MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Tanikella Bharani: 'శివ' మూవీలో అసలు కథ ఉందా అని అడిగా.? అప్పుడు RGV చెప్పింది ఇదే

Tanikella Bharani: 'శివ' మూవీలో అసలు కథ ఉందా అని అడిగా.? అప్పుడు RGV చెప్పింది ఇదే

Tanikella Bharani: 'శివ' సినిమా సమయంలో తనికెళ్ళ భరణి, రామ్ గోపాల్ వర్మల మధ్య జరిగిన ఈ ఆసక్తికర విషయాలు ఆ సినిమా మేకింగ్‌లో ఉన్న తీవ్రతను తెలియజేస్తాయి. సినిమా విజయంపై కేవలం నాగార్జున మాత్రమే..

2 Min read
Author : Pavithra D
Published : Apr 22 2026, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
'శివ' సినిమా వెనుక ఎన్నో కథలు
Image Credit : Pinterest

'శివ' సినిమా వెనుక ఎన్నో కథలు

టాలీవుడ్ ఇండస్ట్రీను మలుపు తిప్పిన 'శివ' సినిమా వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ఈ సినిమాకు రచయితగా పనిచేసిన ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తనకున్న అనుభవాలను, ఆ సినిమా స్క్రిప్ట్ విషయంలో జరిగిన గొడవలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

25
జోకులు వద్దు.. వర్మ కండిషన్!
Image Credit : Facebook/ Tanikella Bharani

జోకులు వద్దు.. వర్మ కండిషన్!

'శివ' సినిమా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది కాబట్టి, భరణి మొదట స్క్రిప్ట్‌లో చాలా జోకులు, సెటైర్లు రాశారట. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణవంశీ ఆ జోకులను విని విపరీతంగా ఎంజాయ్ చేసేవారు. కానీ వర్మ ఆ స్క్రిప్ట్ చదివి, "కాలేజీలో జోకులు ఉంటాయని నాకు తెలుసు, కానీ నా సినిమాలో ఒక్క జోక్ కూడా ఉండటానికి వీల్లేదు" అని సీరియస్‌గా చెప్పారట. అలా సినిమా మొత్తం సీరియస్‌గా సాగాలని వర్మ కచ్చితమైన నిర్ణయంతో ఉండేవారు.

Related Articles

Related image1
RGV: ఆ పాట తీసేటప్పుడు ఆర్జీవీ తెలివిని చూసి ఆశ్చర్యపోయా.. ఇంత అందంగా తీస్తాడనుకోలే
Related image2
RGV: ఈ ఫొటోలో ఉంది ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.? ఏమైంది ‘స‌ర్కార్’ ఇలా అయ్యావ్.?
35
తొలగింపు, కారణం
Image Credit : social media

తొలగింపు, కారణం

సినిమా ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు భరణిని టీమ్ నుంచి తొలగించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం స్క్రిప్ట్‌ని స్వయంగా వర్మకు ఇవ్వకుండా ఒక థర్డ్ పర్సన్ ద్వారా పంపడం. "స్క్రిప్ట్ అనేది దైవం లాంటిది, అలాంటి దానిని ఎవరో తెలియని వ్యక్తి ద్వారా పంపడం నాకు నచ్చలేదు" అని వర్మ మొహం మీదే చెప్పారట. మరో కారణం ఏమిటంటే, ఈ సినిమా కథను భరణి వేరే నిర్మాణ సంస్థకు చెప్పారని వర్మ అనుమానించారు.

45
కథ ఉందా సార్? భరణి ప్రశ్న
Image Credit : Asianet News

కథ ఉందా సార్? భరణి ప్రశ్న

వర్మతో వాదన జరుగుతున్న సమయంలో భరణి ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. "అసలు మన సినిమాలో కథ ఉందా సార్? ఇవన్నీ కొన్ని ఇన్సిడెంట్లు, మంచి స్క్రీన్ ప్లే మాత్రమే కదా" అని అడిగారట. ఆ మాటకు వర్మ ఏమీ అనకుండా, భరణి ఇంటి గోడపై ఉన్న శ్రీదేవి ఫోటోను చూసి, "ఈవిడతో నేను సినిమాలు తీయాలి" అంటూ టాపిక్ మార్చేశారట. ఆ తర్వాత వర్మ తన తర్వాతి సినిమా షూటింగ్ కోసం భరణిని రమ్మని పిలవడంతో ఆ వివాదం ముగిసింది.

55
కేవలం నాగార్జున మాత్రమే..
Image Credit : Asianet News

కేవలం నాగార్జున మాత్రమే..

'శివ' సినిమా సమయంలో తనికెళ్ళ భరణి, రామ్ గోపాల్ వర్మల మధ్య జరిగిన ఈ ఆసక్తికర విషయాలు ఆ సినిమా మేకింగ్‌లో ఉన్న తీవ్రతను తెలియజేస్తాయి. సినిమా విజయంపై కేవలం నాగార్జున మాత్రమే నమ్మకంగా ఉండేవారని, మిగతా వారందరికీ కొన్ని అనుమానాలు ఉండేవని భరణి గుర్తు చేసుకున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
కొత్త పెళ్లికూతురు, రాత్రంతా ఐటెం సాంగ్ చేసి ఉదయాన్నే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. 20 ఏళ్ళ కుర్రాడితో
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కొనసాగిన కిడ్నాప్ డ్రామా- జ్యోపై వైరా డౌట్- దాసును నిలదీసిన పారు
Recommended image3
Tripuraneni Chittibabu: తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు మృతి, సౌందర్య జాతకం మారింది ఆయన వల్లే
Related Stories
Recommended image1
RGV: ఆ పాట తీసేటప్పుడు ఆర్జీవీ తెలివిని చూసి ఆశ్చర్యపోయా.. ఇంత అందంగా తీస్తాడనుకోలే
Recommended image2
RGV: ఈ ఫొటోలో ఉంది ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.? ఏమైంది ‘స‌ర్కార్’ ఇలా అయ్యావ్.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved