MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత ఫస్ట్ లవ్ నాగచైతన్య కాదా? స్టార్ హీరోయిన్ మొదటి ప్రేమ ఎవరితోనో తెలుసా?

సమంత ఫస్ట్ లవ్ నాగచైతన్య కాదా? స్టార్ హీరోయిన్ మొదటి ప్రేమ ఎవరితోనో తెలుసా?

నాగచైతన్యతో దాదాపు ఏడేళ్లు ప్రేమ, మూడేళ్లు పెళ్లి బంధం తరువాత, విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది సమంత. అయితే నాగచైతన్య కంటే ముందు సమంతను ప్రేమించింది ఎవరో తెలుసా? సమంత స్వయంగా వెల్లడించిన నిజం ఏంటి.?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 05 2025, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Social Media

సమంత టాలీవుడ్ ఎంట్రీ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతర ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సినిమాల విషయం పక్కన పెడితే వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సమంత జీవితంలో జరిగాయి. 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన "ఏమాయ చేసావే" సినిమా ద్వారా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టింది సమంత.  

25
Image Credit : Social Media

నాగచైతన్యతో పెళ్లి, విడాకులు

ఏమాయ చేసావే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఆతరువాత ఏడేళ్ల పాటు సీక్రేట్ గా ప్రేమించుకున్న వీరిద్దరు 2017 , గోవలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. పెళ్లైన మూడేళ్లకే మనస్పర్దల కారణంగా విడిపోయి విడాకులు తీసుకున్నారు స్టార్ కపుల్.

Related Articles

Related image1
శోభన్ బాబుని 5000 కోట్లకు అధిపతిని చేసిన ఒక్క సలహా ఎవరిచ్చారో తెలుసా?
Related image2
300 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తో విజయ్ దళపతిని దాటేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?
35
Image Credit : X/samantha

సమంత ప్రస్తుతం ఒంటరిగా లైఫ్ ను లీడ్ చేస్తుండగా. నాగచైతన్య మాత్రం మరో హీరోయిన్ శోభిత దూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక సమంతకు సబంధించిన పాత విషయం ఒకటి వైరల్ అవుతోంది. గతంలో సమంత వెల్లడించిన విషయం ప్రకారం చైతన్య కంటే ముందే, తాను మరో వ్యక్తిని ప్రేమించానని సమంత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.సమంత తన టీనేజ్ కాలంలో జరిగిన విషయం గురించి ఓ విశేషాన్ని షేర్ చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, సమంత చదువుకునే రోజుల్లో బస్సులో ప్రయాణించేవారట. చెన్నైలో చదువుకుంటున్నప్పుడు పల్లవరం నుంచి టీనగర్ వరకు చదువుల కోసం రోజూ రెండు బస్సులు మారాల్సి వచ్చేది.

45
Image Credit : Instagram

అలా బస్సులు మారుతున్న సమయంలో ఓ అబ్బాయి ప్రతిరోజూ ఆమె బస్ స్టాప్ వద్ద ఎదురుచూస్తూ స్కూల్‌ వరకు ఫాలో అయ్యేవాడట. రెండు సంవత్సరాల పాటు అతను సమంతను ఫాలో అయ్యాడట. కాని ఏమీ మాట్లాడలేదట. ఇక ఇలా కుదరదు అని సమంత స్వయంగా ఒకసారి ధైర్యం చేసి అతని వద్దకు వెళ్లి, “నువ్వెందుకు నన్ను ఫాలో అవుతున్నావ్?” అని ప్రశ్నించగా, “నేను నిన్ను ఫాలో కావడం ఏంటీ?” అని ఆశ్చర్యంగా చెప్పాడట. ఇది ప్రేమా కాదో తనకూ అర్థం కాలేదని, కానీ ఇదే తన ఫస్ట్ లవ్ అని సమంత చెప్పారు. ఆమె మాటల్లో చూస్తే, సమంత కూడా అతనిపై కొంత ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. కానీ ఆ అబ్బాయి ధైర్యం చేయకపోవడం వల్ల ఆ ప్రేమ ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది.

55
Image Credit : instagram

ఇలా సమంత జీవితంలో ఏమాత్రం ముందుకు వెళ్లని పస్ట్ లవ్ గా ఆ సంఘటన మిగిలిపోయింది. ఇక పెళ్లి విడాకుల తరువాత సమంత సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డారు. దీనితో పాటు అనేక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడింది. అందుకే ప్రస్తుతం సినిమాలు తగ్గించింది. అయినప్పటికీ, ప్రస్తుతం "మా ఇంటి బంగారం" అనే లేడీ ఓరియెంటెడ్ మూవీని చేస్తున్నారు. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లతో పాటు నిర్మాతగా కొన్ని సినిమాలు చేశారు సమంత. డైరెక్టర్ రాజ్ నిడమూరితో క్లోజ్ గా మూవ్ అవుతోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సమంత రూత్ ప్రభు
నాగ చైతన్య
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: రేపు జరగబోయేది ఈరోజే న్యూస్ పేపర్లో వస్తే.. ఊహకందని ట్విస్టులు బాబోయ్. ఈ వెబ్ సిరీస్ చూశారా.?
Recommended image2
కళ్యాణ్ పడాల తనూజ మధ్య మళ్లీ మొదలయ్యిందా..? ఏకంగా రింగు తొడిగిన బిగ్ బాస్ విన్నర్..
Recommended image3
3 ఏళ్లకంటే ఎక్కువ బ్రతకడన్న డాక్టర్లు, 30 ఏళ్లు హ్యాపీగా బ్రతికి చూపించిన ఏఎన్నార్.. ఎలా సాధ్యమయ్యింది?
Related Stories
Recommended image1
శోభన్ బాబుని 5000 కోట్లకు అధిపతిని చేసిన ఒక్క సలహా ఎవరిచ్చారో తెలుసా?
Recommended image2
300 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తో విజయ్ దళపతిని దాటేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved