- Home
- Entertainment
- 33 సెకన్ల కిస్సింగ్ సీన్ డిలీట్, సెన్సార్ వాళ్ళకి సెన్స్ లేదు అంటూ దుమ్మెత్తిపోస్తున్న హీరోయిన్
33 సెకన్ల కిస్సింగ్ సీన్ డిలీట్, సెన్సార్ వాళ్ళకి సెన్స్ లేదు అంటూ దుమ్మెత్తిపోస్తున్న హీరోయిన్
రీసెంట్ గా హాలీవుడ్ చిత్రం సూపర్ మాన్ థియేటర్లలో విడుదలైంది. ఇండియాలో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ చిత్రంలో 33 సెకండ్ల కిస్సింగ్ సన్నివేశాన్ని సెన్సార్ బోర్డు తొలగించింది.

సినిమాల్లో ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగులు ఉంటే వాటిని తొలగించడం సెన్సార్ బోర్డు పని. రీసెంట్ గా హాలీవుడ్ చిత్రం సూపర్ మాన్ థియేటర్లలో విడుదలైంది. ఇండియాలో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రంలో 33 సెకండ్ల కిస్సింగ్ సన్నివేశాన్ని సెన్సార్ బోర్డు తొలగించింది. దీంతో ఆ సన్నివేశం లేకుండానే సూపర్ మ్యాన్ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. సెన్సార్ బోర్డు చేసిన ఈ చర్య పై హీరోయిన్ శ్రేయ ధన్వంతరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది సెన్సార్ బోర్డు చేసిన సెన్స్ లెస్ పని అంటూ శ్రేయ ధన్వంతరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సెన్సార్ బోర్డుని తీవ్రంగా విమర్శిస్తూ శ్రేయ ధన్వంతరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సెన్సార్ బోర్డు చేసే ఇలాంటి అర్థంపర్థం లేని చర్యల వల్ల ప్రేక్షకులకు సినిమాని థియేటర్లలో చూడాలని ఆసక్తి తగ్గిపోతుంది.
కిస్సింగ్ సీన్ ని ఎందుకు డిలీట్ చేశారో అర్థం కావడం లేదు. ఇలాంటి చర్యల వల్లే ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడుతున్నారు. సినిమాలను థియేటర్లలో చూడాలని సెన్సార్ వాళ్లు కోరుకుంటారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదని విమర్శించేది కూడా వాళ్లే. ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు అనేది మాత్రం అర్థం చేసుకోరు.
ప్రేక్షకులు బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం సినిమాలని థియేటర్లలో చూడాలని అనుకుంటారు. వాళ్లు కోరుకున్న అన్ని అంశాలు లేకుంటే తప్పకుండా నిరాశ కలుగుతుంది. సెన్సార్ వాళ్లు ప్రేక్షకులను ఇంకెంతకాలం చిన్న పిల్లలుగా భావిస్తారు అంటూ శ్రేయ ధన్వంతరి విమర్శించారు. శ్రేయ ధన్వంతరి తెలుగులో నాగచైతన్య జోష్ చిత్రంలో ఒక పాత్రలో నటించింది. అదేవిధంగా స్నేహ గీతం చిత్రంలో కూడా నటించింది. ఫ్యామిలీ మెన్ సిరీస్ లో కూడా ఆమె భాగమైంది.