MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రైవేట్ జెట్ లో ప్రయాణించిన దళపతి విజయ్, ఏకంగా 8 కోట్లు ఖర్చు.. దేనికోసమో తెలుసా

ప్రైవేట్ జెట్ లో ప్రయాణించిన దళపతి విజయ్, ఏకంగా 8 కోట్లు ఖర్చు.. దేనికోసమో తెలుసా

దళపతి విజయ్ తమిళనాడులోని కొడైకెనాల్ కు ఒక ప్రైవేట్ జెట్ లో ప్రయాణించారు. ఈ ప్రయాణం ఖర్చు అక్షరాలా ఎనిమిది కోట్లు. అంత ఖర్చు చేసి విజయ్ కొడైకెనాల్ కు ఎందుకు వెళ్లారో ఈ కథనంలో తెలుసుకోండి.  

2 Min read
Author : Tirumala Dornala
| Updated : May 03 2025, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Thalapathy Vijay

Thalapathy Vijay

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన చివరి సినిమా ‘జన నాయకన్’ తదుపరి షెడ్యూల్ కోసం తమిళనాడులోని కొడైకెనాల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రైవేట్ జెట్ ద్వారా ప్రయాణించారు. ఈ జెట్ ఖర్చు సుమారు రూ.8 కోట్లు అని సమాచారం. మదురై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన విజయ్‌ను అభిమానులు భారీగా కలుసుకున్నారు. సింపుల్ వైట్ కుర్తా, ఖాదీ పైజామాలో కనిపించిన విజయ్ అందరి మనసులు గెలుచుకున్నారు. విజయ్ కోసం భారీగా అభిమానులు రావడంతో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

25

విజయ్ ప్రస్తుతం నటిస్తున్న ‘జన నాయకన్’ సినిమా తరువాత సినిమాలకు గుడ్‌బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద అభిమానుల్లోనే కాదు, పరిశ్రమలో కూడా భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను హి. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి.

ఈ సినిమా కోసం ర్యాపర్ హనుమన్‌కైండ్‌తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఓ హై వోల్టేజ్ ర్యాప్ ట్రాక్ రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే, విజయ్ సినిమాల్లో ఇది ఒక ప్రత్యేకమైన కాంబినేషన్‌గా నిలుస్తుంది.

Related Articles

Related image1
ఇక నీ శవమే బయటకి వస్తుంది అన్నారు, ఆయన లేకుంటే నా పరిస్థితి.. సుమన్ సంచలన వ్యాఖ్యలు
Related image2
బాహుబలి, పుష్ప ఎందుకు హిట్ అయ్యాయో చెప్పిన నాగార్జున.. క్రేజీ కామెంట్స్ వైరల్
35
Vijay Viral Video

Vijay Viral Video

ఓటీటీ హక్కుల విషయంలో కూడా ఈ సినిమాకు భారీ డీల్ కుదిరినట్లు సమాచారం. OTTplay ప్రకారం, అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను రూ.121 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది తమిళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటిగా నిలవనుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
 

45

ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. విజయ్‌తో ‘మాస్టర్’ సినిమా కంటే ముందు ఓ ప్రాజెక్టుపై పని చేశానని, అయితే అది ఆగిపోయిందని వెల్లడించారు. ఆయన "విజయ్‌కి కొన్ని స్క్రిప్టులు చెప్పాను కానీ అవి క్లిక్ కాలేదు. నేను ‘తలపతి 69’కి కూడా చెప్పాను కానీ కుదరలేదు. తర్వాత హి.వినోద్ ఇప్పటికే ఫిక్స్అయ్యాను అని విజయ్ చెప్పినట్లు కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు. 
 

55

ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా విజయ్‌కు సినిమా కెరీర్‌లో చివరి చిత్రం కావడంతో, ఆయన రాజకీయ ప్రస్థానానికి ఇది పునాది కానుందని విశ్లేషణ సాగుతోంది. మూవీ యూనిట్ కూడా ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్స్‌ను రాబోయే వారాల్లో షేర్ చేయనున్నట్లు ప్రకటించింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
Recommended image2
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Recommended image3
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Related Stories
Recommended image1
ఇక నీ శవమే బయటకి వస్తుంది అన్నారు, ఆయన లేకుంటే నా పరిస్థితి.. సుమన్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
బాహుబలి, పుష్ప ఎందుకు హిట్ అయ్యాయో చెప్పిన నాగార్జున.. క్రేజీ కామెంట్స్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved