MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 160 నుంచి టాప్ 10 లో తేజ సజ్జా, స్టార్ హీరోలను పక్కకు నెట్టిన యంగ్ హీరో

160 నుంచి టాప్ 10 లో తేజ సజ్జా, స్టార్ హీరోలను పక్కకు నెట్టిన యంగ్ హీరో

కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా. స్టార్ హీరోలను కూడా పక్కకు నెట్టి.. IMDb ర్యాంక్స్ లో టాప్ 10 లోకి వచ్చేశాడు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 19 2025, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దూసుకుపోతున్న తేజ సజ్జా
Image Credit : instagram

దూసుకుపోతున్న తేజ సజ్జా

పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తేజ, హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తరువాత ఒక్కో అడుగు చాలా జాగ్రత్తగా వేస్తూ వెళ్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ స్టార్ట్ చేసి హీరోలు అయిన వారిలో చాలామంది ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. కాని తేజ సర్జా మాత్రం ప్రతీ అడుగు జాగ్రత్తగా వేస్తూ.. మంచి మంచి సినిమాలతో దూసుకుపోతున్నాడు. జాంబిరెడ్డి, బేబి, హనుమాన్, ఇలా తేజ మూవీస్ అన్నీ సూపర్ హిట్ అవ్వడంతో తేజకు క్రేజ్ భారీగా పెరిగిపోయింది.

25
100 కోట్ల మిరాయ్
Image Credit : instagram

100 కోట్ల మిరాయ్

టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా (Teja Sajja) తాజా చిత్రం మిరాయ్ (Mirai) అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు, ఆయనకు వ్యక్తిగతంగా అరుదైన గుర్తింపును తీసుకొచ్చింది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పటికే 100 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేయగా, IMDb వారానికోసారి విడుదల చేసే మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్టులో తేజ సజ్జా ఇండియా వైడ్‌గా 9వ స్థానాన్ని సాధించాడు.

Related Articles

Related image1
రష్మిక మందన్న ఫిట్‌నెస్ రహస్యం ఇదేనా? ఒక రోజులో ఆమె ఏం తింటుందో తెలుసా?
Related image2
150 కోట్ల బిజినెస్ చేసిన చంద్రబోస్ పాట ఏదో తెలుసా? ఆ పాటలో ఏముంది?
35
టాప్ 10లోకి తేజ
Image Credit : X

టాప్ 10లోకి తేజ

గత వారం ఇదే లిస్టులో 160వ స్థానంలో ఉన్న తేజ, ఈ వారం ఏకంగా 151 స్థానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరడం విశేషం. ఆయన నటించిన మిరాయ్ మూవీ విడుదలైన వారంలోనే ఈ స్థాయిలో ర్యాంక్ మెరుగవడం ఈ విజయానికి నిదర్శనం. కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, కథనం, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

45
మొదటి స్థానం ఎవరిది
Image Credit : Youtube/People Media Factory

మొదటి స్థానం ఎవరిది

ఇంకా ఈ IMDb లిస్టులో మొదటి స్థానంలో బాలీవుడ్ యంగ్ హీరో అహాన్ పాండే (Ahaan Panday) నిలిచాడు. అతను నటించిన చిత్రం సయారా ఇటీవల భారీ హిట్ కావడంతో టాప్ స్పాట్ దక్కించుకున్నాడు. మూడో స్థానంలో అనీత్ పడ్డ ఉన్నారు, ఇతనూ అదే సినిమాతో పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ సీనియర్ స్టార్ అక్షయ్ కుమార్, తన తాజా చిత్రం జాలి ఎల్.ఎల్.బి 3 ప్రమోషన్స్ నేపథ్యంలో 6వ స్థానాన్ని పొందాడు.

55
తేజ సజ్జా నెక్ట్స్ ప్లాన్
Image Credit : Instagram

తేజ సజ్జా నెక్ట్స్ ప్లాన్

తేజ సజ్జా ప్రస్తుతం మిరాయ్ విజయాన్ని ఆస్వాదిస్తూ, నెక్ట్స్ జెక్ట్‌కు సిద్ధమవుతున్నాడు. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన జాంబీ రెడ్డి సీక్వెల్ సినిమాను తేజ్ చేయబోతున్నట్టు సమాచారం. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకుంది. దాంతో రెండో పార్ట్ ను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సీక్వెల్‌ను కూడా ప్రశాంత్ వర్మనే తెరకెక్కిస్తారా లేదా అనేది త్వరలో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్‌లో రూపొందించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. తేజ సజ్జా, చిన్న వయసులో నటుడిగా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు సొంతగా మార్కెట్‌ను క్రియేట్ చేసుకోవడంలో IMDb ర్యాంకింగ్ ఓ మైలురాయిగా నిలిచింది. ఈ ఏడాది ఆయనకు మోస్ట్ డెఫినింగ్ మోమెంట్ ఇదే అనటం లో ఎటువంటి సందేహం లేదు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Thrice Married Actresses: మూడు పెళ్లిళ్లు చేసుకున్న సౌత్ హీరోయిన్లు వీరే
Recommended image2
మహేష్ బాబు వారణాసి తో పాటు 2026-27లో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే 3 భారీ సినిమాలు ?
Recommended image3
సినిమా చూసి పేరెంట్స్ నన్ను తిట్టుకుంటారు, రైటర్ సూర్య ప్రకాష్ కామెంట్స్ వైరల్..
Related Stories
Recommended image1
రష్మిక మందన్న ఫిట్‌నెస్ రహస్యం ఇదేనా? ఒక రోజులో ఆమె ఏం తింటుందో తెలుసా?
Recommended image2
150 కోట్ల బిజినెస్ చేసిన చంద్రబోస్ పాట ఏదో తెలుసా? ఆ పాటలో ఏముంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved