MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `కలిసుందాం రా` సినిమాని మిస్‌ చేసుకున్న స్టార్‌ హీరో ఎవరో తెలుసా? `సమరసింహారెడ్డి` రికార్డులు బ్రేక్‌

`కలిసుందాం రా` సినిమాని మిస్‌ చేసుకున్న స్టార్‌ హీరో ఎవరో తెలుసా? `సమరసింహారెడ్డి` రికార్డులు బ్రేక్‌

వెంకటేష్‌ నటించిన ఇండస్ట్రీ హిట్‌ మూవీస్‌లో `కలిసుందాం రా` ఒకటి. ఈ మూవీ బాలయ్య `సమరసింహారెడ్డి` రికార్డులను బ్రేక్‌ చేసింది. మరి ఈ చిత్రానికి మొదట అనుకున్న హీరో ఎవరో చూద్దాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 23 2025, 09:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`కలిసుందాం రా`తో ఇండస్ట్రీ హిట్‌ అందుకున్న వెంకటేష్‌
Image Credit : stockPhoto

`కలిసుందాం రా`తో ఇండస్ట్రీ హిట్‌ అందుకున్న వెంకటేష్‌

వెంకటేష్‌ హీరోగా వచ్చిన `కలిసుందాం రా` మూవీ టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇందులో వెంకటేష్‌కి జోడీగా సిమ్రాన్‌ నటించింది. తమిళ దర్శకుడు ఉదయ్ శంకర్ దర్వకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ ఆ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ గా నిలవడమే కాదు, ఇండస్ట్రీ హిట్‌ జాబితాలో చేరిపోయింది. అయితే ఈ మూవీకి చేయాల్సిన మొదటి హీరో వెంకటేష్‌ కాదు. మరో సూపర్‌ స్టార్‌ వదులుకుంటే వెంకీ వద్దకు వచ్చింది. 

25
`కలిసుందాం రా`ని మిస్‌ చేసుకున్న నాగార్జున
Image Credit : Youtube print shot/Zee Telugu

`కలిసుందాం రా`ని మిస్‌ చేసుకున్న నాగార్జున

తమిళ దర్శకుడు ఉదయ్‌ శంకర్‌ `కలిసుందాం రా` అనే ఫ్యామిలీ కథని రెడీ చేసుకుని వచ్చి మొదట నాగార్జునని కలిశారు. అయితే అప్పటికే నాగార్జున వరుసగా ఫ్యామిలీ సినిమాలు చేశారు. `చంద్రలేఖ`, `సీతారామరాజు` వంటి సినిమాలు ఆ కోవకు చెందినవే. మళ్లీ ఫ్యామిలీ సినిమా అంటే బోర్‌ కొడుతుందని, ఆడియెన్స్ చూడరని భావించారు నాగ్‌. దీంతో ఈ కథకి నో చెప్పారు. అలా నాగార్జున `కలిసుందాం రా` సినిమాని వదులుకున్నారు. అయితే ఇది చాలా చిన్న కారణం. నిజానికి నాగ్‌ సినిమా చేసి ఉంటే ఆయన ఇండస్ట్రీ హిట్‌ని అందుకునేవారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

Related Articles

Related image1
రీతూ చౌదరీ ప్లాన్ అంతా రివర్స్, మరో చీకటి కోణం బయటపెట్టిన హీరో ధర్మ మహేష్‌ భార్య.. కోలుకోలేని దెబ్బే
Related image2
కిర్రాక్‌ ఆర్పీ మోసం చేశాడు, ఆయన వల్లే జబర్దస్త్ వదిలేశా.. ప్రియుడు హ్యాండిచ్చాడు.. జబర్దస్త్ కమెడియన్‌ ఆవేదన
35
నాగ్‌ నో చెబితే వెంకీ ఓకే చెప్పాడు
Image Credit : X/@chay_uday_akhil

నాగ్‌ నో చెబితే వెంకీ ఓకే చెప్పాడు

నాగార్జున నో చెప్పడంతో ఈ కథతో వెళ్లి వెంకటేష్‌ని కలిశాడు దర్శకుడు ఉదయ్‌ శంకర్‌. అప్పటికే వరుసగా ఫ్యామిలీ చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు వెంకీ. వరుసగా విజయాలు అందుకుంటున్నారు. పైగా కెరీర్‌ పరంగానూ పీక్‌లో ఉన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ లో వెంకటేష్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ స్టోరీకి వెంకీనే న్యాయం చేస్తాడని భావించారు ఉదయ్‌ శంకర్‌. లక్కీగా వెంకీకి, సురేష్‌ బాబుకి నచ్చింది. దీంతో తమ సురేష్‌ ప్రొడక్షన్‌లోనే ఈ సినిమా చేశారు.

45
ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన `కలిసుందాం రా`
Image Credit : stockPhoto

ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన `కలిసుందాం రా`

2000లో జనవరి 14న విడుదలైంది. ఫ్యామిలీ కంటెంట్‌ ఉన్న సినిమా కావడం, పైగా సంక్రాంతి పండగ కావడంతో ఆడియెన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఈ ఏడాది `సంక్రాంతికి వస్తున్నాం` కి ఎలా అయితే ఆడియెన్స్ క్యూ కట్టారో. అప్పుడు కూడా అదే స్థాయిలో ఆడియెన్స్ బండ్లు కట్టుకుని వెళ్లి సినిమా చూశారు. దీంతో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈ చిత్రం బ్రేక్‌ చేసింది. సంచలన విజయం సాధించింది. ఏకంగా సుమారు రూ. 27కోట్ల కలెక్షన్లని రాబట్టింది.

55
`సమరసింహారెడ్డి` రికార్డులు బ్రేక్‌
Image Credit : our own

`సమరసింహారెడ్డి` రికార్డులు బ్రేక్‌

అంతకు ముందు ఏడాది బాలకృష్ణ నటించిన `సమరసింహారెడ్డి` మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది వెంకీ `కలిసుందాం రా`. ఫ్యామిలీ కంటెంట్‌తో వస్తే ఏ రేంజ్‌లో సక్సెస్‌ అవుతుందో నిరూపించింది. ఈ సినిమా 76సెంటర్లలో వంద రోజులు, 17 సెంటర్లలో 175 రోజులు, మూడు సెంటర్లలో రెండు వందల రోజులు ప్రదర్శించడం విశేషం. అంతేకాదు ఆ ఏడాదికిగానూ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది. నాలుగు నంది అవార్డులను దక్కించుకుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున
దగ్గుబాటి వెంకటేష్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
Recommended image2
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Recommended image3
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Related Stories
Recommended image1
రీతూ చౌదరీ ప్లాన్ అంతా రివర్స్, మరో చీకటి కోణం బయటపెట్టిన హీరో ధర్మ మహేష్‌ భార్య.. కోలుకోలేని దెబ్బే
Recommended image2
కిర్రాక్‌ ఆర్పీ మోసం చేశాడు, ఆయన వల్లే జబర్దస్త్ వదిలేశా.. ప్రియుడు హ్యాండిచ్చాడు.. జబర్దస్త్ కమెడియన్‌ ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved