MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ముద్ద పప్పు, రసం, రొయ్యలు ఇష్టంగా తినే తెలుగు హీరోలు ఎవరో తెలుసా? టాలీవుడ్ స్టార్స్ ఫేవరెట్ ఫుడ్స్ ఇవే?

ముద్ద పప్పు, రసం, రొయ్యలు ఇష్టంగా తినే తెలుగు హీరోలు ఎవరో తెలుసా? టాలీవుడ్ స్టార్స్ ఫేవరెట్ ఫుడ్స్ ఇవే?

టాలీవుడ్ స్టార్ హీరోలు ఇష్టంగా తినే ఫేవరెట్ ఫుడ్స్ ఏంటో తెలుసా? ముద్దపప్పు, రసం అన్నం, రొయ్యల వేపుడు ఇష్టంగా తినే హీరోలు ఎవరు? తెలుగు హీరోలలో భోజన ప్రియుల గురించి మీకు తెలుసా?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 30 2025, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
స్టార్ హీరోలు ఇష్టమైన ఫుడ్స్
Image Credit : instagram

స్టార్ హీరోలు ఇష్టమైన ఫుడ్స్

స్టార్ హీరోలకు, వారి లైఫ్ స్టైల్ కు జనాల్లో ఉండే క్రేజ్ వేరు. అభిమానులు తమకు ఇష్టమైన హీరోలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆసక్తి చూపుతారు. వారి సినిమాలు, డ్రెస్ స్టైల్, లైఫ్‌స్టైల్ మాత్రమే కాకుండా, ఫేవరెట్ ఫుడ్ గురించి కూడా అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. మరి మన టాలీవుడ్ టాప్ హీరోలు ఏ వంటకాలను ఎక్కువగా ఇష్టపడతారో మీకు తెలుసా?

ప్రభాస్ – నాన్ వెజ్ ప్రియుడు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మంచి భోజన ప్రియుడు. షూటింగ్‌కి గ్యాప్ వచ్చినప్పుడల్లా కొత్త వంటకాలను ప్రయత్నించడాన్ని ఇష్టపడతారు. ప్రభాస్ ఏదైనా షూటింగ్ లో ఉంటే.. అక్కడ వారందరికి ఆయన ఇంటి నుంచే భోజనం వస్తుంది. తనతో నటించే హీరోయిన్స్‌కి కూడా స్వయంగా ఫుడ్ ట్రీట్ ఇవ్వడం ప్రభాస్ కు అలవాటు. ఇక ప్రభాస్‌కి అత్యంత ఇష్టమైన వంటకం రొయ్యల పులావ్. మటన్ , చికెన్ వంటకాలను కూడా ప్రభాస్ ఇష్టంగా తింటుంటారు.

28
మహేష్ బాబు – హైదరాబాద్ బిర్యానీ
Image Credit : Asianet News

మహేష్ బాబు – హైదరాబాద్ బిర్యానీ

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సాధారణంగా కఠినమైన డైట్ పాటించే మహేష్... చీటింగ్ డే నాడు మాత్రం తన ఫేవరేట్ డిష్ హైదరాబాద్ బిర్యానీను ఆస్వాదిస్తారని చెప్పారు. ఈ బిర్యానీ మహేష్ బాబు ఇష్టమైన వంటకం అని ఆయన భార్య నమ్రత కూడా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Related Articles

Related image1
నాని సినిమా చూసి, పెద్ద మెసేజ్ పెట్టిన రాజమౌళి, ఏమని సలహా ఇచ్చాడంటే?
Related image2
బ్రహ్మానందం కాకుండా చిరంజీవి కారణంగా స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎవరో తెలుసా?
38
రామ్ చరణ్ – రసం
Image Credit : our own

రామ్ చరణ్ – రసం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అయినప్పటికీ ఆయనకు అత్యంత ఇష్టమైన ఫుడ్ ను మాత్రం అస్సలు వదిలిపెట్టరు. చరణ్ ఎక్కువగా తినే వాటిలో రసం ఒకటి. ఆయన డైటింగ్ టేబుల్ మీదకు రాగానే రసం ఉందా అని చూస్తారట. అందుకే ఇన్ స్టాట్ రసం ఫౌడర్ తయారు చేసి.. ఎక్కడికి వెళ్లిన చరణ్ వెంట అది ఉండేలా ప్లాన్ చేసిందట చరణ్ అమ్మ సురేఖ. ఈ విషయాన్ని ఉపాసన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

జూనియర్ ఎన్టీఆర్ – చేపల పులుసు ఫేవరేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భోజన ప్రియుడే. నాన్ వెజ్ ఫుడ్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. హీరోగా ఫిట్ నెస్ కోసం ఎంత కష్టపడతారో.. అంతే ఇష్టంగా తింటాడు కూడా. మరీ ముఖ్యంగా ఆయనకు చేపల పులుసు అంటేచాలా ఇష్టం. ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయాన్ని చెప్పిన ఆయన, తల్లి వండిన ఫిష్ కర్రీ తనకు ఎంతో ఇష్టంగా తింటానని వెల్లడించారు.

48
అల్లు అర్జున్ – బిర్యానీ లవర్
Image Credit : our own

అల్లు అర్జున్ – బిర్యానీ లవర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫిట్నెస్ మానియాక్ అయినప్పటికీ, బిర్యానీ అంటే మహా ఇష్టం. కెరీర్ ప్రారంభంలోనే ఆయన సిక్స్ ప్యాక్ సాధించడమే కాదు, ఆ తర్వాత కూడా ఫుడ్ కంట్రోల్‌పై దృష్టి పెట్టి.. టోన్డ్ బాడీతో మెరిసిపోతున్నాడు. అయితే చీటింగ్ డే రోజు మాత్రం బిర్యానీకి నో చెప్పడం కష్టం అంటున్నారు. ప్రత్యేక సందర్భాల్లో అల్లు అర్జున్ ఇంట్లో బిర్యానీ తప్పనిసరిగా ఉండాల్సిందేనట.

58
బాలకృష్ణ – రొయ్యల వేపుడు
Image Credit : Youtube/shreyas media

బాలకృష్ణ – రొయ్యల వేపుడు

నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా మంచి ఫుడీ. ఆయనకు చికెన్ బిర్యానీతో పాటు రొయ్యల వేపుడు అంటే ఎంతో ఇష్టం. షూటింగ్ గ్యాప్‌లో ఈ వంటకాలను ప్రత్యేకంగా వండించుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. బాలయ్య కొన్ని సందర్భాల్లో నాన్ వెజ్ ముట్టుకోరు. కొన్ని విషయాల్లో ఆయన తండ్రి ఎన్టీఆర్ మాదిరిగానే నియమాలు పాటిస్తుంటారు.

68
చిరంజీవి – సీ ఫుడ్ ప్రేమికుడు
Image Credit : Asianet News

చిరంజీవి – సీ ఫుడ్ ప్రేమికుడు

మెగాస్టార్ చిరంజీవి సీ ఫుడ్ ప్రియుడు. ఆయనకు చేపలు, రొయ్యలు, పీతలు వంటివి బాగా ఇష్టమట. ఆరోగ్యం కాపాడుకునే క్రమంలో ఆయన వీటిని తక్కువ మసాలాలతో వండించుకుని తింటారు. అంతే కాదు చేపలను తన తల్లి అంజనా దేవి వండితే ఇష్టంగా తింటారట మెగాస్టార్.

78
నాగార్జున – తెలుగు భోజనం
Image Credit : Asianet News

నాగార్జున – తెలుగు భోజనం

కింగ్ నాగార్జున 66 ఏళ్ళ వయస్సులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటారు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు కింగ్. క్రమశిక్షణతో నిండిన ఆయన జీవనశైలి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. అయితే ఆహార విషయానికి వస్తే ఆయనకు హైదరాబాద్ బిర్యానీ అంటే మహాఇష్టం. అంతే కాదు రోజు తెలుగు భోజనం చేయడం చాలా ఇష్టమట. ఆయిల్ కాస్త తక్కువగా వేసిన కూరలు, పప్పు, అన్నం, రసం, ఇష్టంగా తింటారట. కింగ్. ఇక రోజు పడుకునేముందు ఒక స్వీట్ తినడం కింగ్ కు ఎప్పటి నుంచో అలవాటు. ఈ విషయం నాగార్జున పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక నాగచైతన్య కూడా పప్పు, రసం, ఆవకాయను ఎంతో ఇష్టంగా తింటారట. మితంగా తినడం, రెగ్యూలర్ వర్కౌట్స్ వల్ల ఫిట్ నెస్ కోల్పోకుండ కాపాడుకుంటున్నట్టు చైతు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

88
వెంకటేష్ – నాటు కోడి పులావ్
Image Credit : instagram

వెంకటేష్ – నాటు కోడి పులావ్

విక్టరీ వెంకటేష్ ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూనే.. తనకు ఇష్టమైన ఫుడ్ ను లాగించేస్తారట. ముఖ్యంగా వెంకటేష్ కు చికెన్ అంటే చాలా ఇష్టం. నాటు కోడి పులావ్ అంటే చాలా ఇష్టం. తరచూ ఈ నాటు కోడిని వండించుకుని తింటారట.

రానా దగ్గుబాటి కూడా..

యంగ్ హీరో రానా దగ్గుబాటికి కూడా నాటు కోడి కూర అంటే విపరీతమైన ఇష్టం. డైట్‌లో మార్పులు ఉన్నా కూడా నాటుకోడి మాత్రం వదిలిపెట్టరట రానా. నెలలో రెండు మూడు సార్లు నాటు కోడి తన మెనూలు ఉండేలా చూసుకుంటారట రానా.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
నందమూరి బాలకృష్ణ
దగ్గుబాటి వెంకటేష్
అల్లు అర్జున్
నాగ చైతన్య
ప్రభాస్
మహేష్ బాబు ఘట్టమనేని
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 12: రైస్ మిల్లు ఓనర్‌గా వల్లి, నర్మద సాగర్‌ను ఛీ కొట్టిన రామరాజు దంపతులు
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: ఫంక్షన్ లో మటన్ ముక్కల కోసం గొడవ, పోయిన బాలు పరువు..రోహిణీ మాజీ భర్త ఎంట్రీ
Recommended image3
Sequel Movies: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7 ఇండియన్ సీక్వెల్స్.. 'ధురంధర్ 2' రికార్డులు బద్దలు కొడుతుందా?
Related Stories
Recommended image1
నాని సినిమా చూసి, పెద్ద మెసేజ్ పెట్టిన రాజమౌళి, ఏమని సలహా ఇచ్చాడంటే?
Recommended image2
బ్రహ్మానందం కాకుండా చిరంజీవి కారణంగా స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved