- Home
- Entertainment
- ఆ గుడిలో జరిగిన సంఘటన వల్లే విజయనిర్మలని కృష్ణ పెళ్లి చేసుకున్నారా.. ఏం జరిగిందో తెలుసా ?
ఆ గుడిలో జరిగిన సంఘటన వల్లే విజయనిర్మలని కృష్ణ పెళ్లి చేసుకున్నారా.. ఏం జరిగిందో తెలుసా ?
సూపర్ స్టార్ కృష్ణ, లెజెండ్రీ నటి దర్శకురాలు విజయనిర్మల గురించి పరిచయం అవసరం లేదు. కలిసి నటించిన వీళ్లిద్దరూ వివాహం చేసుకొని జీవితాన్ని కూడా కలిసి పంచుకున్నారు. అయితే వీళ్ళిద్దరి పెళ్లి వెనుక ఒక ఆసక్తికర సంఘటన ఉందట.

సూపర్ స్టార్ కృష్ణ, లెజెండ్రీ నటి దర్శకురాలు విజయనిర్మల గురించి పరిచయం అవసరం లేదు. కలిసి నటించిన వీళ్లిద్దరూ వివాహం చేసుకొని జీవితాన్ని కూడా కలిసి పంచుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ అంతకుముందే వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకుని ఉన్నారు. అయినప్పటికీ కృష్ణ విజయనిర్మల ప్రేమలో పడి వివాహం చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే వీళ్ళిద్దరి పెళ్లి వెనుక ఒక ఆసక్తికర సంఘటన ఉందట.
సీనియర్ దర్శకుడు హరిశ్చంద్ర రావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల పెళ్లి వెనుక ఉన్న సీక్రెట్ ని బయటపెట్టారు. సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ ప్రారంభించిన కొన్నేళ్ల తర్వాత విజయనిర్మలతో కలిసి సాక్షి అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి బాపు దర్శకుడు. బాపు దర్శకత్వం అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆయన చిత్రాల్లో సాంప్రదాయాలకు పెద్దపీట ఉంటుంది. అదే విధంగా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బలంగా ఉంటాయి.
సాక్షి చిత్రంలో క్లైమాక్స్ సాంగ్ ని మీసాల కృష్ణుడు టెంపుల్ లో చిత్రీకరించారట. 'అమ్మ కడుపు చల్లన' అంటూ సాగే ఈ సాంగ్ ఎంతో భావోద్వేగంగా ఉంటుంది. ఆ సాంగ్ లోనే కృష్ణ విజయనిర్మలకి పెళ్లి జరిగే సన్నివేశం ఉంటుంది. ఆ గుడిలో వీళ్ళిద్దరి పెళ్లి సన్నివేశాన్ని బాపు నిజమైన పెళ్లిలాగే సాంప్రదాయ బద్ధంగా జరిపించి చిత్రీకరించారట. అప్పటికి కృష్ణ, విజయనిర్మల మధ్య ప్రేమ, స్నేహం లేవు. పెళ్లి సీన్ చిత్రీకరణ తర్వాత అదే బట్టలతో కృష్ణ విజయనిర్మల గుడిలో నుంచి బయటకు వచ్చారట.
దీంతో వాళ్ళిద్దరిని చూసి లెజెండ్రీ కమెడియన్ రాజబాబు ఒక జోస్యం చెప్పారు. ఈ గుడిలోకి జంటగా ఎవరు వచ్చినా వాళ్లు తప్పకుండా పెళ్లి చేసుకుంటారు. మీరిద్దరూ జంటగా రావడం మాత్రమే కాదు.. పెళ్లి సీన్ లో నటించారు.. కాబట్టి మీ ఇద్దరికీ రియల్ లైఫ్ లో కూడా పెళ్లి జరగడం ఖాయం అని జోస్యం చెప్పారట. రాజబాబు మాటల్ని కృష్ణ, విజయనిర్మల అంతగా పట్టించుకోలేదు.
ఇది జరిగిన కొంతకాలానికే సూపర్ స్టార్ కృష్ణకి విజయనిర్మలపై ప్రేమ పెరిగింది. దీంతో కృష్ణ స్వయంగా విజయనిర్మలకి పెళ్లి విషయంలో ప్రపోజ్ చేశారు. విజయనిర్మలకు కూడా అప్పటికే కృష్ణ అంటే ఇష్టం ఏర్పడింది. దీంతో వీళ్ళిద్దరూ 1969లో తిరుపతిలో వివాహం చేసుకున్నారు అని హరిశ్చంద్ర రావు తెలిపారు.
కానీ పిల్లల విషయంలో మాత్రం వీళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. కృష్ణకి తన తొలి భార్య ఇందిరా దేవి ద్వారా అప్పటికే పిల్లలు ఉన్నారు. విజయనిర్మలకి కూడా తొలి వివాహంతో నరేష్ జన్మించాడు. దీంతో ఇక తమకు పిల్లలు అవసరం లేదని కృష్ణ, విజయనిర్మల నిర్ణయించుకున్నారట. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఇక విజయనిర్మల హీరోయిన్ గా రాణిస్తూనే 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు.