- Home
- Entertainment
- Vijay Deverakonda: ఫారెన్ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Vijay Deverakonda: ఫారెన్ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Vijay Deverakonda: హీరోయిన్ రష్మిక మందన్నాతో పెళ్లి వార్తల మధ్య, విజయ్ దేవరకొండ తన మాజీ ప్రియురాలితో దిగిన పాత ఫోటోలు లీకయ్యాయి. సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.

రష్మిక మందన్నాతో త్వరలో విజయ్ దేవరకొండ పెళ్లి
హీరోయిన్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ జంటకు ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోయిందని ప్రచారం జరిగింది. విజయ్ దేవరకొండ ఇంట్లో, వెకేషన్లో రష్మిక కనిపించడంతో అభిమానులు ఈ వార్తలను నిజమని నమ్ముతున్నారు. ఈ నెలాఖరులో వీరి పెళ్లి జరగనుందనే రూమర్స్ వస్తున్న టైంలో, విజయ్ పాత ఫోటోలు లీకై సంచలనం సృష్టిస్తున్నాయి.
మాజీ లవర్‌తో విజయ్ దేవరకొండ ఫోటోలు లీక్
బెల్జియం మోడల్‌తో విజయ్ డేటింగ్?
కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, విజయ్ దేవరకొండ బెల్జియంకు చెందిన ఒక మోడల్‌తో డేటింగ్ చేశాడని చెబుతున్నారు. ఈ మోడల్‌తో విజయ్ క్లోజ్‌గా ఉన్న కొన్ని ఫోటోలు ఇప్పుడు అన్నిచోట్లా హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ కొన్ని సంవత్సరాలు డేటింగ్లో ఉన్నారని టాక్. కోవిడ్ సమయంలో కూడా విజయ్ ఆ మోడల్‌ను కలవడానికి యూరప్ వెళ్లాడని కొన్ని మీడియా సంస్థలు రాశాయి. ఆమె తల్లిదండ్రులు కూడా హైదరాబాద్ వచ్చారట. అయితే, వీరి డేటింగ్ అకస్మాత్తుగా ముగిసింది. రష్మిక మందన్నాతో సినిమా చేసిన తర్వాత ఈ బెల్జియం మోడల్‌తో బ్రేకప్ అయిందని అంటున్నారు. కానీ, ఈ సమాచారం ఏదీ అధికారికంగా ధృవీకరించబడలేదు.
విజయ్ పెళ్లి వేళ తప్పుడు ప్రచారమా?
ఈ బెల్జియం మోడల్ పేరు వర్జీనీ అని తెలుస్తోంది. ఈమె 2016లో వచ్చిన విజయ్ దేవరకొండ 'పెళ్లి చూపులు' సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది. ఈ సినిమా తర్వాత విజయ్, ఈమె మంచి స్నేహితులయ్యారు. ఆ సమయంలో తీసిన ఫోటోలే ఇవని అంటున్నారు. విజయ్, వర్జీనీ మంచి స్నేహితులు మాత్రమేనని, వారి మధ్య మరే బంధం లేదని అభిమానులు చెబుతున్నారు. కానీ మరికొందరు మాత్రం, ఈ ఫోటోలు చూస్తే కేవలం స్నేహితుల్లా లేరని, అంతకంటే ఎక్కువ బంధం ఉందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో పెళ్లి జరగబోతున్న వేళ కొందరు పడని వాళ్లు కావాలని వైరల్ చేస్తున్నారని, తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఏది నిజమే తెలియాల్సి ఉంది.
ఈ నెల 26న ఉదయ్ పూర్లో విజయ్, రష్మిక పెళ్లి
ఇదిలా ఉంటే ఈ నెల 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మ్యారేజ్ చేసుకోబోతున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా పెళ్లి జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అతికొద్ది మంది బంధుమిత్రులు, సినీ సెలబ్రిటీలు వీరి పెళ్లికి హాజరు కానున్నారట. ఇక మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగబోతుందని, దీనికి సినిమా సెలబ్రిటీలంతా హాజరు కానున్నారట. ప్రస్తుతం గెస్ట్ లను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు విజయ్, రష్మిక.

