MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Motivational Story: ఇది ఇలాగే ఉండ‌దు.. దీని అర్థం తెలిస్తే జీవితంలో అస్స‌లు బాధ‌ప‌డ‌రు. మంచి నీతి క‌థ

Motivational Story: ఇది ఇలాగే ఉండ‌దు.. దీని అర్థం తెలిస్తే జీవితంలో అస్స‌లు బాధ‌ప‌డ‌రు. మంచి నీతి క‌థ

Motivational Story: జీవితంలో క‌ష్టాలు రావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అయితే ఏదీ శాశ్వ‌తం కాద‌న్న స‌త్యాన్ని తెలుసుకుంటే బాధ మ‌న ద‌రిచేర‌దు. అలాంటి గొప్ప నీతిని అందించే ఒక క‌థ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 18 2025, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రైతు ఆవు క‌థ
Image Credit : Generated by google gemini AI

రైతు - ఆవు క‌థ

అన‌గ‌న‌గా ఒక ఊరిలో అంజ‌న్న అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక ఆవు ఉండేది. దాంతో అత‌ను పొలం దున్న‌డం, పాలు పిత‌క‌డం లాంటివి చేస్తుండే వాడు. ఆ ఆవు ఒక్క‌టే అత‌నికి జీవ‌నాధారం. అయితే ఒక రోజు ఆవు ఉన్న‌ట్లుండి త‌ప్పిపోయింది. దీంతో రైతు ఉపాధి కోల్పోయాడు.

25
ప్ర‌శాంతంగా స్పందించిన రైతు
Image Credit : Generated by google gemini AI

ప్ర‌శాంతంగా స్పందించిన రైతు

ఆవు కోల్పోయిన రైతును ప‌రామ‌ర్శించేందుకు అంతా వ‌చ్చారు. నీకు బాధే మిగిలింది. అదృష్టం ఎంత చెడ్డ‌దో చూశావా? ఆవు లేకుండా నువ్వు ఎలా బ‌తుకుతావు.? అని ప్ర‌శ్నిస్తారు. దీంతో రైతు ప్ర‌శాంతంగా స్పందిస్తూ.. “సుఖం – దుఃఖం ఎప్పటికీ ఒకేలా ఉండవు. ఏమి జరగబోతుందో మనకు తెలియదు.” అని బ‌దులిస్తాడు.

Related Articles

Related image1
Rain Alert: ఆకాశంలో అల్ల‌క‌ల్లోలం.. గురువారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షం తప్పదు
Related image2
zodiac sign: ఈ రాశుల వారు ఊపిరి పీల్చుకోండి.. శని పై గురు దృష్టితో అక్టోబ‌ర్ నుంచి మీ క‌ష్టాల‌న్నీ పరార్
35
కొన్ని రోజుల‌కు మిరాకిల్
Image Credit : Generated by google gemini AI

కొన్ని రోజుల‌కు మిరాకిల్

కొన్ని రోజులు గడిచాక ఆ ఆవు తిరిగి వచ్చింది. అయితే ఆ ఆవు ఒంట‌రిగా కాకుండా రెండు దూడలను వెంట‌బెట్టుకొని వ‌చ్చింది. దీంతో ఊరంతా ఆశ్చ‌ర్య‌పోయి.. అబ్బా ఈ రైతు అదృష్టం భ‌లే ఉంది. ఒక ఆవు పోయిందని అనుకుంటే రెండు వ‌చ్చాయి. ఇంకేంటి బిందాస్ అంటారు. దీనికి రైతు బ‌దులిస్తూ.. “సుఖం – దుఃఖం మారుతూ ఉంటాయి. ఇది కూడా ఎక్కువ రోజులు నిలబడకపోవచ్చు.” అని చెప్తాడు.

45
మళ్లీ కొన్ని రోజుల‌కు ఓ స‌మ‌స్య
Image Credit : Generated by google gemini AI

మళ్లీ కొన్ని రోజుల‌కు ఓ స‌మ‌స్య

అంతా స‌వ్యంగా సాగుతోంద‌ని అనుకుంటున్న స‌మ‌యంలోనే రైతుకు మ‌రో స‌మ‌స్య వ‌స్తుంది. రైతు కొడుకు ఆవుతో దున్నుతోన్న స‌మ‌యంలో గాయం అవుతుంది. కాలు చివ‌ర‌న వేలు క‌ట్ కావ‌డంతో న‌డ‌వ‌లేని స్థితిలో ఉంటాడు. దీంతో ప్ర‌జ‌లంతా..“నీ కుమారుడికి ఎంత క‌ష్టం వ‌చ్చింది. అదృష్టం అంత‌లోనే పోయింది” అని అంటారు. కానీ రైతు మాత్రం ప్ర‌శాంతంగా మ‌ళ్లీ.. “సుఖం – దుఃఖం ఎప్పటికీ ఒకేలా ఉండ‌దు.” అని బ‌దులిస్తాడు. కొన్ని నెలల ప‌క్క రాజ్యంలో యుద్ధం జ‌రుగుతుంది. దీంతో రాజు ఊరిలోని కొంద‌రు యువ‌కుల‌ను సైన్యంలో చేర‌మ‌ని అడుగుతారు. దీంతో గ్రామంలోని పేరెంట్స్ అంతా త‌మ పిల్ల‌ల‌ను పంపేందుకు భ‌య‌ప‌డ‌తారు. అయితే రైతు కొడుకు గాయ‌ప‌డిన కార‌ణంగా యుద్ధానికి వెళ్లడు. దీంతో రైతుకు మ‌ళ్లీ లాభం చేకూరుతుంది.

55
గొప్ప నీతి
Image Credit : X

గొప్ప నీతి

ఈ క‌థ‌లో గొప్ప నీతి ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట ఇదే భావాన్ని వ్యక్తం చేస్తుంది:

“మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః।

ఆగమాపాయినోఽనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత॥”

(గీతా – 2:14)

దీని అర్థం ఇంద్రియాలు కలిగించే సుఖాలు, దుఃఖాలు వేసవి, శీతాకాలం లాంటివి. అవి వస్తూ పోతూ ఉంటాయి. నిత్యమైనవి కావు. వాటిని సహనంతో ఎదుర్కొనాలి. కాబ‌ట్టి జీవితంలో సుఖం, దుఃఖం ఎప్పటికీ స్థిరంగా ఉండవు. ఇవి అలల లాంటివి. ఒక్కసారి ఎగసిపడతాయి, మరొకసారి తగ్గిపోతాయి. మనం సహనంగా ఉండి, మన మనసును స్థిరంగా ఉంచుకోవాలి. అప్పుడు నిజమైన శాంతి లభిస్తుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్య.. ఇలాంటి వార్తలు చదివినా ప్రమాదమే..!
Recommended image2
అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!
Recommended image3
అమెరికా అర్చకుల ముందు ఐటీ ఉద్యోగులు జూజుబి.. ఒక్కో అయ్యవారి ఆదాయం ఎంతో తెలుసా..?
Related Stories
Recommended image1
Rain Alert: ఆకాశంలో అల్ల‌క‌ల్లోలం.. గురువారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షం తప్పదు
Recommended image2
zodiac sign: ఈ రాశుల వారు ఊపిరి పీల్చుకోండి.. శని పై గురు దృష్టితో అక్టోబ‌ర్ నుంచి మీ క‌ష్టాల‌న్నీ పరార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved