MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గేమ్ ఛేంజర్ లాంటి అనుభవం చిరంజీవికి కూడా తప్పలేదు..మెగాస్టార్ టైం, కష్టం మొత్తం వృథా చేసిన మూవీ ఏంటో తెలుసా

గేమ్ ఛేంజర్ లాంటి అనుభవం చిరంజీవికి కూడా తప్పలేదు..మెగాస్టార్ టైం, కష్టం మొత్తం వృథా చేసిన మూవీ ఏంటో తెలుసా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించిన వివాదం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి అనుభవమే ఓ చిత్రంతో ఎదురైంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 03 2025, 08:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గేమ్ ఛేంజర్ మూవీ వివాదం
Image Credit : Instagram

గేమ్ ఛేంజర్ మూవీ వివాదం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించిన వివాదం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. దిల్ రాజు సోదరుడు నిర్మాత శిరీష్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.గేమ్ ఛేంజర్ మూవీ ఫ్లాప్ తర్వాత తాము ఎలా ఉన్నామో తెలుసుకునేందుకు రామ్ చరణ్ కానీ శంకర్ కానీ కనీసం ఫోన్ చేయలేదు అంటూ శిరీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

25
చరణ్ ఫ్యాన్స్ ఫైర్
Image Credit : Instagram

చరణ్ ఫ్యాన్స్ ఫైర్

ఆయన చేసిన వ్యాఖ్యలు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీనితో శిరీష్ రెడ్డి దిగివచ్చి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. నిర్మాణ సంస్థ కంట్రోల్ లేకుండా, భారీ చిత్రాన్ని గాలికి వదిలేశారు. అలాంటప్పుడు ఆ చిత్రం ఫ్లాప్ కి హీరో ఎలా కారణమవుతారు అంటూ రామ్ చరణ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్ర పరాజయానికి కారణం శంకర్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కారణమని అంటున్నారు. రామ్ చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా చిత్రం తర్వాత ఈ మూవీ కోసం తన నాలుగేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసుకున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.

Related Articles

Related image1
కాపీ చేసే దర్శకులకే ప్రాధాన్యత, త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ కామెంట్స్.. హరిహర వీరమల్లుపై పరోక్షంగా సెటైర్లు
Related image2
అడ్వాన్స్ అందిన తర్వాత కూడా రాజశేఖర్, మోహన్ బాబు చేజారిన సూపర్ హిట్ మల్టీస్టారర్.. ఆ మూవీ ఎవరు చేశారంటే
35
చిరంజీవికి కూడా తప్పలేదు
Image Credit : Sun NXT

చిరంజీవికి కూడా తప్పలేదు

రామ్ చరణ్ ఈ మూవీతో ఎంత కష్టపడ్డప్పటికీ ఫలితం దక్కలేదు. పైగా ఈ చిత్రం అనేక వివాదాలు కారణమవుతోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి అనుభవమే ఓ చిత్రంతో ఎదురైంది. ఏళ్ల తరబడి చిరంజీవి ఆ చిత్రం కోసం కష్టపడ్డప్పటికీ సరైన ఫలితం దక్కలేదు. ఆ మూవీ మరేదో కాదు.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో, శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన అంజి చిత్రం.

45
అంజి చిత్రానికి ఆరేళ్ళ సమయం
Image Credit : Megastar Chiranjeevi Instagram

అంజి చిత్రానికి ఆరేళ్ళ సమయం

అంజి చిత్ర షూటింగ్ వివిధ సమస్యల కారణంగా ఆలస్యం అవుతూ ఆరేళ్లపాటు కొనసాగింది. చిరంజీవితో భారీ స్థాయిలో గ్రాఫిక్స్ ఉండే సినిమా చేయాలని శ్యాంప్రసాద్ రెడ్డి అనుకున్నారు. ఆయన కోరిక మేరకు కోడి రామకృష్ణ అంజి కథ రెడీ చేశారు. కానీ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ అంత సులభంగా పూర్తి కాలేదు. అనేక సమస్యల మధ్య ఆరేళ్ల సమయం పట్టింది. మూవీలో క్లైమాక్స్ సన్నివేశాల కోసం చిరంజీవి దాదాపు రెండేళ్ల పాటు ఒకే చొక్కా ఒకే తరహా కాస్ట్యూమ్స్ ధరించారట.

55
నిరాశ పరిచిన అంజి
Image Credit : Youtube

నిరాశ పరిచిన అంజి

అంత కష్టపడ్డప్పటికీ ఈ మూవీ అంచనాలను ని అందుకో లేకపోయింది. ఈ మూవీలో నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. నాగబాబు కీలక పాత్రలో నటించారు. టిల్లు ఆనంద్ విలన్ గా నటించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
Single Queens: పెళ్లి వయసు దాటవేసిన బ్యూటీలు..లైఫంతా ఒంటరిగానే మిగిలిపోతారా?
Recommended image2
Romantic Movies: వాలెంటైన్స్ డే కు లవర్ తో కలిసి చూడాల్సిన 5 ఎవర్‍గ్రీన్ సినిమాలు
Recommended image3
BB జోడీ 2 కోసం రీతూ చౌదరి, డిమోన్ పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?
Related Stories
Recommended image1
కాపీ చేసే దర్శకులకే ప్రాధాన్యత, త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ కామెంట్స్.. హరిహర వీరమల్లుపై పరోక్షంగా సెటైర్లు
Recommended image2
అడ్వాన్స్ అందిన తర్వాత కూడా రాజశేఖర్, మోహన్ బాబు చేజారిన సూపర్ హిట్ మల్టీస్టారర్.. ఆ మూవీ ఎవరు చేశారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved