MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీకాంత్ కు భార్యగా, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

శ్రీకాంత్ కు భార్యగా, వదినగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

ఓ స్టార్ హీరోయిన్ హీరో శ్రీకాంత్ కు భార్య గా, వదినగా నటించింది. సినిమాల్లో ఇవన్నీ కామన్, స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ చేసి తర్వాత తల్లి పాత్రలు చేసిన వారుకూడా ఉన్నారు. ఇంతకీ శ్రీకాంత్ సినిమాల్లోభార్య గా, వదినగా చేసిన స్టార్ హీరోయిన్ ఎవరు? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 25 2025, 10:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit : Asianet News

సినిమాల్లో ఎవరు ఎప్పుడు ఎలాంటి పాత్రలు చేయాల్సి వస్తుందో చెప్పలేం. ఆ కాలంలో స్టార్ హీరోల సరసన హీరోయిన్లు గా నటించిన తారలు ఆతరువాత వారికే అమ్మ పాత్రలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ఆతరువాత జనరేషన్ లో కూడా ఇలాంటివి లేకపోలేదు. 

మహేష్ బాబుతో ఐటమ్ సాంగ్ చేసిన రమ్యకృష్ణ.. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలో అమ్మ పాత్ర కూడా చేసింది. ఈక్రమంలోనే ఓ స్టార్ హీరోయిన్ శ్రీకాంత్ భార్య పాత్ర చేసింది.. ఆతరువాత మరో సినిమాలో వదిన పాత్రలో కనిపించింది. ఆమె ఎవరో కాదు స్నేహ.

26
Image Credit : our own

ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరో శ్రీకాంత్‌. ఈ ఫ్యామిలీ హ్యాండ్సమ్ హీరోకి 90 దశాబ్ధం చివరల్లో స్టార్ డమ్ స్టార్ట్ అయ్యింది. 2000ల ప్రారంభంలో శ్రీకాంత్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. విలన్‌గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్, తక్కువ కాలంలోనే హీరోగా ఎదిగి, ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈమధ్యకాలంలో సహాయ పాత్రలు, విలన్ రోల్స్ లో కూడా అలరించిన శ్రీకాంత్ ఇటీవల ‘అఖండ’, ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Related Articles

Related image1
పవన్ కళ్యాణ్ కు కట్టప్ప స్ట్రాంగ్ వార్నింగ్, సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు
Related image2
బాలకృష్ణ, మంచు విష్ణు కాంబినేషన్ లో మిస్ అయిన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?
36
Image Credit : radha gopalam poster

అయితే శ్రీకాంత్ కెరీర్‌లో ఆసక్తికరమైన ఒక విషయం జరిగింది. ఒక స్టార్ హీరోయిన్ శ్రీకాంత్ తో రెండు విభిన్న పాత్రల్లో నటించింది. ఒక సినిమాలో భార్యగా, మరో సినిమాలో వదినగా నటించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు స్నేహ. 2005 లో బాపు డైరెక్షన్ లో వచ్చిన రాధా గోపాళం సినిమాలో శ్రీకాంత్, స్నేహ జంట భార్య భర్తలు గా నటించగా, అదే ఏడాది విడుదలైన సంక్రాంతి సినిమాలో స్నేహ వెంకటేష్ భార్యగా నటించింది. ఆ సినిమాలో శ్రీకాంత్ వెంకటేష్ తమ్ముడిగా కనిపించాడు. , ఆ సినిమాలో స్నేహ వదిన పాత్రలో కనిపించింది.

46
Image Credit : idlebrain

ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మరో సోనాలీ బింద్రే కూడా శ్రీకాంత్‌కు లవర్ గా , వదినగా నటించింది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రే శ్రీకాంత్‌కు లవర్‌గా నటించింది. ఈ సినిమాలో వీరి మధ్య వచ్చిన "నువ్వు నువ్వు" పాట ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. సోనాలి, శ్రీకాంత్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఆ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

56
Image Credit : google

ఇక 2004లో మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆయన చిరంజీవికి తమ్ముడిగా నటించగా, చిరు సరసన హీరోయిన్‌గా సోనాలి బింద్రే కనిపించారు. అంటే, ఈ సినిమాలో సోనాలి బింద్రే ను శ్రీకాంత్‌ వదినమ్మ అంటూ పిలుస్తాడు. ఇలా కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఒకే హీరోయిన్ శ్రీకాంత్‌కు రెండు భిన్న పాత్రల్లో.. ఒకసారి లవర్‌గా, మరోసారి వదినగా నటించింది.

66
Image Credit : our own

ఇవన్నీ చూస్తే, తెలుగు చిత్ర పరిశ్రమలో కథకు అనుగుణంగా హీరో-హీరోయిన్ల పాత్రలు ఎలా మారిపోతాయో అర్ధం అవుతుంది. అయితే ప్రేక్షకులు అంగీకరించినంతవరకూ ఎలాంటి పాత్రలైనా నటులు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆడియన్స్ ఆక్సప్ట్ చేయకపోతే ఫలితాలు బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. ఇక శ్రీకాంత్ కాని, స్నేహా, సోనాలీ బిందే కూడా తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ ముగ్గరు తారలకు ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎక్కువ.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Anudeep KV: నెక్ట్స్ సినిమా ఇదే, వెంకీతో కాదా? ఫంకీలో వాళ్లపై సెటెర్లు.. హరీష్‌ నాగవంశీ, దిల్‌ రాజు మెరుపులు
Recommended image2
ఓటీటీ అభిమానులకు షాక్‌.. థియేటర్లోకి శివాజీ `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని`?
Recommended image3
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Related Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ కు కట్టప్ప స్ట్రాంగ్ వార్నింగ్, సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
బాలకృష్ణ, మంచు విష్ణు కాంబినేషన్ లో మిస్ అయిన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved