MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుమ కనకాల రిటైర్మెంట్ ఎప్పుడో తెలుసా? క్లారిటీతో పాటు కౌంటర్ కూడా ఇచ్చిన స్టార్ యాంకర్

సుమ కనకాల రిటైర్మెంట్ ఎప్పుడో తెలుసా? క్లారిటీతో పాటు కౌంటర్ కూడా ఇచ్చిన స్టార్ యాంకర్

Suma Kanakala Retirement : దాదాపు 30 ఏళ్లుగా తెలుగు ఆడియన్స్ ను తన యాంకరింగ్ తో అలరిస్తుంది సుమ కనకాల. యాంకరింగ్ రంగంలో ఇంతకాల నిలబడ్డ స్టార్ మరొకరు లేరు. మరి సుమ కనకాల రిటైర్మెంట్ ఎప్పుడు? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 19 2025, 11:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బుల్లితెర సంచలనం..
Image Credit : Asianet News

బుల్లితెర సంచలనం..

టెలివిజన్ ప్రపంచంలో.. యాంకర్ సుమ ఒక సంచలనం, దాదాపు 30 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమ... 20 ఏళ్లుగా యాంకరింగ్ రంగంలో దూసుకుపోతోంది. 50 ఏళ్లు దాటినా.. అదే ఉత్సాహంతో, అదే జోష్ తో కొనసాగుతోంది సుమ. మలయాళ అమ్మాయి అయినా.. తెలుగువారి ఇళ్లలో ఓ కుటుంబ సభ్యురాలిలా మారిపోయిన సుమ, తన స్పస్టమైన తెలుుగు, మాట తీరు, కామెడీ టైమింగ్, ఎనర్జీతో ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడూ అలరిస్తూ వస్తోంది. ఇన్నేళ్ల నుంచి యాంకరింగ్ చేస్తూనే ఉన్నా, ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదు. మునుపటికంటే ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తోంది సుమ కనకాల.

25
సుమ రిటైర్మెంట్ గురించి గుసగుసలు
Image Credit : youtube/sreyas media

సుమ రిటైర్మెంట్ గురించి గుసగుసలు

ఇక రీసెంట్ గా సుమ గురించి సోషల్ మీడియాలో ఓ చర్చ బాగా నడుస్తోంది. సుమ వయసు పెరుగుతోంది, ఆమె తరువాత అంతటి స్థాయికి ఎవరు వస్తారన్న చర్చ జరుగుతోంది. అంతే కాదు కొంత మంది యాంకర్స్ ల్ కూడా సుమకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. మాకు ఛాన్స్ లు రావడంలేదు అన్ని అనుకుంటన్నట్టు టాక్ నడుస్తోంది. సాధారణంగా యాంకర్స్ కెరీర్ టైమ్ చాలా తక్కువ గా ఉంటుంది. ఎక్కువ కాలం ఒకరినే కంటీన్యూ చేయాలని అనుకోరు. కొత్త ముఖాలు వస్తే.. పాత యాంకర్స్ కు అవకాశాలు తగ్గిపోతాయి. కానీ సుమ విషయంలో మత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఆమె వయసు పెరిగే గొద్ది.. ఇంకాస్త జోరు పెంచుతోంది.

Related Articles

Related image1
వారణాసి వరుస వివాదాలు, రాజమౌళి పై కేసు నమోదు, ఫిల్మ్ ఛాంబర్ లో జక్కన్న పై కంప్లైయింట్
Related image2
100 కోట్ల ఇల్లు, సొంత విమానం, నయనతార ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?
35
స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సుమ కనకాల
Image Credit : suma insta

స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సుమ కనకాల

బయట వినిపిస్తున్న రిటైర్మెంట్ వార్తలపై రీసెంట్ గా స్పందించింది సుమ. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు స్పష్టమైన సమాధానం కూడా ఇచ్చింది. సుమ ప్రత్యేక పాత్రలో నటించిన ప్రేమంటే సినిమా నవంబర్ 21న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన సుమ, రిటైర్మెంట్ గురించి వస్తున్న ప్రశ్నలకు చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. “మా అమ్మకు 84 ఏళ్లు. కానీ చాలా యంగ్‌గా ఉంటారు. ఆమెకే రిటైర్మెంట్ లేదు. నేను ఎందుకు రిటైర్ అవ్వాలి?” అని రివర్స్ ప్రశ్నించింది సుమ.

45
రిటైర్మెంట్ మా జీన్స్ లోనే లేదు..
Image Credit : suma insta

రిటైర్మెంట్ మా జీన్స్ లోనే లేదు..

సుమ మాట్లాడుతూ, “చాలా మంది నన్ను అడుగుతున్నారు మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు అని. మా ఫ్యామిలీలో జెనెటిక్స్ బలంగా ఉన్నాయి. మా అమ్మమ్మ 101 ఏళ్లు జీవించారు. మా పెద్ద మామయ్యకు 99 ఏళ్లు, ఇప్పటికీ అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. ఆయన గిన్నిస్ రికార్డ్ హోల్డర్. మరి రిటైర్మెంట్ గురించి నన్నెందుకు అడుగుతున్నారు? నేను ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేసింది సుమ కనకాల.

55
సమ ఎమోషనల్ కామెంట్స్
Image Credit : our own

సమ ఎమోషనల్ కామెంట్స్

''ఏకార్యక్రమం చేసినా.. స్టేజ్‌పైకి వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకుల నుంచి వినిపించే మాట సుమ అక్క. వారు అలా అంటూ.. కేరింతలు కొడుతుంటే.. అవి నాకు శక్తినిస్తాయి, మీ అరుపుల్లో, ప్రేమలో ఇంత ఎనర్జీ ఉంది. అలా ఉన్నప్పుడు నేను ఎలా రిటైర్ అవుతాను?” అంటూ సుమ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.సుమ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక సుమ రిటైర్మెంట్‌ గురించి ఆలోచించేవారికి ఇది అతిపెద్ద కౌంటర్ అని చెప్పవచ్చు. ఆమె మాటల ప్రకారం, ఇంకా ఎన్నో సంవత్సరాలు యాంకరింగ్ ప్రపంచంలో కొనసాగనుందని స్పష్టమైంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Thrice Married Actresses: మూడు పెళ్లిళ్లు చేసుకున్న సౌత్ హీరోయిన్లు వీరే
Recommended image2
మహేష్ బాబు వారణాసి తో పాటు 2026-27లో బాక్సాఫీస్‌ను షేక్ చేయబోయే 3 భారీ సినిమాలు ?
Recommended image3
సినిమా చూసి పేరెంట్స్ నన్ను తిట్టుకుంటారు, రైటర్ సూర్య ప్రకాష్ కామెంట్స్ వైరల్..
Related Stories
Recommended image1
వారణాసి వరుస వివాదాలు, రాజమౌళి పై కేసు నమోదు, ఫిల్మ్ ఛాంబర్ లో జక్కన్న పై కంప్లైయింట్
Recommended image2
100 కోట్ల ఇల్లు, సొంత విమానం, నయనతార ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved