- Home
- Entertainment
- ఇండియాలోనే రిచెస్ట్ యాంకర్, 195 కోట్ల రెమ్యునరేషన్ తో సంచలనం.. ప్రభాస్, బన్నీ కూడా అతడి ముందు దిగదుడుపే
ఇండియాలోనే రిచెస్ట్ యాంకర్, 195 కోట్ల రెమ్యునరేషన్ తో సంచలనం.. ప్రభాస్, బన్నీ కూడా అతడి ముందు దిగదుడుపే
ప్రముఖ బుల్లితెర యాంకర్, కమెడియన్ తన వందల కోట్ల రెమ్యునరేషన్ తో సంచలనం సృష్టిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్లకి ధీటుగా అతడి రెమ్యునరేషన్ ఉంటోంది.

పాన్ ఇండియా స్టార్ల రెమ్యునరేషన్
ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్లు వందల కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. బాలీవుడ్ హీరోలని మించేలా వీరి రెమ్యునరేషన్ ఉంటోంది. ప్రభాస్ ఒక్కో చిత్రానికి 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఛార్జ్ చేస్తారని సమాచారం. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో పెరిగింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 300 కోట్లు అని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్, అల్లు అర్జున్, షారుఖ్ లాంటి పాన్ ఇండియా స్టార్ లకు షాక్ ఇచ్చే విధంగా ఒక బుల్లితెర యాంకర్, కమెడియన్ రెమ్యునరేషన్ సంచలనం సృష్టిస్తోంది.
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3
ప్రముఖ బుల్లితెర యాంకర్, హాస్యనటుడు అయిన కపిల్ శర్మ నెట్‌ఫ్లిక్స్ వేదికగా నిర్వహిస్తున్న ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో మూడవ సీజన్‌తో మళ్లీ ప్రేక్షకులను అలరిస్తోంది. జూన్ 21, 2025న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌కు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా వచ్చారు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు తాజా ఎపిసోడ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.
ఈ షోకు సంబంధించి కపిల్ శర్మ రెమ్యునరేషన్ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మీడియాలో వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, కపిల్ శర్మ తొలి సీజన్ నుంచే ఒక్కో ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. 2024 మార్చి 30 నుండి జూన్ 22 వరకు ప్రసారమైన తొలి సీజన్‌లో మొత్తం 13 ఎపిసోడ్‌లుఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ కి 5 కోట్లు చొప్పున కపిల్ రెమ్యునరేషన్ మొత్తం రూ.65 కోట్లు అయ్యింది.
మూడు సీజన్లకు 195 కోట్ల రెమ్యునరేషన్
అదే విధంగా, రెండవ సీజన్ కూడా 13 ఎపిసోడ్‌లతో 2024 సెప్టెంబర్ 21 నుంచి డిసెంబర్ 14 వరకుప్రసారమైంది. సెకండ్ సీజన్ కి కూడా కపిల్ శర్మ అదే రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇది కూడా మరో రూ.65 కోట్లను తీసుకువచ్చింది.
ప్రస్తుతం నడుస్తున్న మూడవ సీజన్‌కు కూడా అదే పారితోషికం చెల్లిస్తున్నారని నివేదికలు తెలిపాయి. మొత్తం 13 ఎపిసోడ్‌లు ప్రసారమయ్యే అవకాశముండటంతో కపిల్ మరో రూ.65 కోట్లు సంపాదించనున్నారు. ఇలా మూడు సీజన్ల కలిపి కపిల్ శర్మకు ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.195 కోట్లు.
పాన్ ఇండియా స్టార్లని మించేలా సంపాదన
ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో తొలి సీజన్ 2024 మార్చిలో ప్రారంభమైంది. అంటే కేవలం 16 నెలల వ్యవధిలో కపిల్ శర్మ ఏకంగా 195 కోట్లు సంపాదించారు. ఇది ఆషామాషీ విషయం కాదు. ఉదాహరణకి పాన్ ఇండియా హీరో ఎవరైనా ఒక భారీ బడ్జెట్ చిత్రం చేస్తే మినిమమ్ 2 ఏళ్ళ టైం పడుతుంది. రెండేళ్ల కష్టానికి గాను వారికి 200 కోట్ల వరకు పారితోషికం దక్కుతుంది. కానీ కపిల్ శర్మ 16 నెలల్లో మూడు సీజన్లు కలిపి 39 ఎపిసోడ్స్ కి గాను 195 కోట్లు అందుకుంటున్నారు. దీని ప్రకారం కపిల్ శర్మ ఆదాయం పాన్ ఇండియా స్టార్లని మించేలా ఉందని చెప్పడంలో సందేహం లేదు.
ఈ షోలో కపిల్‌తో పాటు మరో ప్రముఖులు కూడా ఉన్నారు. అర్చన పూరన్ సింగ్ ఒక్క ఎపిసోడ్‌కు రూ.10 నుండి 12 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రముఖ హాస్యనటుడు సునీల్ గ్రోవర్ ఒక్క ఎపిసోడ్‌కు రూ.25 లక్షలు, కికూ శార్దా రూ.7 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం.
కపిల్ శర్మ తొలి రెమ్యునరేషన్ రూ.500
నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ఈ హాస్య కార్యక్రమం కేవలం వినోదం మాత్రమే కాకుండా, భారీ మొత్తంలో పారితోషికాలు అందిస్తున్న ప్రాజెక్ట్‌గా నిలిచిందని తెలుస్తోంది. కపిల్ శర్మ 2007 నుండి బుల్లితెరపై కామెడీ షోలతో తనదైన ముద్ర వేస్తున్నారు.
కపిల్ శర్మ ఎన్ని కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నారు. కమెడియన్ కాకముందు ఓ టెలిఫోన్ బూత్ లో పనిచేసేవారట. అక్కడ కపిల్ తొలి సంపాదన రూ.500 మాత్రమే. కానీ ఇప్పుడు వందల కోట్లు అందుకునే స్థాయికి ఎదిగారు. కపిల్ తండ్రి జీతేంద్ర కుమార్ శర్మ పంజాబ్ పోలీస్ లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయన క్యాన్సర్ కారణంగా 2004లో మృతి చెందారు.కపిల్ శర్మ 2015 నుండి 2019 వరకు ఫోర్బ్స్ ప్రకటించిన టాప్ 100 ఇండియన్ సెలెబ్రిటీస్ లిస్ట్‌లోస్థానం దక్కించుకున్నారు. తండ్రి అనారోగ్యం కారణంగా కుటుంబ బాధ్యతలు భుజాలపై తీసుకున్న కపిల్, తన బాచిలర్స్ డిగ్రీ మధ్యలోనే ఆపేశాడు. తరువాత డిగ్రీ పూర్తిచేసే అవకాశం రాలేదు.