MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT Movies: ఓటీటీలో ఇండియా వైడ్‌గా రచ్చ చేస్తోన్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌.. టాప్‌ 10 నెట్‌ ఫ్లిక్స్ మూవీస్‌

OTT Movies: ఓటీటీలో ఇండియా వైడ్‌గా రచ్చ చేస్తోన్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌.. టాప్‌ 10 నెట్‌ ఫ్లిక్స్ మూవీస్‌

ఓటీటీలో పవన్‌ కళ్యాణ్‌ మూవీ ట్రెండ్‌ అవుతుంది. నెట్‌ ఫ్లిక్స్ లో `ధురంధర్‌` మూవీ టాప్‌లో ట్రెండ్‌ అవుతుండగా, ఉస్తాద్‌ భగత్ సింగ్‌ మూవీ టాప్‌ 10లో దుమ్ములేపుతోంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 23 2026, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నెట్‌ ఫ్లిక్స్ టాప్‌ 10 మూవీస్‌
Image Credit : Asianet News

నెట్‌ ఫ్లిక్స్ టాప్‌ 10 మూవీస్‌

ఓటీటీలో సినిమాల కోసం ఆడియెన్స్ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సినిమాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. అందులో ఒకటి నెట్‌ ఫ్లిక్స్. ఇందులో ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ సినిమా ట్రెండ్‌ అవుతుంది. ఇండియా వైడ్‌గా అది టాప్‌ 10లో ఉంది. ఈ మూవీ థియేటర్లో డిజాస్టర్‌గా నిలవగా, ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతోంది. అయితే బాలీవుడ్ మూవీని కొట్టలేకపోయింది. మరి టాప్‌ 10 మూవీస్‌ ఏంటి? అందులో పవన్‌ కళ్యాణ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఏ స్థానంలో ఉందనేది చూస్తే.

25
నెంబర్‌ 1-ధురంధర్‌
Image Credit : X/@RanveerOfficial

నెంబర్‌ 1-ధురంధర్‌

నెట్‌ ఫ్లిక్స్ లో నెంబర్‌ 1గా బాలీవుడ్‌ మూవీ `ధురంధర్‌` ట్రెండ్‌ అవుతుంది. ఇది గత నెల రోజులకుపైగానే మొదటిస్థానంలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. రణ్‌ వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ఈ మూవీకి ఆదిత్య ధర్‌ దర్శకుడు. సారా అర్జున్‌ హీరోయిన్‌గా నటించింది. గతేడాది విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసుని షేక్‌ చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. దీనికి ఇటీవల పార్ట్ 2 `ధురంధర్‌ 2` వచ్చిన విషయం తెలిసిందే. ఇంకా థియేటర్లో రన్‌ అవుతుంది.

Related Articles

Related image1
Renu Desai: అకీరా నందన్‌ సినిమా ఎంట్రీలో ట్విస్ట్, రేణు దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్‌ అభిమానులకు పెద్ద షాక్‌
Related image2
Monalisa Pregnant: పెళ్లైన 10 రోజులకే కుంభమేళా అమ్మాయి గర్భవతి.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మోనాలిసా భర్త
35
రెండో స్థానంలో `యూత్‌`
Image Credit : Asianet News

రెండో స్థానంలో `యూత్‌`

తమిళ మూవీ `యూత్‌` ఇండియా వైడ్‌గా రెండో స్థానంలో ట్రెండ్‌ అవుతుంది. దీన్ని ఆడియెన్స్ తెగ చూస్తున్నారు. గత వారం ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ దుమ్మురేపుతోంది. ఇది థియేటర్లోనూ విశేష ఆదరణ పొందింది. కెన్‌ కరుణాస్‌ టీమ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తనే మెయిన్‌ లీడ్‌, కమింగ్‌ ఏజ్ రొమాంటిక్‌ కామెడీగా రూపొందిందీ చిత్రం.

45
మూడో స్థానంలో బార్డర్‌ 2 మూవీ
Image Credit : netflix

మూడో స్థానంలో బార్డర్‌ 2 మూవీ

సన్నీ డియోల్‌, వరుణ్‌ ధావన్‌, దిల్జిత్‌ దోసాంజే ప్రధాన పాత్రల్లో అనురాగ్‌ సింగ్‌ రూపొందించిన `బార్డర్‌ 2` మూవీ మూడో స్థానంలో ట్రెండ్‌ అవుతుంది. దీన్ని ఆడియెన్స్ తెగ చూస్తున్నారు. జనవరిలో విడుదలైన ఈ మూవీ పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. గత నెలలో ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఇంకా టాప్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. నాల్గో స్థానంలో `వెస్టిల్‌ మానియా వెగాస్‌` షో ట్రెండ్‌ అవుతుంది.

55
ఐదో స్థానంలో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`
Image Credit : Asianet News

ఐదో స్థానంలో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`

ఐదో స్థానంలో తెలుగు మూవీ ఉండటం విశేషం. అదే పవన్‌ కళ్యాణ్‌ నటించిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మార్చి 19న విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. గత వారం ఓటీటీలోకి వచ్చి బుల్లితెర ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. నెట్‌ ఫ్లిక్స్ లో ఐదో స్థానంలో ట్రెండ్‌ అవుతుంది.

టాప్‌ 6-రోస్టర్‌(హిందీ మూవీ)

టాప్‌ 7-మర్దాని 3(హిందీ మూవీ)

టాప్‌ 8-మామ్లా లీగల్‌ హై(హిందీ షో)

టాప్‌ 9-తు యా మెయిన్‌(హిందీ మూవీ)

టాప్‌ 10-ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో)

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఓటీటీ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Monalisa Pregnant: పెళ్లైన 10 రోజులకే కుంభమేళా అమ్మాయి గర్భవతి.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మోనాలిసా భర్త
Recommended image2
Bigg Boss విన్నర్ కి బిగ్ షాక్.. హీరోయిన్ పెళ్లి రద్దు, ఇష్టపడి నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే
Recommended image3
Balakrishna New House: ఇరుగు పొరుగు వారిగా మారబోతున్న చిరు, బాలయ్య, బన్నీ..బాలకృష్ణకి ఇది మూడో లగ్జరీ హౌస్
Related Stories
Recommended image1
Renu Desai: అకీరా నందన్‌ సినిమా ఎంట్రీలో ట్విస్ట్, రేణు దేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్‌ అభిమానులకు పెద్ద షాక్‌
Recommended image2
Monalisa Pregnant: పెళ్లైన 10 రోజులకే కుంభమేళా అమ్మాయి గర్భవతి.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మోనాలిసా భర్త
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved