక్రం అంటే ఏంటి?

మన భారతీయ యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో 7 ప్రధాన చక్రాలు ఉంటాయి. ఇవి శక్తి కేంద్రాలు అని భావిస్తారు. ఈ 7 చక్రాలలో చివరిది, అత్యున్నతమైనది సహస్ర చక్రం. ఇది తల పైభాగంలో, తలపాగా ప్రాంతంలో ఉంటుంది. “సహస్ర” అంటే వెయ్యి అని అర్థం. వెయ్యి రేకులతో ఉన్న కమలం లాంటి చక్రం అన్న భావన ఉంది. ఈ చక్రం చైతన్యానికి, జ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి ప్రతీకగా చెబుతారు. ఇది యాక్టివ్ అయినప్పుడు మనిషి సాధారణ ఆలోచనల స్థాయి దాటి ఉన్నత అవగాహనకు చేరతాడని యోగ గ్రంథాలు చెబుతాయి.

25
సహస్ర చక్రం ప్రాముఖ్యత ఏంటి?
Image Credit : Gemini AI

సహస్ర చక్రం ప్రాముఖ్యత ఏంటి?

సహస్ర చక్రం అనేది కేవలం శరీర భాగం కాదు. ఇది మనస్సు, ఆలోచనలు, ఆత్మతో అనుసంధానం ఉన్న కేంద్రం. ఈ చక్రం సక్రియంగా ఉంటే.. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనల్లో స్పష్టత వస్తుంది, భయం, కోపం లాంటి భావాలు తగ్గుతాయి. జీవితం పట్ల లోతైన అర్థం తెలుస్తుంది. యోగా సాధ‌కులు చెప్పే దాని ప్ర‌కారం.. సహస్ర చక్రం ఓపెన్ అయితే మనిషి తనలోని నిజాన్ని తెలుసుకుంటాడు. అందుకే దీన్ని “మోక్ష ద్వారం” అని కూడా అంటారు.

Related Articles

Related image1
Post Office: ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెడితే డ‌బ్బుల‌కు డ‌బ్బులు కాస్తాయి.. డ‌బుల్ పైసా వ‌సూల్
Related image2
పండ‌క్కి మ‌ట‌న్ కొంటున్నారా.? ముదురు మాంసాన్ని ఎలా గుర్తించాలి, లేత మాంసం ఎలా ఉంటుంది?
35
సహస్ర చక్రాన్ని నిజంగా తాకగలమా?
Image Credit : Gemini AI

సహస్ర చక్రాన్ని నిజంగా తాకగలమా?

ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఇదే. సహస్ర చక్రాన్ని చేతితో తాకగలమా? సింపుల్‌గా చెప్పాలంటే తాక‌లేం. ఎందుకంటే ఇది భౌతికంగా క‌నిపించేదు కాదు. ఇది పూర్తిగా అంతర్గత అనుభూతి, శక్తి స్థాయిలో ఉండే భావన. మన భావాలు, ఆలోచనలు, చైతన్యం ఒక నిర్దిష్ట స్థాయికి చేరినప్పుడు కలిగే అనుభవం ఇది.

45
సహస్ర చక్రం యాక్టివ్ అవ్వాలంటే ఏం చేయాలి?
Image Credit : Gemini AI

సహస్ర చక్రం యాక్టివ్ అవ్వాలంటే ఏం చేయాలి?

యోగ గ్రంథాల ప్రకారం సహస్ర చక్రం ఒక్కసారిగా యాక్టివ్ కాదు. దానికి ముందుగా మిగతా చక్రాలు సక్రమంగా పనిచేయాలి. సాధారణంగా చెప్పే పద్ధతులు ఇవి.. ధ్యానం అలవాటు చేసుకోవడం, శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామం, ఆలోచనలను నియంత్రించే సాధన, లోభం, అసూయ లాంటి భావాలపై అవగాహన, శాంతమైన జీవనశైలి. ఇవి సంవత్సరాల సాధనతో వచ్చే ఫలితం.

55
రాజాసాబ్ సినిమాలో సహస్ర చక్రం ఎందుకు చూపించారు?
Image Credit : Gemini AI

రాజాసాబ్ సినిమాలో సహస్ర చక్రం ఎందుకు చూపించారు?

రాజాసాబ్ సినిమాలో ప్ర‌భాస్ తాత హిప్న‌టిజం ద్వారానే వ్య‌క్తుల‌ను త‌న ఆధీనంలోకి తీసుకొని భ‌య‌పెడుతుంటాడు. అతీత శ‌క్తుల‌కు, సైంటిఫిక్ అంశాన్ని జోడించి చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు మారుతి. అవ‌త‌లి వ్య‌క్తి చేసే హిప్న‌టిజాన్ని జ‌యించాలంటే ముందుగా త‌న‌లోని భావోద్వేగాల‌ను కంట్రోల్ చేసుకోవాల‌నే కాన్సెప్ట్‌ను చూపించారు. దీనికి స‌హ‌స్ర చ‌క్రాన్ని టూల్‌గా ఉప‌యోగించారు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో ఉన్న స‌మాచారం ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Recommended image2
అమెరికా అర్చకుల ముందు ఐటీ ఉద్యోగులు జూజుబి.. ఒక్కో అయ్యవారి ఆదాయం ఎంతో తెలుసా..?
Recommended image3
Top 5 Mysterious Places : ఇళ్లకు తలుపులే ఉండవు, పాములతో కలిసి జీవనం.. ఇండియాలో టాప్ 5 వింత గ్రామాలు..!
Related Stories
Recommended image1
Post Office: ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెడితే డ‌బ్బుల‌కు డ‌బ్బులు కాస్తాయి.. డ‌బుల్ పైసా వ‌సూల్
Recommended image2
పండ‌క్కి మ‌ట‌న్ కొంటున్నారా.? ముదురు మాంసాన్ని ఎలా గుర్తించాలి, లేత మాంసం ఎలా ఉంటుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved