MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆమె బ్రతికుంటే ఇండియాలోనే టాప్ హీరోయిన్ అయి ఉండేది, సౌందర్య కాదు.. మోహన్ బాబు కామెంట్స్

ఆమె బ్రతికుంటే ఇండియాలోనే టాప్ హీరోయిన్ అయి ఉండేది, సౌందర్య కాదు.. మోహన్ బాబు కామెంట్స్

మోహన్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో అసెంబ్లీ రౌడీ ఒకటి. బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1991 లో విడుదల సంచలన విజయం సాధించింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 12 2025, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ మూవీ
Image Credit : Facebook/Mohan Babu

మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ మూవీ

మోహన్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో అసెంబ్లీ రౌడీ ఒకటి. బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1991 లో విడుదల సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో మోహన్ బాబు కామెడీ టైమింగ్ తో కూడిన నటన, సెంటిమెంట్, పొలిటికల్ సన్నివేశాలు, దివ్యభారతి గ్లామర్ హైలెట్ గా నిలిచాయి.

25
వాస్తు బాగలేని బంగ్లాలో ప్లాన్
Image Credit : Facebook/Mohan Babu

వాస్తు బాగలేని బంగ్లాలో ప్లాన్

ఈ చిత్రం గురించి మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విశేషాలు పంచుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు చెన్నైలోని తన ఆఫీసులో జరిగినట్లు మోహన్ బాబు తెలిపారు. ఆ ఆఫీస్ కి వాస్తు సరిగా లేదని చాలామంది చెప్పేవాళ్ళు. అది పాత బంగ్లా. వాస్తు గురించి చాలా విధాలుగా చెప్పినప్పటికీ నేను ఆ బంగ్లా అని వదిలిపెట్టలేదు.

Related Articles

Related image1
స్టార్ హీరోతో మూవీ నిర్మించాలనుకుని అతడినే అల్లుడిగా చేసుకున్న డైరెక్టర్ కూతురు..ఆ సంఘటన తెలిసినప్పటికీ..
Related image2
ఆ హీరోయిన్ తో జీవితంలో నటించకూడదు అనుకున్న ఎన్టీఆర్, ఏఎన్నార్..ఆమె లేకుంటే ఈ చిత్రాల పరిస్థితి అంతే..
35
దివ్య భారతిని వద్దన్నారు
Image Credit : Facebook/Mohan Babu

దివ్య భారతిని వద్దన్నారు

ఇక హీరోయిన్ గా ఈ చిత్రంలో దివ్యభారతిని తీసుకోవాలని అనుకున్నా. అప్పటికే ఆమె తెలుగులో మొదటి చిత్రం మాత్రమే చేస్తుంది. ఆ అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవద్దు.. షూటింగ్ నుంచి త్వరగా వెళ్ళిపోతుంది అని చాలామంది దివ్యభారతి గురించి నెగటివ్ కామెంట్స్ చేశారు. అయినప్పటికీ దివ్యభారతినే హీరోయిన్ గా తీసుకున్నట్లు మోహన్ బాబు తెలిపారు. దివ్యభారతి కనుక బ్రతికి ఉంటే ఇండియాలోనే టాప్ హీరోయిన్ అయి ఉండేది అని మోహన్ బాబు అన్నారు. అంత టాలెంట్, అందం ఆమె సొంతం.

45
దివ్య భారతితో గొడవలు
Image Credit : Facebook/Mohan Babu

దివ్య భారతితో గొడవలు

కానీ అది ఆ అమ్మాయి తలరాత. చిన్న వయసులోనే మరణించింది అని మోహన్ బాబు అన్నారు. షూటింగ్ సమయంలో ఆ అమ్మాయికి నాకు కొన్ని గొడవలు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి లేదు కాబట్టి ఆ గొడవలు గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు.

55
అసెంబ్లీ రౌడీ బ్లాక్ బస్టర్ హిట్
Image Credit : IMDB

అసెంబ్లీ రౌడీ బ్లాక్ బస్టర్ హిట్

ఈ చిత్రంలో మోహన్ బాబు తల్లిదండ్రులుగా జగ్గయ్య, అన్నపూర్ణ నటించారు. జగ్గయ్య పాత్ర కోసం ముందుగా రావు గోపాలరావు గారిని అడిగాం. ఆయన నో చెప్పడంతో ఆ తర్వాత జగ్గయ్య గారిని సంప్రదించడం ఆయన ఓకే చెప్పడం జరిగింది. మొత్తంగా అసెంబ్లీ రౌడీ చిత్రం విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. మోహన్ బాబు కెరీర్ లో మెమొరబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
మంచు మోహన్ బాబు

Latest Videos
Recommended Stories
Recommended image1
మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ సీరియల్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Illu Illalu Pillalu: నోరు జారి.. లంచం ఇచ్చి ఉద్యోగం కొన్న నిజం బయటపెట్టిన సాగర్, వల్లి మరో కుట్ర
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోను ఎడాపెడా వాయించిన పారు- ఇంట్లో నుంచి వెళ్లిపోతానన్న కాంచన
Related Stories
Recommended image1
స్టార్ హీరోతో మూవీ నిర్మించాలనుకుని అతడినే అల్లుడిగా చేసుకున్న డైరెక్టర్ కూతురు..ఆ సంఘటన తెలిసినప్పటికీ..
Recommended image2
ఆ హీరోయిన్ తో జీవితంలో నటించకూడదు అనుకున్న ఎన్టీఆర్, ఏఎన్నార్..ఆమె లేకుంటే ఈ చిత్రాల పరిస్థితి అంతే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved