MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • సందీప్ రెడ్డి వంగా చేతిలో.. దెబ్బలు తిన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా? కారణం తెలిస్తే షాక్ అవుతారు?

సందీప్ రెడ్డి వంగా చేతిలో.. దెబ్బలు తిన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా? కారణం తెలిస్తే షాక్ అవుతారు?

డైరెక్టర్లు యాక్టర్స్ మీద చేయి చేసుకోవడం.. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో ఇలాంటివి సహజమే.  ఈక్రమంలో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి చేతిలో ఓ స్టార్ యాక్టర్ దెబ్బలు తిన్నాడని మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 08 2025, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డైరెక్టర్ల చేతివాటం
Image Credit : Asianet News

డైరెక్టర్ల చేతివాటం

ఫిల్మ్ ఇండస్ట్రీలో చేతివాటం ఉన్న డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. స్టార్ డైక్టర్ల చేతిలో దెబ్బలు తిన్నవారు స్టార్స్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. డైరెక్టర్ తేజా లాంటి వారు షూటింగ్ టైమ్ లో మాట వినని యాక్టర్స్ పై చేయిచేసుకున్నసంఘటనలు ఉన్నాయి. అయితే అలాంటి దర్శకులు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అందులో కొంత మంది మాత్రం సీరియస్ గా కొడితే.. కొంత మంది ఫ్రెండ్లీగా.. వారికి ఉన్న చనువుతో కొడుతుంటారు. ఈక్రమంలో అర్జున్ రెడ్డి , యానిమల్ లాంటి సినిమాలతో సంచలనం సృస్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఇలానే స్టార్ యాక్టర్ ను కొట్టాడట. ఇంతకీ ఎవరా స్టార్ నటుడు.

25
అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం
Image Credit : stockphoto

అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం

అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగ ఎంత పెద్ద దర్శకుడు అయ్యాడో అందరికి తెలిసిందే. దర్శకుడిగా స్టార్ డమ్ మాత్రమే కాదు.. మొదటి సినిమాతో సంచలనంగా కూడా మారాడు సందీప్. అంతే కాదు ఈసినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినా ఏమాత్రం కేర్ చేయలేదు. తాను తీసుకున్న నిర్ణయం సరైనదే అని నిలబడ్డాడు. ఇక ఈసినిమాపై ఎంత మంది ఎన్ని మాట్లాడినా.. ఏమాత్రం వెనకడుకు వేయలేదు సందీప్. అందుకే అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించడంతో పాటు.. విజయ్ దేవరకొండను కూడా స్టార్ గా నిలబెట్టింది.

Related Articles

Related image1
కొడుకు కోసం కోట్ల ఆస్తిని కూడబెట్టిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ? ఎంత సంపాదిచారంటే ?
Related image2
రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ డెస్టినేషన్ వెడ్డింగ్? ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?
35
రెచ్చిపోయిన సందీప్ రెడ్డి వంగా..
Image Credit : youtube print shot/@SitharaEntertainments

రెచ్చిపోయిన సందీప్ రెడ్డి వంగా..

ఈ విజయంతో సందీప్ రెడ్డి వంగా రెచ్చిపోయాడు.. తన మార్క్ సినిమాలతో దుమ్మురేపుతూ.. దూసుకెళ్తున్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. అక్కడ కూడా తన మార్క్ తో స్టార్ గా గుర్తింపు సాధించాడు. అంతే కాదు యానిమల్ సినిమాలతో బాలీవుడ్ లో రచ్చ రచ్చ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో అదిరిపోయే సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ ను ఎలా వాడతాడో.. ఏం చేస్తాడో అన్న టెన్షన్ అభిమానుల్లో ఉంది. అంతే కాదు ప్రభాస్ స్పిరిట్ కోసం కొరియన్ నటుడిని కూడా రంగంలోకి దింపబోతున్నాడు సందీప్ రెడ్డి.

45
కమెడియన్ ను కొట్టిన యానిమల్ డైరెక్టర్ ?
Image Credit : Rahul Ramakrishna Instagram

కమెడియన్ ను కొట్టిన యానిమల్ డైరెక్టర్ ?

ఇక సందీప్ రెడ్డి డైరెక్షన్ వీషయంలో చాలా సీరియస్ గా ఉంటాడు. తను అనకున్న రకంగా షాట్ వచ్చేవరకూ వదిలిపెట్టడు. ఈక్రమంలో అర్జున్ రెడ్డి సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు రాహుల్ రామకృష్ణ ఒక సీన్‌లో దర్శకుడు చెప్పిన విధంగా చేయకుండా.. కొత్తగా ట్రై చేయాలని చూశాడట. ఆ సీన్‌ మరేదో కాదు..ఇంటర్వెల్‌లో హీరోయిన్ పెళ్లి ఆపడానికి హీరో వెళ్లినప్పుడు.. అక్కడ రాహుల్ కు కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. వాటి విషయంలో కాస్త తడబాటుకు గురయ్యాడు. దీంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెనుకనుంచి వచ్చి సరదాగా అతని తలపై ఒక దెబ్బ కొట్టి, “అలా చేయకు, ఈ సీన్‌లోని ఎమోషన్‌ ఇలా ఉండాలి” అని క్లారిటీగా వివరించాడట.

55
ఫ్రెడ్షిప్ లో ఇవన్నీ కామన్..
Image Credit : our own

ఫ్రెడ్షిప్ లో ఇవన్నీ కామన్..

సందీప్ అలా చెప్పిన తరువాత రాహుల్ ఆ సీన్‌ను మరింత భావోద్వేగంగా చేయగలిగాడని తెలుస్తోంది. అయితే ఇక్కడ సందీప్ రెడ్డి వంగా అలా చేయడానికి కారణం వాళ్లిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ మాత్రమే. సందీప్ రెడ్డి వంగా ఈ సంఘటన గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “అది ఎలాంటి కోపంతో కాదు, మేమంతా షూటింగ్‌కు ముందే మంచి స్నేహితులం. ఫన్నీగా, ఫ్రెండ్లీగా జరిగిన సంఘటన మాత్రమే” అని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ఇండస్ట్రీ టాక్ మాత్రమే, ఇక ఇలాంటివి సహజంగానే షూటింగ్ టైమ్ లో జరుగుతుంటాయి. అలాగే సందీప్ రెడ్డి విషయంలో జరిగింది. అయితే నిజంగా ఆయన పని విషయంలో మాత్రం చాలా సీరియస్ గానే ఉంటారని తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సందీప్ రెడ్డి వంగా
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సినిమా చూసి పేరెంట్స్ నన్ను తిట్టుకుంటారు, రైటర్ సూర్య ప్రకాష్ కామెంట్స్ వైరల్..
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: విద్య కన్నీళ్లకు పడిపోయిన మనోజ్, మరో లక్షకు రోహిణీ టోపీ,తప్పు తెలుసుకున్న బాలు
Recommended image3
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ డ్రైవర్ గా కాశీ- షాక్ నుంచి కోలుకోని జ్యో,పారు- దశరథ డౌట్
Related Stories
Recommended image1
కొడుకు కోసం కోట్ల ఆస్తిని కూడబెట్టిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ? ఎంత సంపాదిచారంటే ?
Recommended image2
రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ డెస్టినేషన్ వెడ్డింగ్? ఎప్పుడు.. ఎక్కడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved