- Home
- Entertainment
- ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు లలో అసలైన ధనికులు ఎవరు ? ఆయనొక్కరే రియల్ స్టార్
ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు లలో అసలైన ధనికులు ఎవరు ? ఆయనొక్కరే రియల్ స్టార్
తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన నటుల్లో ముందుగా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణం రాజు, శోభన్ బాబు, కృష్ణ ఘట్టమనేని పేర్లు చెప్పుకోవాలి. సినిమాల్లోకి రాకముందు వీరి ఆర్థిక పరిస్థితో ఏంటో తెలుసా ?

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లలాంటివారు అని చెబుతుంటారు. ఆయా తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి వారు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఈ సీనియర్ నటులు అంతా ధనికులుగా మారారు. డబ్బు, కీర్తి అన్నీ సంపాదించుకున్నారు. కానీ సినిమాల్లోకి రాకముందు ఈ ఐదుగురు దిగ్గజాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఎన్టీఆర్
నందమూరి తారకరామారావు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. వీరిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఎన్టీఆర్ చదువుకుని సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేశారు. సినిమాలు, నాటకాలపై ఆసక్తితో ఉద్యోగం మానేసి వచ్చారు. సినిమాల్లోకి రాకముందు వీరి ఫ్యామిలీ తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కొనలేదు. అలాగని ధనికులు కూడా కాదు.
అక్కినేని నాగేశ్వర రావు
నాగేశ్వర రావు గారిది పేద కుటుంబం అనే చెప్పాలి. వీరు మొత్తం ఐదుగురు అన్నదమ్ములు. ఏఎన్నార్ చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. తల్లే ఆలనా పాలనా చూసుకుంది. ఆర్థిక పరిస్థితి కారణంగా 4వ తరగతిలోనే చదువు మానేసి నాటకాలలో ఆడవేషాలు వేసేవారు. అదే ఏఎన్నార్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయింది. పేద కుటుంబం నుంచి వచ్చిన ఏఎన్నార్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత వేలకోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు.
కృష్ణ ఘట్టమనేని
సూపర్ స్టార్ కృష్ణ ఎగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. వీరిది కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబం. కృష్ణ ఫ్యామిలీ పూర్తిగా ధనికులు కాదు. కానీ ఎప్పుడూ ఆర్థిక సమస్యలు లేవు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కృష్ణ తన ధైర్య సాహసాలతో తెలుగు చిత్ర పరిశ్రమ ముఖ చిత్రాన్ని మార్చేశారు.
శోభన్ బాబు
శోభన్ బాబు కూడా మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చారు. వీరిది కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబమే. సినిమాల్లోకి వచ్చిన తర్వాత చాలా కాలం పాటు శోభన్ బాబు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టార్ కావడానికి టైం పట్టింది. కానీ ఆ తర్వాత తన సంపాదనని భూములపై పెట్టి అప్పట్లోనే వందల కోట్లు సంపాదించారు.
కృష్ణం రాజు
సినిమాల్లోకి రాకముందే కృష్ణంరాజు ఫ్యామిలీ ధనికులు. అప్పట్లోనే వీరికి వందల ఎకరాలు భూములు, ఆస్తులు ఉండేవి. ధనిక కుటుంబం అయినప్పటికీ ఖర్చు కూడా ఎక్కువగా ఉండేది అని కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత రెబల్ స్టార్ గా గుర్తింపు పొందారు.

