మంచు విష్ణుకి షాకిచ్చిన కుమార్తెలు.. నోస్ జాబ్ చేయించుకోమని చురకలు, ఎందుకంటే
మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ కి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో మంచు విష్ణు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

మంచు విష్ణు కన్నప్ప మూవీ రిలీజ్ కి రెడీ
మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ కి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో మంచు విష్ణు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కన్నప్ప మూవీ దాదాపు 140 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైథలాజికల్ డ్రామాగా రూపొందిన "కన్నప్ప" చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు.
మంచు విష్ణుకి షాకిచ్చిన కుమార్తెలు
తాజాగా విష్ణు మంచు ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం, ప్రత్యేకంగా తన ఇద్దరు కూతుళ్లు చేసిన సరదా వ్యాఖ్యల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన ట్విన్ కుమార్తెలు అరియానా, వివియానా ప్రస్తుతం నోస్ జాబ్ విషయం మీద మక్కువ చూపుతున్నారని వెల్లడించారు. "నా కుమార్తెలు అరియనా, వివియానా నన్ను నోస్ జాబ్ చేయించుకోమని అంటున్నారు. వాళ్ళకి నా ముక్కు నచ్చడం లేదు.
నీ వల్లే మా ముక్కులు బాగాలేవు
హాలీవుడ్లో ప్రముఖ డాక్టర్ రాజ్ కనోడియా నాకు మంచి స్నేహితుడు. అతడితో 20 ఏళ్లుగా పరిచయం ఉంది. నేను లాస్ ఏంజిల్స్ లో చదివే రోజుల నుంచి తెలుసు. అదే వాళ్లకు చెప్పాను. అప్పుడు వాళ్లు అడిగారు: ‘అయితే ఇప్పటివరకు నోస్ జాబ్ ఎందుకు చేయించుకోలేదు? మా ముక్కులు నీ వల్లే బాగోలేవు..’ అని అన్నారు,"అంటూ తన కుమార్తెల గురించి విష్ణు సరదాగా తెలిపారు. .ఈ సందర్భంగా విష్ణు స్పందిస్తూ, "మీ ముక్కులు పర్ఫెక్ట్‌గా ఉన్నాయ్.. మీకు ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను నోస్ జాబ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు" అని చెప్పానన్నారు.
నా డ్రెస్ ని కూడా విమర్శిస్తారు
అంతేకాక, మరో సందర్భంలో తన ఫ్యాషన్ ఎంపికలపై కుమార్తెల విమర్శలు గుర్తు చేసుకున్నారు. ఒకరోజు పెళ్లికి వెళ్లాల్సి ఉండగా, భార్య విరానికా ఇంట్లో లేకపోవడంతో ఏదో ఒక డ్రెస్ వేసుకుని బయటకు వచ్చా. "అప్పుడు అరియానా, వివియానా నన్ను అడుగుతూ.. ‘నీవు ఈ డ్రెస్ వేసుకుని బయటకు వెళ్తున్నావా? ప్లీజ్, మమ్మల్ని నవ్వులపాలు చేయకు. వెంటనే డ్రెస్ మార్చుకో’ అని చెప్పినట్లు మంచు విష్ణు గుర్తు చేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో విష్ణు చెప్పిన మాటలు ప్రేక్షకులను నవ్వులు పూయించగా, మంచు విష్ణు తన కుమార్తెలతో ఎంత సరదాగా ఉంటారో ఈ వ్యాఖ్యల ద్వారా అర్థం అయింది.
కన్నప్పలో ప్రభాస్
మంచు విష్ణు, విరానికా దంపతులకు నలుగురు పిల్లలు సంతానం. అరియనా, వివియానా కవల పిల్లలు కాగా ఆ తర్వాత అవ్రామ్, ఆర్య విద్య జన్మించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటులు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్, మోహన్ లాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అదే విధంగా అక్షయ్ కుమార్ మహాశివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతి దేవిగా నటిస్తున్నారు.
ఇటీవల విడుదలైన కన్నప్ప ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఈ చిత్రంలో రుద్ర అనే గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. ఆ పెద్దోళ్ళకంటే నేనే పెద్దోడిని అంటూ ట్రైలర్ లో ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.