MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కిర్రాక్‌ ఆర్పీ మోసం చేశాడు, ఆయన వల్లే జబర్దస్త్ వదిలేశా.. ప్రియుడు హ్యాండిచ్చాడు.. జబర్దస్త్ కమెడియన్‌ ఆవేదన

కిర్రాక్‌ ఆర్పీ మోసం చేశాడు, ఆయన వల్లే జబర్దస్త్ వదిలేశా.. ప్రియుడు హ్యాండిచ్చాడు.. జబర్దస్త్ కమెడియన్‌ ఆవేదన

జబర్దస్త్ కమెడియన్‌ తన్మయ్‌ షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. కిర్రాక్‌ ఆర్పీ తనని మోసం చేశాడని తెలిపారు. అంతేకాదు ప్రేమించినవాడు కూడా మోసం చేసినట్టు తెలిపారు. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Sep 23 2025, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`జబర్దస్త్` షోతో పాపులర్‌ అయిన తన్మయ్‌
Image Credit : Youtube/Idream

`జబర్దస్త్` షోతో పాపులర్‌ అయిన తన్మయ్‌

జబర్దస్త్‌ కామెడీ షో ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్‌ కమెడియన్‌గా ఎదిగారు. ఇప్పుడు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. మరికొంత మంది బుల్లితెర స్టార్స్ గా రాణిస్తున్నారు. కానీ ఇది హాస్యనటులకు మంచి వేదికగా చెప్పొచ్చు. అయితే ఈ షోకి ప్రారంభంలో లేడీ కమెడియన్లు వచ్చేవారు కాదు, దీంతో లేడీ గెటప్‌ వేసిన వారికి మంచి డిమాండ్‌ ఉండేది. అలా వచ్చి స్టార్‌ కమెడియన్‌గా ఎదిగారు తన్మయ్‌. చలాకీ చంటి సపోర్ట్ తో పరిచయమై, రాకింగ్‌ రాకేష్‌ టీమ్‌లో వర్క్ చేసి మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

25
జబర్దస్త్ కమెడియన్‌ తన్మయ్‌ ఫేస్‌ చేసిన మోసాలు
Image Credit : Youtube/Idream

జబర్దస్త్ కమెడియన్‌ తన్మయ్‌ ఫేస్‌ చేసిన మోసాలు

ట్రాన్స్ జెండర్‌గా మారిన తన్మయ్‌ ఇటీవల కనిపించడం లేదు. జబర్దస్త్ కి, బుల్లితెరకు దూరమయ్యారు. అడపాదడపా కనిపించినా, మునుపటి జోరు కనిపించడం లేదు. ఈ క్రమంలో తన పర్సనల్‌ లైఫ్‌లోని షాకిచ్చే విషయాలను పంచుకున్నారు తన్మయ్‌. తాను మోసపోయినట్టు తెలిపారు. అటు జబర్దస్త్ లో తోటివారే మోసం చేస్తే, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ప్రేమించిన వాడు మోసం చేశాడని తెలిపారు. తాను అనేక ఇబ్బందులు ఫేస్‌ చేసినట్టు, ఇప్పుడు ఏకంగా ఆర్థికంగానూ ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. మనుషులను ప్రేమించే వారు కరువయ్యారని, డబ్బుని ప్రేమించే వారు ఎక్కువగా ఉంటున్నారని, ప్రేమించిన వాడు కూడా డబ్బునే ప్రేమించినట్టు తెలిపారు. ఐడ్రీమ్‌ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు తన్మయ్‌.

Related Articles

Related image1
ఒకే ఫ్రేములో వెంకటేష్‌, చిరంజీవి, శ్రీదేవి, నాగార్జున, వర్మ.. సంచలన మూవీ సెట్‌లో, ఫోటో వెనుక స్టోరీ
Related image2
బిగ్ బాస్ 9 షో 2.0.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ బజ్.. లిస్ట్ లో ఎవరెవరంటే?
35
రాకింగ్‌ రాకేష్‌ లైఫ్‌ ఇచ్చాడు
Image Credit : Youtube/Idream

రాకింగ్‌ రాకేష్‌ లైఫ్‌ ఇచ్చాడు

తాను కాలేజీలో ఉన్న సమయంలో జబర్దస్త్ టీమ్ ఒకసారి కాలేజీ ఈవెంట్‌కి వచ్చారని, ఆ సమయంలో తాను వారితో కలిసి పర్‌ఫామ్‌ చేస్తే మెచ్చుకున్నారని, గెటప్‌ వేసి కనిపించడం, వారితో బాగా కలిసిపోయి ఎంటర్‌టైన్‌ చేయడంతో వెంటనే తనని జబర్దస్త్ కి పిలిచారని తెలిపారు తన్మయ్‌. చలాకీ చంటి, రాకింగ్‌ రాకేష్‌ పిలుపు మేరకు కామెడీ షోకి వెళ్లానని, జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు, లైఫ్‌ ఇచ్చింది రాకేష్‌ అని తెలిపారు. ఆయన టీమ్‌లోనే ఎక్కువగా పనిచేసినట్టు తెలిపారు. ఈ షో తనకు విశేషమైన గుర్తింపుని, పాపులారిటీని తీసుకొచ్చిందన్నారు. ఆ పేరుతోనే ఇన్నాళ్లు సర్వైవ్‌ అవుతున్నట్టు తెలిపారు. అయితే తాను ట్రాన్స్ జెండర్‌గా మారడంతో అనేక విమర్శలు, హేళనలు ఫేస్‌ చేశాను. కానీ జబర్దస్త్‌ షో ఇమేజ్‌ కాపాడిందన్నారు.

45
కిర్రాక్‌ ఆర్పీ మోసం చేశాడుః తన్మయ్‌
Image Credit : Asianet News

కిర్రాక్‌ ఆర్పీ మోసం చేశాడుః తన్మయ్‌

ఇదిలా ఉంటే కిర్రాక్‌ ఆర్ఫీ తనని మోసం చేశాడని వెల్లడించారు తన్మయ్‌. ఆయన పిలవడంతోనే జబర్దస్త్ మానేసి `అదిరింది` షోకి వెళ్లానని, ఆ తర్వాత తనని వదిలేశాడని, నమ్మించి మోసం చేశాడని చెప్పారు. `కిర్రాక్‌ ఆర్పీని సొంత అన్నగా ట్రీట్‌ చేశాను, కానీ ఆయన మైండ్‌ సెట్‌ అంతా వేరు. దాని గురించి నేనేమీ అనను. కానీ పర్సనల్‌ విషయాల్లో ఆయన విషయంలో బాధపడ్డాను. తనకు ఒక దశలో చాలా సపోర్టివ్‌గా నిలబడ్డాను. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. ఆర్థికపరంగానూ హెల్ప్ చేశాను, కానీ ఆయన వల్లే షో నుంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత తనతో మాట్లాడటంగానీ, ఎలా ఉన్నావ్‌, ఏం చేస్తున్నావని ఎప్పుడూ ఫోన్‌ చేయలేదని, ఇబ్బందుల్లో ఉన్న కూడా పట్టించుకోలేదని, ఆయన్ని నమ్మి చాలా మోసపోయానని, చాలా నష్టపోయానని తెలిపారు తన్మయ్‌.

55
ప్రేమించిన వాడు కూడా మోసం చేశాడు
Image Credit : Youtube/Idream

ప్రేమించిన వాడు కూడా మోసం చేశాడు

డబ్బు, నమ్మకం చాలా పాపిష్టివి. ఒక మనిషిని బాగా చేయాలన్నా, నాశనం చేయాలన్నా ఈ రెండే కారణం. ఈ రోజుల్లో డబ్బు మీదనే అన్నీ నడుస్తున్నాయి. నో రిలేషన్స్, నో ఎఫెక్షన్స్. అరే మనకు ఎంత సహాయం చేశారనేది కూడా లేదు కొందరికి. నేను ఎంత సాయం చేశాననేది కిర్రాక్‌ ఆర్పీకి తెలుసు. ఆర్పీనే కాదు, ఒకడు ప్రేమించి మోసం చేశాడు. నీకు నేనున్నా అన్నాడు. ప్రేమ చూపించారు. అతనికి అన్నిరకాలుగా సహాయం చేశాను. ఆర్థికంగానూ సపోర్ట్ చేశాను. ఎనిమిదేళ్లు అతన్ని, అతని కుటుంబాన్ని చూసుకున్నా. కానీ తీరా నన్ను మోసం చేసి వెళ్లిపోయాడు. ఇక ప్రేమపై నమ్మకం లేదని, కొన్ని బయట చూస్తుంటే మళ్లీ ఇలాంటివి వద్దులే అనిపిస్తుంది. పెళ్లిపై కూడా ఆసక్తిలేదని తెలిపారు తన్మయ్‌. ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
Recommended image2
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Recommended image3
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Related Stories
Recommended image1
ఒకే ఫ్రేములో వెంకటేష్‌, చిరంజీవి, శ్రీదేవి, నాగార్జున, వర్మ.. సంచలన మూవీ సెట్‌లో, ఫోటో వెనుక స్టోరీ
Recommended image2
బిగ్ బాస్ 9 షో 2.0.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ బజ్.. లిస్ట్ లో ఎవరెవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved