త్రివిక్రమ్ మళ్ళీ అదే సెంటిమెంట్.. వెంకటేష్ మూవీ టైటిల్ ఇదేనా, వైరల్
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్ లో ఒక చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ 77వ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కించాలనుకున్నారు. కానీ అది కుదర్లేదు. పురాణాల నేపథ్యంలో, కుమార స్వామి పాత్రతో త్రివిక్రమ్ కథ సిద్ధం చేసుకున్నారు. బన్నీతో చేయాలనుకున్న అదే చిత్రాన్ని త్రివిక్రమ్.. జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది భారీ ప్రాజెక్ట్. ఈ చిత్రం ప్రారంభం కావడానికి ఇంకా టైం ఉంది. ఇంతలో మీడియం బడ్జెట్ లో ఒక చిత్రాన్ని పూర్తి చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు.
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్ లో ఒక చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ 77వ చిత్రాన్ని త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ప్రకటన వెలువడకపోయినా, ఇండస్ట్రీలో గుసగుసలు మాత్రం ఊపుమీదున్నాయి. ఈ సినిమా నిర్మాణం సైలెంట్‌గా ప్రారంభం అవుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి ‘వెంకట రమణ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ఈ టైటిల్ కి ‘కేర్ ఆఫ్ ఆనంద నిలయం’ అనే ట్యాగ్‌లైన్ కూడా ప్రచారంలో ఉంది. టైటిల్ గమనిస్తుంటే, ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే సంకేతాలు అందుతున్నాయి.త్రివిక్రమ్ ఎప్పుడూ ఫాలో అయ్యే ఇంటి సెంటిమెంట్ కూడా ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ చిత్రాలలో ఎక్కువగా ఇంటి సెంటిమెంట్ ఉంటుంది. అల వైకుంఠపురంలో చిత్రం ఒక హౌస్ చుట్టూ జరిగే కథ. అదే విధంగా గుంటూరు కారం, సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది చిత్రాల్లో కూడా అందమైన ఇళ్లకు ప్రాధాన్యత ఉంటుంది. వెంకట రమణ - కేరాఫ్ ఆనంద నిలయం అంటే ఆనంద నిలయం అనే ఇంటి నేపథ్యంలో ఈ కథ ఉండబోతోందని తెలుస్తోంది.
వెంకటేష్ నటనకు అనుగుణంగా హ్యూమర్, భావోద్వేగాలు మిళితమై ఉండే కథని త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా ఇంకా ఏదీ ధృవీకరించలేదు.త్రివిక్రమ్‌కు ప్రేక్షకుల హృదయాలను తాకే సింపుల్, అర్థవంతమైన టైటిల్స్ ఎంపిక చేయడంలో మంచి అభిరుచి ఉంది. అదే తరహాలో ‘వెంకట రమణ’ అనే పేరు కూడా ప్రేక్షకులతో వెంటనే కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ 2025 ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని, 2026 సమ్మర్‌లో విడుదల చేయాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. అయితే టైటిల్, నటీనటుల వివరాలు, కధాంశం తదితర అంశాలపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. త్వరలోనే క్లారిటీ రావచ్చని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, వెంకటేష్ మరోవైపు చిరంజీవి–అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
వెంకట రమణ టైటిల్ విషయంపై, అలాగే ప్రాజెక్ట్ లాంచ్ డేట్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.