MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Motivational Story: నిజ‌మైన సంప‌ద అంటే ఏంటి.? జీవితాన్ని మార్చే క‌థ

Motivational Story: నిజ‌మైన సంప‌ద అంటే ఏంటి.? జీవితాన్ని మార్చే క‌థ

Motivational Story: జీవితంలో విజ‌యం అంటే డ‌బ్బు సంపాదించ‌డ‌మే అనే అనుకుంటాం. అయితే నిజ‌మైన సంప‌దకు అర్థం వేరే ఉంద‌నే గొప్ప సందేశాన్ని చాటి చెప్పే ఒక క‌థ గురించి ఈరోజు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 10 2025, 12:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ధ‌నిక తండ్రి వింత ఆలోచ‌న
Image Credit : Generated by google gemini AI

ధ‌నిక తండ్రి వింత ఆలోచ‌న

అన‌గ‌న‌గా ఓ ఊరిలో ఓ బాలుడు చాలా ధనిక కుటుంబంలో జ‌న్మించాడు. తండ్రి అత‌న్ని చిన్న‌నాటి నుంచి క‌ష్ట‌మ‌నేది తెలియ‌కుండా పెంచాడు. అయితే ఇదే స‌మ‌యంలో తన కుమారుడు జీవితంలో ఉన్న సౌకర్యాల విలువను అర్థం చేసుకోవాలని అనుకున్నాడు. అందుకే ఒక రోజు అతడిని గ్రామంలోని పేద కుటుంబం వద్దకు తీసుకెళ్లి కొన్ని రోజులు గ‌డ‌ప‌మ‌ని తెలిపాడు. అక్కడ ఆ కుటుంబం వ్యవసాయం చేస్తూ, స్వంతంగా ఆహారం త‌యారు చేసుకుంటూ జీవిస్తున్న తీరును చూపించాడు.

25
పేద కుటుంబం వద్ద గడిపిన రోజులు
Image Credit : Generated by google gemini AI

పేద కుటుంబం వద్ద గడిపిన రోజులు

ఆ బాలుడు అక్క‌డున్న పేద కుటుంబంతో క‌లిసి పంట‌లు కోస్తూ, జంతువుల‌ను పెంచుతూ గ‌డిపాడు. అయితే ఆ ఇంట్లో అత‌నికి కావాల్సిన స‌దుపాయాలు లేవు, చాలా సాధారణ జీవితం గ‌డిపాడు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేశాడు. త‌న దుస్తుల‌ను తానే ఉతుక్కున్నాడు, త‌న ప‌నులు తానే చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బాలుడు తిరిగి త‌న ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు తండ్రి తన కుమారుడిని.. ఈ ప్ర‌యాణం ఎలా అనిపించింది? నీవు ఏదైనా నేర్చుకున్నావా? అని అడిగాడు.

Related Articles

Related image1
Hyderabad: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు ఇదే స‌రైన స‌మ‌యమా? ధ‌ర‌లు నిజంగానే త‌గ్గాయా.?
Related image2
Women Leave: మ‌హిళ‌ల‌కు 12 రోజులు జీతంతో కూడిన సెల‌వులు.. రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
35
బాలుడి స‌మాధానంతో ఆశ్చ‌ర్యం
Image Credit : Generated by google gemini AI

బాలుడి స‌మాధానంతో ఆశ్చ‌ర్యం

ఆ బాలుడు వెంట‌నే స్పందిస్తూ.. “అద్భుతంగా ఉంది, ఆ కుటుంబ స‌భ్యులు చాలా అదృష్ట‌వంతులు” అని చెబుతాడు. దీంతో తండ్రి ఆశ్చ‌ర్య‌పోతాడు. అదేంటి.. ‘వాళ్ల ఇళ్లు చాలా చిన్న‌గా ఉంది, స‌రైన స‌దుపాయాలు లేవ‌ని అంటావు అనుంకుటే బాగుంద‌ని బ‌దులిచ్చావు ఏంటి’ అని ప్ర‌శ్నిస్తాడు. దీనికి ఆ బాలుడు న‌వ్వుతూ.. ‘మ‌న ఇంట్లో కేవ‌లం ఒక్క కుక్క మాత్ర‌మే ఉంది. వారి ఇంట్లో కుక్క‌ల‌తో పాటు ఆవులు, మేక‌లు ఉన్నాయి. మ‌న ఇంట్లో న‌లుగురు మాత్ర‌మే ఉన్నాం, అక్క‌డ ఎక్కువ మంది ఉన్నారు. మ‌న ఇంట్లో ఒక్కొక్క‌రం ఒక్కో స‌మ‌యంలో భోజ‌నం చేస్తాం, వాళ్లింట్లో మాత్రం అంతా క‌లిసి స‌ర‌దాగా భోజ‌నం చేస్తారు. మ‌న ఇంట్లో చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది.. కానీ వాళ్ల ద‌గ్గ ఎప్ప‌టికీ ఎండిపోని న‌ది ఉంది’ అని చెప్పుకొచ్చాడు.

45
అసలు ధనవంతులు వాళ్లే
Image Credit : Generated by google gemini AI

అసలు ధనవంతులు వాళ్లే

ఆ బాలుడు ఇంకా మాట్లాడుతూ.. ‘నిజానికి ధనవంతులం మనం కాదు నాన్న, వాళ్లే నిజమైన ధనవంతులు. నన్ను తీసుకెళ్లి అసలు ధనవంతులు ఎలా జీవిస్తారో చూపించినందుకు ధన్యవాదాలు నాన్న!” అని చెప్తాడు. తండ్రి తన కుమారుడికి.. పేదరికాన్ని చూపించాలనుకున్నాడు, కానీ ఆ బాబు నిజమైన సంపద అంటే ప్రేమ, సహజసిద్ధమైన జీవనం, స్వేచ్ఛ అని గ్రహించాడు.

55
ఈ కథ చెబుతున్న సందేశం ఏంటంటే.?
Image Credit : Generated by google gemini AI

ఈ కథ చెబుతున్న సందేశం ఏంటంటే.?

నిజమైన సంపద అంటే.. డబ్బు, ఆస్తులు, విలాసవంతమైన వస్తువులు కాదు. మన చుట్టూ ఉన్న ప్రేమించే మనుషులు, సహజమైన ప్రకృతి, మనసుకు శాంతి, స్వేచ్ఛ ఇవే అసలు ధనాలు. ధ‌నిక జీవితం అంటే ల‌గ్జ‌రీ వ‌స్తువుల‌ను ఉప‌యోగించ‌డం కాదు మ‌న‌కు న‌చ్చిన ప‌ని చేసుకుంటూ, న‌చ్చిన వ్య‌క్తుల‌తో స‌రదాగా జీవించ‌డ‌మే అనే గొప్ప సందేశాన్ని ఈ క‌థ అందిస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Recommended image2
అమెరికా అర్చకుల ముందు ఐటీ ఉద్యోగులు జూజుబి.. ఒక్కో అయ్యవారి ఆదాయం ఎంతో తెలుసా..?
Recommended image3
Top 5 Mysterious Places : ఇళ్లకు తలుపులే ఉండవు, పాములతో కలిసి జీవనం.. ఇండియాలో టాప్ 5 వింత గ్రామాలు..!
Related Stories
Recommended image1
Hyderabad: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు ఇదే స‌రైన స‌మ‌యమా? ధ‌ర‌లు నిజంగానే త‌గ్గాయా.?
Recommended image2
Women Leave: మ‌హిళ‌ల‌కు 12 రోజులు జీతంతో కూడిన సెల‌వులు.. రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved