MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 4 ఏళ్ళుగా ఒక్క హిట్టు లేదు, రామ్, నితిన్ నుంచి వరుణ్ నిఖిల్ వరకు, సక్సెస్ కోసం ఎదరుచూస్తున్నయంగ్ స్టార్స్

4 ఏళ్ళుగా ఒక్క హిట్టు లేదు, రామ్, నితిన్ నుంచి వరుణ్ నిఖిల్ వరకు, సక్సెస్ కోసం ఎదరుచూస్తున్నయంగ్ స్టార్స్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హవా చూపించిన యంగ్ హీరోలకు గత మూడునాలుగేళ్లుగా ఆశించిన విజయాలు అందటం లేదు. మెగా హీరోలతో పాటు ఒక్క హిట్టు ప్లీజ్ అంటోన్న  మరికొందరు యంగ్ స్టార్స్ ఎవరు? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 14 2025, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విజయ్ దేవరకొండ
Image Credit : Vijay Devarakonda/Instagram

విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో సంచలనం సృష్టించి, ఓవర్ నైట్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ, ఒక్క హిట్ ప్లీజ్ అంటూ ఎదరుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్ సాధించిన విజయ్ కు, గీత గోవిందం సినిమా తరువాత సరైన హిట్ పడలేదు. ఆతరువాత చేసిన అరడజన్ కు పైగా సినిమాలు నిరాశాను మిగిల్చాయి. ఒకటీ రెండు సినిమాలు తప్పించి ఏసినిమా యావరేజ్ కూడా అనిపించుకోలేదు. దాంతో సాలిడ్ సక్సెస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు రౌడీ హీరో. భారీ అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అయిన కింగ్డమ్ కూడా విజయ్ కు నిరాశను మిగిల్చింది.

26
హిట్ కోసం మెగా హీరోల ఎదురుచూపులు
Image Credit : Asianet News

హిట్ కోసం మెగా హీరోల ఎదురుచూపులు

ఇక మెగా హీరోల పరిస్థితి కూడా అంతే ఉంది. గ్లోబల్ హీరో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తరువాత రెండు డిజాస్టర్స్ ను ఫేస్ చేశాడు. ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాలతో రెండు ప్లాప్ లు ఫేస్ చేసిన రామ్ చరణ్ ఆశలన్నీ పెద్దిమీదనే పెట్టుకున్నాడు. హ్యాట్రిక్ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒక్క హిట్టు బాబోయ్ అంటున్నాడు. ఆయన నటించిన గాండీవధారి అర్జున, మట్కా సినిమా కూడా భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో వరుణ్ అసలు స్క్రీన్ మీద కనిపించకుండాపోయాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. మరి ఇది అయినా వరుణ్ ను ప్లాప్ ల నుంచి గట్టెక్కిస్తుందా లేదా చూడాలి. ఇప్పుడైతే కొడుకు పుట్టిన సందర్భాన్ని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు వరుణ్.

Related Articles

Related image1
సింహాసనం రివ్యూ.. చిరంజీవికి చెక్ పెట్టడానికి, కృష్ణ చేసిన అతి పెద్ద సాహసం.. 144 సెక్షన్ కు దారితీసిన సూపర్ స్టార్ మూవీ రిలీజ్
Related image2
బామ్మర్ది కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్.. రెండు అదిరిపోయే బహుమతులు, దెబ్బకు నితిన్ కెరీర్ సెట్ ?
36
మేగా మేనల్లుడి పరిస్థితి ఇది
Image Credit : our own

మేగా మేనల్లుడి పరిస్థితి ఇది

ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ది కూడా అదే పరిస్థితి. సాయి తేజ్ తన మేనమామన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో బ్రో సినిమా చేశాడు. కాని ఈసినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమాపై కూడా పెద్దగా హైప్ లేదు. మరి సాయి తేజ్ హిట్ కోసం ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. అటు మరో మెగా మేనల్లుడు, సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హిట్టు బాబోయ్ అంటున్నాడు. 2023 లో వచ్చిన ఆదికేశవ సినిమా తరువాత వైష్ణవ్ అసలు సినిమాలే చేయలేదు. మరో మెగా హీరో అల్లు శిరీష్ కూడా అంతే.. వరుస ఫెయిల్యూర్స్ చూసిన శిరీష్.. అసలు ఇండస్ట్రీలోనే కనిపించడంలేదు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.

46
నితిన్ , శర్వానంద్ కు కలిసిరాని కాలం
Image Credit : Asianet News

నితిన్ , శర్వానంద్ కు కలిసిరాని కాలం

టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సక్సెస్ లు చూశాడు యంగ్ హీరో నితిన్. కానీ ఇప్పుడు వరుసగా డిజాస్టర్లు ఫేస్ చేస్తున్నాడు. రంగ్ దే సినిమా తరువాత నితిన్ ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేదు. వరుసగా 'చెక్, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్, రాబిన్ హుడ్ తో పాటు రీసెంట్ గా 'తమ్ముడు సినిమాతో వరుసగా ప్లాప్ సినిమాలు చూశాడు నితిన్. అటు శర్వానంద్ పరిస్థితి కూడా అలానే ఉంది. శతమానం భవతి' భారీ విజయం తర్వాత వరుసగా ప్లాప్ సినిమాలతో ఇబ్బందుల్లో పడ్డాడు శర్వా. పడి పడి లేచే మనసు, శ్రీకారం, జాను, రణరంగం, మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌లుగా నిలిచాయి.

56
రామ్ పోతీనేని ప్రయోగాలు
Image Credit : Instagram / Ram Pothineni

రామ్ పోతీనేని ప్రయోగాలు

ఇక ఇస్మార్ట్ శంకర్ తరువాత ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా రామ్ ఖాతాలో పడలేదు. చాలా కాలంగా హిట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేశాడు రామ్. మాస్ ఇమేజ్ కోసం గట్టిగా ప్రయత్నించిన రామ్, అది కలిసిరాక మళ్లీ... లవర్ బాయ్ సినిమాలు చేశాడు. అవి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈమధ్యలో లింగు స్వామి, బోయపాటి లాంటి పెద్ద దర్శకులతో కూడా సినిమాలు చేసి చూశాడు. కానీ ఫెయిల్యూర్స్ మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి రామ్ ను. ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూక అనేసినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా రామ్ కు సక్సెస్ ను అందిస్తుందా చూడాలి.

66
హిట్ కోసం చూస్తోన్నయంగ్ స్టార్స్
Image Credit : Asianet News

హిట్ కోసం చూస్తోన్నయంగ్ స్టార్స్

టాలీవుడ్ లో ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న యంగ్ స్టార్స్ చాలామంది ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా అక్కినేని హీరో అఖిల్ కు సాలిడ్ హిట్ ఇంత వరకూ పడలేదు. ఇక ఛలో సినిమాతో టాలీవుడ్ చూపు తనవైపు తిప్పుకున్న నాగశౌర్య ఆతరువాత రెండు మూడు హిట్లు కొట్టాడు, కానీ ఇప్పుడు అసలు కనిపించకుండా పోయాడు, అటు విశ్వక్ సేన్ కూడా అంతే, ఆమధ్య వరుస హిట్లతో తెగ హడావిడి చేసిన విశ్వక్ ప్రస్తుతం సైలెంట్ అయ్యాడు. ఇక వరుస ప్లాప్ లు వెంటాడుతున్నా.. పట్టుదలతో సినిమా చేస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఈ హీరో ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ మాత్రం రావడంలేదు. అయినా తెలుగు, తమిళ భాషల్లో తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. ఇలా యంగ్ హీరోలు కొంత మంది హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
విజయ్ దేవరకొండ
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Prime Video Top 10 Movies: ఓటీటీలో `నారీ నారీ నడుమ మురారి` సంచలనం.. ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌.. టాప్‌ 10 మూవీస్‌
Recommended image2
Rajinikanth MGR: రజినీ జీవితాన్ని మార్చేసిన ఎంజీఆర్ 'మాస్టర్ ప్లాన్'! ఆ స్టైల్ ఎందుకంత నచ్చలేదంటే?
Recommended image3
Zero Flop Record: ఫ్లాప్ ఎరుగని హీరో.. చేసిన 3 సినిమాలు బ్లాక్‌బస్టర్.. ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
సింహాసనం రివ్యూ.. చిరంజీవికి చెక్ పెట్టడానికి, కృష్ణ చేసిన అతి పెద్ద సాహసం.. 144 సెక్షన్ కు దారితీసిన సూపర్ స్టార్ మూవీ రిలీజ్
Recommended image2
బామ్మర్ది కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్.. రెండు అదిరిపోయే బహుమతులు, దెబ్బకు నితిన్ కెరీర్ సెట్ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved