MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సెల్ఫీతో చిగురించిన ప్రేమ.. కాంతారకు వెన్నెముకైన రిషబ్ శెట్టి భార్య ప్రగతి ఎవరు?

సెల్ఫీతో చిగురించిన ప్రేమ.. కాంతారకు వెన్నెముకైన రిషబ్ శెట్టి భార్య ప్రగతి ఎవరు?

రిషబ్ శెట్టి, ప్రగతి శెట్టిల పరిచయం, ప్రేమ, పెళ్లి, ప్రస్తుత బంధం గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి ప్రేమకథ గురించి ఈ కథనంలో చూద్దాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 08 2025, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రిషబ్ శెట్టి లవ్ స్టోరీ
Image Credit : @Rishabshetty/ Instagram

రిషబ్ శెట్టి లవ్ స్టోరీ

కాంతార చాప్టర్ 1 సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో రోజూ 7000కు పైగా థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో నడుస్తోంది. చాలా మంది వీఐపీలు కూడా కాంతార సినిమా చూసి సోషల్ మీడియా ద్వారా ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో, రిషబ్ శెట్టి, అతని భార్య ప్రగతి శెట్టి వ్యక్తిగత విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి.

25
కాస్ట్యూమ్ డిజైనర్ గా ప్రగతి
Image Credit : X

కాస్ట్యూమ్ డిజైనర్ గా ప్రగతి

రిషబ్ శెట్టి, ప్రగతి శెట్టిల పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి చర్చలు వైరల్ అవుతున్నాయి. రిషబ్ భార్య ప్రగతి శెట్టి సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. కాంతార చాప్టర్ 1లో మీరు చూసిన రాజుల దుస్తులను ప్రగతే డిజైన్ చేశారు. రిషబ్‌తో ప్రేమ గురించి ప్రగతి పాత ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

Related Articles

Related image1
విజయ్ దేవరకొండ లగ్జరీ హౌస్ లోపలి ఫోటోలు చూశారా, రౌడీ హీరోకి ప్రాణంగా మారిపోయిన మరో ఫ్యామిలీ మెంబర్
Related image2
హరిత హరీష్ భార్య తన భర్తని పవన్ కళ్యాణ్ తో పోల్చడం కరెక్టేనా ? ఈ మూడు ప్రశ్నలకు మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్
35
ఆ హీరో వల్లే పరిచయం 
Image Credit : Instagram

ఆ హీరో వల్లే పరిచయం 

 “మా ప్రేమ పెళ్లికి రక్షిత్ శెట్టి కారణం. 'ఉళిదవారు కండంతే' చూశాక నేను, నా ఆఫీస్ ఫ్రెండ్స్ రక్షిత్ శెట్టికి ఫ్యాన్స్ అయ్యాం. అతని తర్వాతి సినిమా 'రిక్కీ' రిలీజ్ అయినప్పుడు, వీకెండ్‌లో థియేటర్‌కు వెళ్లాం. అక్కడ చాలామంది రక్షిత్‌తో సెల్ఫీలు తీసుకుంటున్నారు. కానీ రిషబ్ పక్కన నిలబడి ఉన్నారు. మా ఫ్రెండ్ ఒకరు రిషబ్‌ను చూపి, అతనే ఈ సినిమా డైరెక్టర్ అని చెప్పారు” అని ప్రగతి ఇంటర్వ్యూలో తెలిపారు.

45
ఇద్దరం ఒకే ఊరు వాళ్ళం 
Image Credit : Instagram

ఇద్దరం ఒకే ఊరు వాళ్ళం 

"అప్పుడు నేను వెళ్లి రిషబ్ శెట్టితో సెల్ఫీ తీసుకున్నాను. నా స్నేహితులు కూడా ఫోటోలు తీసుకున్నారు. మాట్లాడుతుండగా మేమిద్దరం ఒకే ఊరు, కుందాపుర వాళ్లమని తెలిసింది. బెంగళూరులో కలవడంతో, ఒకే ఊరు కావడంతో త్వరగా దగ్గరయ్యాం. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో స్నేహం పెరిగింది. తర్వాత, మొబైల్ నంబర్లు మార్చుకుని స్నేహం ప్రేమగా మారింది'' అని ప్రగతి చెప్పారు.

55
దేశం మొత్తం గుర్తించే జంట
Image Credit : Instagram

దేశం మొత్తం గుర్తించే జంట

ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో, మా కుటుంబాలు త్వరగా దగ్గరయ్యాయి. మాటలు జరిగి పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిదండ్రులం' అని ప్రగతి నవ్వుతూ చెప్పారు. రక్షిత్ శెట్టి అభిమానిగా 'రిక్కీ' సినిమాకు వచ్చి, రిషబ్ శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రగతి. ఇప్పటికీ ప్రగతి స్నేహితులు 'నీకు రిషబ్ దొరకడానికి మేమే కారణం' అని అంటారట. ఏదేమైనా, ఈ రోజు రిషబ్, ప్రగతి దేశం మొత్తం గుర్తించే జంటగా వెలిగిపోతున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు నటులు ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?
Recommended image2
విజయ్ దేవరకొండ గురించి పెడుతుందనుకుంటే.. విక్కీ కౌశల్‌ను తలచుకున్న రష్మిక మందన్న.. వాలెంటైన్స్ డే స్పెషల్
Recommended image3
రామ్ చరణ్ తో త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా.. ఎలా మిస్ అయ్యిందో తెలుసా?
Related Stories
Recommended image1
విజయ్ దేవరకొండ లగ్జరీ హౌస్ లోపలి ఫోటోలు చూశారా, రౌడీ హీరోకి ప్రాణంగా మారిపోయిన మరో ఫ్యామిలీ మెంబర్
Recommended image2
హరిత హరీష్ భార్య తన భర్తని పవన్ కళ్యాణ్ తో పోల్చడం కరెక్టేనా ? ఈ మూడు ప్రశ్నలకు మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved